టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించిన అశ్విన్
x

టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించిన అశ్విన్

కుంబ్లే తరువాత అత్యధిక వికెట్లు తీసిన చెన్నై చిన్నోడు


భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. బ్రిస్భేన్ లో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన తరువాత విలేకరులతో మాట్లాడిన అశ్విన్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించారు.

చెన్నైకి చెందిన 38 ఏళ్ల అశ్విన్.. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తరువాత స్పిన్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. కుంబ్లే తరువాత రెండో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్ గా నిలిచాడు. తన కెరీర్ లో 106 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. నవంబర్ 6, 2011న ఢిల్లీలో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేయగా, అడిలైడ్ లో జరిగిన పింక్ బాల్ టెస్ట్ తన చివరి మ్యాచ్.
టెస్ట్ క్రికెట్‌లో 537 వికెట్లు తన ఖాతాలో ఉన్నాయి. దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఈ జాబితాలో 619 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. స్టార్ స్పిన్నర్ దేశం తరఫున 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో, అశ్విన్ 41 మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 195 వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో సరిగా ఫర్ ఫామ్ చేయని అశ్విన్ పై విమర్శలు వచ్చాయి. తరువాత ఆస్ట్రేలియా పర్యటనలో పింక్ బాల్ టెస్ట్ లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. భారత్ వచ్చే ఏడాది మార్చిలో ఇంగ్లండ్ లో పర్యటిస్తుంది. ఇక్కడ అశ్విన్ కు తుది జట్టులో చోటు లభించే అవకాశం లేదు. అందుకే అశ్విన్ ముందస్తుగా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.


Read More
Next Story