యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి  బీహార్ ప్రభుత్వం నజరానా..
x

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ ప్రభుత్వం నజరానా..

‘‘అమ్మ నా కోసం 3 గంటలు మాత్రమే నిద్రపోయేది. నాన్న పని వదిలేశారు. కుటుంబ భారమంతా అన్నదే’’ - యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ


కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది. 101 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరిన 14 ఏళ్ల వైభవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్‌, రాజస్థాన్‌ జట్లు తలపడిన విషయం తెలిసిందే.

అయితే ఈ విజయం తన కుటుంబసభ్యుల త్యాగఫలమని అంటున్నాడు వైభవ్.

'నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు'

"నేను ఈ రోజు ఏ స్థితిలో ఉన్నానంటే, దానికి నా తల్లిదండ్రులే కారణం. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ప్రాక్టీస్‌కు వెళ్లాల్సి రావడంతో మా అమ్మ ముందుగా నిద్రలేచేది. నాకు భోజనం తయారుచేసేది. ఎప్పుడూ నా కోసం కష్టపడే అమ్మ రోజుకు ఆమె మూడు గంటలు మాత్రమే నిద్రపోయేది. ఇక నాన్న నా కోసం తన పనే వదులుకున్నాడు. నా పెద్దన్నయ్య మా కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. నాన్న నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను సాధించగలనని నమ్మకాన్ని పెంచారు. ఈ రోజు నేను ఈ రోజు కనపర్చిన ప్రతిభ వారికి అకింతం అని ఫలితం ఏదైనా, నేను సాధించిన విజయం నా తల్లిదండ్రుల వల్లే" అని IPL ఆన్ X పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు వైభవ్.

రూ. 10 లక్షల నజరానా..

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు బీహార్ ప్రభుత్వం బహుమతి ప్రకటించింది. ఈ యువ క్రికెటర్‌కు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించి, అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కూడా వైభవ్ ప్రతిభను కొనియాడారు. "ఇంత చిన్న వయసులో అద్భుతమైన ప్రతిభ చాటాడు" అని ప్రశంసించారు.

Read More
Next Story