తన తొలి కెప్టెన్ ‘ధోని’ బాటలోనే నిష్క్రమించిన అశ్విన్
టెస్ట్ క్రికెట్ లో కుంబ్లే తరువాత స్థానం చెన్నై చిన్నోడిదే
(ఆర్. కౌశిక్)
సరిగ్గా దశాబ్ధం క్రితం.. అంటే 30 డిసెంబర్ 2014 న బాక్సింగ్ డే టెస్ట్ ముగిసింది. ఆస్ట్రేలియా తో ఎంసీజీ లో ఈ మ్యాచ్ ను భారత్ డ్రా గా ముగించింది. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విలేకరుల సమావేశం ముగించిన కొద్ది సేపటికే బీసీసీఐ నుంచి ఓ ప్రకటన వచ్చింది.
‘ ధోని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్’ అవుతున్నట్లు ఆ ప్రకటన సారాంశం. తదుపరి టెస్ట్ మ్యాచ్ లకు విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉంటారని తెలియజేసింది. ఆకస్మాత్తుగా ఓ శిఖరం తన కెరీర్ ను ముగించింది. అంతకుముందు జరిగిన విలేకరుల సమావేశంలో కూడా ఎలాంటి తడబాటు, బాధ లేకుండా ధోని ఎలా మాట్లాడారని అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.
అప్పుడు ధోని కెప్టెన్సీలో ఓ ఆటగాడిగా ఎదుగుతున్నాడు అశ్విన్. ఎంసీజీ టెస్టు డ్రా అయినప్పుడు అశ్విన్ కూడా ధోనితో ఉన్నాడు. ఇప్పుడు ధోని అడుగుజాడల్లోనే అశ్విన్ నడిచాడు. తన తొలి టెస్టు కెప్టెన్ ప్రభావం చెన్నై చిన్నోడి మీద బాగానే పడినట్లు ఉంది. అందుకే ఎలాంటి చడి చప్పుడూ లేకుండా బుధవారం టెస్ట్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. అచ్చు సిరీస్ మధ్యలోనే కెరీర్ ముగించాడు.
తరం మారింది.. ఎంపిక మారింది..
అశ్విన్ రిటైర్ మెంట్ ను కొన్నిరోజుల ముందే నిఫుణులు ఊహించారు. బహుశా ఇంగ్లండ్ పర్యటన తరువాత గానీ లేదా ఈ సిరీస్ తరువాత రిటైర్ అవుతారని అనుకున్నారు.
ఈ సంవత్సర ప్రారంభంలో ఇంగ్లండ్ పై సాధించిన విజయాలు, బంగ్లాదేశ్ లో జరిగిన సిరీస్ లో బ్యాట్ తోనూ, బంతితోనూ అశ్విన్ రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకున్నాడు. అయితే అశ్విన్ లో మునుపటి వాడీ తగ్గిందని మాత్రం అర్థమయింది.
ముఖ్యంగా బంగ్లాతో జరిగిన రెండో టెస్ట్ లో బంతిపై నియంత్రణ కోల్పోయిన తీరు స్పష్టంగా కనిపించింది. అందుకే తరువాత న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో వాషింగ్టన్ సుందర్ ను బరిలోకి దించిన టీమ్ మేనేజ్ మెంట్ దింపడం, అతను సక్సెస్ కావడం చకాచకా జరిగిపోయాయి.
కొన్నాళ్లుగా విదేశాలలో ఆడుతున్న టెస్టులకు కేవలం ఒకే ఒక స్పిన్నర్ ను భారత్ ఆడిస్తుంది. ఇందులో అశ్విన్ కు చోటు దక్కడం లేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. దీనికి తోడు వయస్సు పెరిగింది.
అశ్విన్ కు ఇంతకంటే గొప్ప ముగింపు ఉండాలని అందరూ భావిస్తున్నారు. అంటే ఇలా ప్రెస్ కాన్పరెన్స్ రూమ్ లో కాకుండా మైదానంలో అందరి సమక్షంలో వీడ్కోలు పలికితే బాగుండేది. అభిమానులకు ఓ సంతృప్తి మిగిలేది. ఇప్పుడు రిటైర్ కావాలన్న నిర్ణయం అతనిదేనని, కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరులు ముందు చెప్పారు.
తన రిటైర్ మెంట్ పై అశ్విన్ కు పూర్తి స్వేచ్చ ఉందన్నారు. నవంబర్ 2013లో వాంఖడేలో సచిన్ టెండూల్కర్ అందుకున్న గొప్ప సెండాఫ్‌లు మాత్రమే కాకుండా, నిశ్శబ్ద వీడ్కోలు కూడా జ్ఞాపకంలో నిలిచిపోతాయి.
