బాక్సింగ్ డే టెస్ట్: తిరిగి ఓపెనర్ గా రోహిత్ శర్మ ?
తుది జట్టులోకి ధ్రువ్ జురేల్, బెంచ్ కే పరిమితం కానున్న శుభ్ మన్ గిల్
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫి సిరీస్ లో నాలుగో టెస్ట్ రేపు మెల్ బోర్న్ వేదికగా జరగబోతుంది. ప్రతి ఏడాది ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఆశలు ఉంటాయి.
రోహిత్ శర్మ ఈ సిరీస్ లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వస్తున్నాడు. అయితే బాక్సింగ్ డే టెస్ట్ లో మాత్రం తిరిగి ఓపెనర్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు. నాలుగు లో కోహ్లి, ఐదో లో పంత్, ఆరో స్థానంలో గిల్ లేదా ధ్రువ్ జురెల్ ను తుది జట్టులోకి వస్తారని అంచనాలు ఉన్నాయి. మూడు టెస్టులు ముగిసేనాటికి ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి.
చిరాకుపడ్డ రోహిత్..
ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా రోహిత్ బ్యాటింగ్ పొజిషన్ గురించి అడగగా అతను చిరాకు పడ్డాడు.‘‘ అది ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పలేనిది. మ్యాచ్ జరిగే ముందు అది తెలుస్తుంది. ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేస్తారో మాకో ప్రణాళిక ఉంది’’ అని చెప్పాడు.
సిరీస్ గెలవాలనే కసిలో ఆస్ట్రేలియా..
2014 లో బీజీటీ సిరీస్ ను ఆసీస్ ను చివరిసారిగా గెలిచింది. అది కూడా ఆస్ట్రేలియాలో. తరువాత భారత్ జైత్రయాత్ర మొదలైంది. అందుకే ఎలాగైన ఆసీస్ పట్టుదలగా ఆడుతోంది. బ్రిస్భేన్ లో వర్షం కారణంగా మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇది భారత్ కు సంతోషం కలిగించిన అంశం.
ఆసీస్ జట్టులో మార్నన్ లబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్ మంచి ఫామ్ లో ఉండగా, బౌలింగ్ లో స్టార్క్, కమిన్స్ కట్టుదిట్టంగా బంతులు విసురుతూ భారత బ్యాట్స్ మెన్లను కట్టుదిట్టం చేస్తున్నారు. రేపటి టెస్ట్ లో జోష్ హజిల్ వుడ్ గాయం కారణంగా ఆడటం లేదు. అతని స్థానంలో లోకల్ బాయ్ బోలాండ్ బరిలోకి దిగడం గ్యారెంటీ. మంచి లైన్ అండ్ లెగ్త్ తో బంతులు సంధించడం అతని ప్రత్యేకత.
విఫలమవుతున్న భారత బ్యాట్స్ మెన్లు..
భారత బ్యాట్స్ మెన్లు వరుసగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ జైస్వాల్, పంత్, శుభ్ మన్ గిల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. అలాగే సీనియర్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా భరోసా నింపలేకపోతున్నారు. కేవలం కేఎల్ రాహుల్ మాత్రమే తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.
భారత బౌలింగ్..
భారత బౌలింగ్ అటాక్ లో జస్‌ప్రీత్ బుమ్రా తప్పా ఎవరూ పెద్దగా రాణించడం లేదు. దాంతో ప్రత్యర్థులు సులువుగా పరుగులు సాధిస్తున్నారు. మరో వైపు ఆసీస్ తన మెక్ స్వీని తొలగించిన టీనేజర్ సామ్ కొన్ స్టాస్ ను రంగంలోకి దించింది. మెక్, బూమ్రా బౌలింగ్ లో తరుచుగా పెవిలియన్ చేరడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. సామ్ అటాకింగ్ గేమ్ ఆడగలడు.
ఎండ చుక్కలు చూపిస్తుందా?
ఆసీస్ లో ప్రస్తుతం ఎండాకాలం. అక్కడ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మెల్ బోర్న్ లో 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. రెండు జట్లు కేవలం స్పెషలిస్ట్ స్పిన్నర్ తోనే బరిలోకి దిగబోతున్నాయి. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. పేస్ కు ఎక్కువ అనుకూలంగా ఉండవచ్చు. అయితే పగుళ్లు లాంటివి ఉండకపోవచ్చని, మంచి బౌన్స్ ఉంటుందని, గతంలో నాథన్ లియోన్ ఈ వికెట్ లో మంచి ప్రతిభ కనపరిచారు. తుది జట్టులో వాషింగ్టన్ సుందర్ రావాలంటే నితీష్ రెడ్డి ని తొలగించాలి. కానీ ఇది మంచి పరిణామం కాదని విశ్లేషకులు అంటున్నారు.
స్క్వాడ్‌లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, తనుష్ కోటియన్, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్.
ఆస్ట్రేలియా (XI): పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్కస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
Next Story