IPL | నేటి కోల్ కతా, బెంగళూరు మ్యాచ్ కి వాన గండం లేనట్టే!
x

IPL | నేటి కోల్ కతా, బెంగళూరు మ్యాచ్ కి వాన గండం లేనట్టే!

వానొస్తుందేమో.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కొంప ముంచుతుందేమోనని తెగ బాధ పడిపోతున్న క్రికెట్ అభిమానులు వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది.


వానొస్తుందేమో.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కొంప ముంచుతుందేమోనని తెగ బాధ పడిపోతున్న క్రికెట్ అభిమానులు వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. వర్షం పడే అవకాశం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోల్ కతా క్రికెట్ అభిమానులు ఊపిరిపీల్చారు. సుమారు 65 వేల మంది ఈవేళ్టి ప్రారంభ మ్యాచ్ కి టికెట్లు కొనుగోలు చేశారు. ప్రారంభోత్సవం తర్వాత మార్చి 22వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి మ్యాచ్ మొదలవుతుంది.
రెండు మూడ్రోజులుగా కోల్ కతా నగరం మబ్బులు కమ్మి అడపాదడపా చినుకులు పడి పోతున్నాయి. ఈ వాతావరణాన్ని చూసిన క్రికెట్ అభిమానులు బాగా గుబులు పడిపోయారు. ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభం.. అది నాలుగు గంటల్లో ముగిసే సినిమా లాంటిది. దడదడా రావడం బడబడా బాదడమే పనిగా ఉండే ఆరంభ మ్యాచ్ ని మిస్సవుతావేమోనని అభిమానులు కాస్తంత కలత చెందుతూ వచ్చారు. కానీ, తాజా వెదర్‌ రిపోర్ట్‌ మాత్రం.. ఏం పర్లేదు, ఎగిరి గంతేయండి, స్టేడియంకి ఇరగబడండి అని చెప్పేసింది.
ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) 18వ సీజన్‌ తొలి మ్యాచ్‌కు కోల్ కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక. రాత్రి 7.30 గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంటుందనే ఆందోళనలో ఫ్యాన్స్‌ ఉన్నారు. కానీ, మ్యాచ్‌ సమయానికి చినుకులు పడవని.. ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుందని ఆక్యూవెదర్ రిపోర్ట్ (ACCuWeather) చెబుతోంది.
ప్రస్తుతం వాతావరణం మాత్రం పొడిగానే ఉంది. రాత్రికి కూడా పెద్దగా మార్పులేవీ ఉండవని వాతావరణ శాఖ అంచనా. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువే.
ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 గంటలకు: కోల్‌కతా - బెంగళూరు మ్యాచ్‌కు టాస్‌ వేస్తారు. రాత్రి 11 గంటల వరకు వర్షం పడే అవకాశం లేదు.
Read More
Next Story