
క్రికెట్ మ్యాచ్ వేదిక మార్పు
పంజాబ్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ధర్మశాల నుంచి అహ్మదాబాద్‌కు..
భారత్ - పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ (PBKS) ముంబయి ఇండియన్స్(MI) ఐపీఎల్ (IPL) మ్యాచ్ వేదికను మార్చింది. ఈ రెండు జట్ల మధ్య హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో మే 11న మధ్యాహ్నం మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అక్కడ విమానాశ్రయాన్ని మూసివేయడంతో వేదికను అహ్మదాబాద్‌కు మార్చారు. ఉగ్రవాదులు దాడుల నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయంలో మే 10 వరకు వాణిజ్య విమానాల రాకపోకలను ఆపేశారు.
అందుకు అంగీకరించాం..
‘‘వేదిక మార్పు గురించి బీసీసీఐ మమ్మల్ని సంప్రదించింది. అందుకు మేం అంగీకరించాం,” అని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ తెలిపారు. పంజాబ్ కింగ్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..“మాకు బీసీసీఐ నుంచి సమాచారం లేదు. సమాచారం అందగానే ఒక నిర్ణయానికి వస్తాం” అని తెలిపారు.