అశ్విన్‌ను భారత బౌలింగ్‌లో టెండూల్కర్ అని పిలవడం అతిశయోక్తి, కానీ అతను ముంబైకి చెందిన లిటిల్ మాస్టర్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఇద్దరు నిబద్ధతలో ఎవరికి ఎవరూ తీసిపోరు. అతను తన క్రికెట్ లో ప్రతి సవాల్ ను స్వీకరించాడు. నేర్చుకోవడం, నేర్చుకోవడం, తిరిగి నేర్చుకోవడం పైనే దృష్టి పెట్టాడు.
తన ప్రతిభకు పదును పెట్టుకున్నాడు. ఓ నిత్య విద్యార్థిలా మైదానంలో మసలుకున్నాడు. ఈ తరంలో గొప్ప ఆటగాళ్లుగా పేరుగాంచిన స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్ సన్ వంటి వారికి తన బౌలింగ్ తో పరీక్షపెట్టాడు.
అసాధారణ గణాంకాలు..
అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా ఆక్టివ్ గా ఉండేవాడు. అయనకు ప్రతి విషయం పై ఓ క్లారిటీ ఉంటుంది. అశ్విన్ చాలా మంది వేవ్ లెన్త్ తో కలవకపోవచ్చు. అయితే అతను ఆటను చాలా తెలివిగా చదివేవాడు. అందుకే అందరిని అశ్విన్ ఆకర్షించాడు.
106 టెస్టుల్లో 537 వికెట్లు తీయడం, ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 37 సార్లు ఐదు వికెట్లు తీయడం, 24.00 బౌలింగ్ సగటుతో సైన్ ఆఫ్ చేయడం - ఇవి అసాధారణమైన గణాంకాలు ఇవి చాలు అశ్విన్ మైదానంలో ఎలా చెలరేగిపోయాడో చెప్పడానికి.
ఇవన్నీ అశ్విన్ ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. అతను తన సిద్దాంతాలు, నిరంతర ప్రశ్నలతో కోచ్ లకు ఓ ప్రశ్నగా మిగిలిపోయి ఉండవచ్చు. అశ్విన్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయట పడడానికి ఇష్టపడ్డాడు. అయితే అదే సమయంలో కోచ్ లకు తన బౌలింగ్ చూడమని బలవంతం చేసేవాడని చెబుతూ ఉన్నారు.
గత కొన్ని సంవత్సరాలు అశ్విన్ వైట్ బాల్ గేమ్ లో వస్తూ పోతు ఉన్నాడు. అంతకుముందు తమిళనాడు తరఫున అనేక గేమ్ లను ఆడుతూ తన ప్రతిభను చూపించాడు. అందువల్లే ఐపీఎల్ తో పాటు, టీ20 లో నూ పవర్ ప్లేలో బౌలింగ్ చేసేవాడు.
ధోని కాలంలో టీ20 లో అశ్విన్ కీలకంగా వ్యవహరించేవాడు. అలాగే డెత్ ఓవర్లలో కూడా అద్బుత నైపుణ్యాలు ప్రదర్శించాడు. 2011లో స్వదేశంలో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ టైటిల్ సాధించే సమయంలో భారత జట్టు ప్రధాన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అయితే, రెండేళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి అశ్విన్ ఆ పాత్రను స్వీకరించాడు.
అంత నమ్మకం..
ధోనికి అతనిపై ఎంత నమ్మకం ఉంది, ఆ టోర్నమెంట్‌లో చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌కు విజయానికి 19 పరుగులు అవసరం కాగా, వర్షం కారణంగా మ్యాచ్ 20 ఓవర్లకు కుదించారు. ఆ సమయంలో అశ్విన్ వైపే ధోని చూసి బంతిని అందించాడు. అయితే ఈ చెన్నైకుర్రాడు కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి తన జట్టును టైటిల్ ను అందించాడు. ఇది అతని అత్యుత్తమ వైట్-బాల్ ఆట. అయితే అదే దేశంలో అదే ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత అతని 50-ఓవర్ల కెరీర్‌కు దాదాపు ముగింపు పలికింది.
అశ్విన్ ప్రతిభావంతులైన బ్యాట్స్ మెన్, అందుకే ఆరు టెస్ట్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. అతను అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. భారతదేశం అతని అత్యున్నత ఉనికిని కోల్పోయింది. రోహిత్ అతని వివేకం, కిలకిలారాలను కోల్పోతాడు. బ్యాటర్‌లు ఆల్-టైమ్ గ్రేట్‌లలో ఉన్న స్పిన్నర్ కి వ్యతిరేకంగా తమను తాము పరీక్షించుకునే అవకాశాన్ని కోల్పోతారు. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ, అతను క్రీడకు దూరంగా ఉండడు.
Next Story