RCB కేర్స్ను అభిమానుల మధ్యకు..
x

'RCB కేర్స్'ను అభిమానుల మధ్యకు..

బెంగళూరు తొక్కిసలాట ఘటన తర్వాత మూడు నెలలకు 'RCB కేర్స్'ను ప్రారంభించిన ప్రాంచైసీ


Click the Play button to hear this message in audio format

బెంగళూరు(Bangalore)లోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) సమీపంలో జరిగిన తొక్కిసలాట(stampede)లో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన జూన్ 4 జరిగింది. తిరిగి మూడు మాసాల అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గురువారం (ఆగస్టు 28) ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఇలా రాసి ఉంది.

"మేం చివరిసారిగా ఇక్కడ పోస్ట్ చేసి దాదాపు మూడు నెలలు అయింది. నిశ్శబ్దంగా ఉన్నామని కాదు. అది దుఃఖానికి సంకేతం. స్టేడియంతో ఎన్నో తీపి జ్ఞాపకాలు. కానీ జూన్ 4 అనుకోని ఘటన జరిగింది. మా మనస్సును తీవ్రంగా కలిచివేసిన రోజు. అప్పటి నుంచి తీవ్ర వేదనకు గురయ్యాం," అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది.


RCB కేర్స్ ఏర్పాటు..

"RCB కేర్స్" అవసరాన్ని వివరిస్తూ.."జూన్ 4 నాటి ఘటన మాకు ఎన్నో విషయాలు నేర్పింది. అందుకే ఆర్సీబీ కేర్స్‌ను తీసుకొచ్చాం. మా అభిమానులకు అండగా నిలవాలని ఈ వేదికను సిద్ధం చేశాం. అయితే ఈసారి కేవలం సంబరాలు మాత్రమే కాకుండా ఫ్యాన్స్‌ గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం.’’ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోస్టు చేసింది.


తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో తొలిసారి ఆర్‌సీబీ టైటిల్‌ దక్కించుకోవడంతో విక్టరీ పరేడ్ నిర్వహించాని ప్రాంఛైసీ భావించింది. అందులో భాగంగా చేపట్టిన విజయ్ యాత్ర చిన్నస్వామి స్టేడియం వరకు కొనసాగింది. వేల సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. మరో 50 మంది గాయపడ్డారు. ఘటన తర్వాత ఫ్రాంచైజీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషాద ఘటనకు బాధ్యత RCBనే అని చెప్పడంతో ప్రజల ఆగ్రహం ఇంకాస్త పెరిగింది.

Read More
Next Story