
తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ మధ్య ఫొటో షాప్ చేసిన ట్రోఫి
‘‘ట్రోఫి కాదు.. ఛాంపియన్లు ఎప్పటికి గుర్తుండిపోతారు’’
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు చీఫ్ గా ఉన్న మొహసిన్ నఖ్వీ నుంచి భారత క్రికెట్ జట్టు ట్రోఫి తీసుకోవడానికి నిరాకరించింది.
పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్, పాక్ అంతర్గత మంత్రిగా ఉన్న నఖ్వీ నుంచి వేదిక నుంచి బయటకు వెళ్లే క్రమంలో ట్రోఫిని తనతో తీసుకెళ్లాడు. ఈ అంశంపై భారత క్రికెట్ ఆటగాళ్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, గిల్, హార్డిక్ పాండ్యా నఖ్వీపై విమర్శలు గుప్పించారు. క్రికెట్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో తమ సంబరాలకు ట్రోఫి ఎమోజీలను జోడించారు.
నఖ్వీని ఎగతాళి చేసిన భారత జట్టు..
నఖ్వీ ట్రోఫిని తనతో తీసుకెళ్లిన తరువాత భారత జట్టు తమ విజయాన్ని సాంప్రదాయ విజయ చిహ్నాలు లేకుండా ఖాళీ వేదికపై జరుపుకుంది. నఖ్వీ ఆసియా ట్రోఫిని తీసుకని తన హోటల్ గదికి పారిపోయాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. ‘‘ఆట ముగిసిన తరువాత ఛాంపియన్లు మాత్రమే గుర్తుండిపోతారు. ట్రోఫి ఫొటో కాదు’’ అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
ఫొటో షాప్ చేసిన ట్రోఫిలు..
ప్రజెంటేషన్ పై వివాదం ఉన్నప్పటికీ, ఫైనల్ తరువాత భారత ఆటగాళ్లు పూర్తి ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్, ఇతర ఆటగాళ్లతో టీ20, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి తరహాలో చేతిలో ఏం లేకున్నా ట్రోఫి ఉన్నట్లు భావించి నడుస్తూ వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వేడుకల తరువాత వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, తన సహచరుడు డాషింగ్ ఒపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఒక చిత్రాన్ని షేర్ చేసుకున్నాడు. వారి మధ్య ట్రోఫితో స్థానంలో బుగ్గ పెట్టారు.
ట్రోఫి లేకుండా విజయం..
నఖ్వీ ట్రోఫితో పారిపోయిన తరువాత భారత్ కెప్టెన్ మాట్లాడుతూ.. గెలిచిన జట్టుకు ట్రోఫిని ఎత్తుకునే అవకాశం లేకుండా పోవడం తన కెరీర్ లో ఇదే మొదటిసారని పేర్కొన్నాడు.
‘‘నేను క్రికెట్ ఆడుతున్న అన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడూ చూడలేదు. ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫి నిరాకరించారు. ఇది కష్టపడి సంపాదించింది. ఇది అంత సులభం కాదు. మేము వరుసుగా రెండు బలమైన మ్యాచ్ లలో కష్టపడి గెలిచాము. మేము నిజంగానే దానికి అర్హులం. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేము’’ అని విలేకరులతో అన్నారు.
ఎమిరేట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ఖలీద్ అల్ జరూనీ భారత జట్టుకు ట్రోఫిని అందజేయాలని బీసీసీఐ కోరింది. కానీ ఏసీసీ చైర్మన్ గా ఉన్న నఖ్వీ దానిని నిరాకరించాడు. భారత్ జట్టుకు ఇచ్చే పతకాలు ట్రోఫిని తిరిగి తీసుకోవాలని ఏసీసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాడు. నవంబర్ లో జరగనున్న ఐసీసీ సమావేశంలో నఖ్వీ చర్యలపై భారత్ అధికారికంగా నిరసన తెలియజేస్తుందని సైకియా తెలిపారు.
Next Story