మెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ సతద్రు దత్తా అరెస్ట్..
x

మెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ సతద్రు దత్తా అరెస్ట్..

కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు..


Click the Play button to hear this message in audio format

‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వాహకుడు సతద్రు దత్తాను అరెస్టు చేశారు. కోల్‌కతా(Kolkata) నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ(Lionel Messi), అతని సహచరులకు వీడ్కోలు పలికేందుకు కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చిన దత్తాను బిధాన్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా దత్తాకు న్యాయమూర్తి 14 రోజుల పోలీసు కస్టడీ విధించారు.


అసలు అరెస్టుకు కారణమేంటి?

‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’ లో భాగంగా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు శనివారం తెల్లవారుజామున కోల్‌కతాకు చేరుకున్నాడు. ఆయనతో పాటు జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్‌ సువారెజ్‌ భారత్‌కు వచ్చారు. 14 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన మెస్సిని చూడటానికి విమానాశ్రయానికి అభిమానులు వందల సంఖ్యలో తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను చేతబూని ‘మెస్సి మెస్సి’ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. కోల్‌కతాలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో మెస్సి బృందం బస చేసింది.

శనివారం ఉదయం 11.30 గంటలకు మెస్సీతో పాటు సహచర ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌తో కలిసి స్టేడియం వద్దకు చేరుకున్నాడు. వారి చుట్టూ నిర్వాహక కమిటీ బృందం గుమిగూడడంతో మెస్సీ దాదాపు 20 నిమిషాల పాటు కనిపించకుండా పోయారు. దీంతో స్టేడియంలో ప్రేక్షకులు "మాకు మెస్సీ కావాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో క్రీడాకారుల చుట్టూ భద్రతా సిబ్బంది రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు శాంతంగా ఉండాలని క్రీడామంత్రి అరూప్ బిశ్వాస్, ఈవెంట్ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా మైక్‌లో కోరినా పరిస్థితి అదుపులోకి రాలేదు. క్రీడాభిమానులు కుర్చీలను విరగొట్టి స్టేడియంలోకి విసిరేశారు. వాటర్ బాటిళ్లను విసిరేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ వచ్చే ముందు ఉదయం 11.52 గంటలకు మెస్సీని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. మెస్సీని ముందుగానే మైదానం నుంచి బయటకు వెళ్లడం ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రూ. 12వేలు చెల్లించి టికెట్ కొన్నా.. ఫుట్‌బాల్ దిగ్గజాన్ని చూడలేకపోయామన్న వారి కళ్లల్లో కనిపించింది. మెస్సీ కోలకతాకు రావడం ఇది రెండోసారి. 14 సంవత్సరాల క్రితం తొలిసారి వచ్చారు.


స్టేడియంలో గందరగోళంపై దర్యాప్తు..

స్టేడియంలో జరిగిన ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మెస్సీకి, క్రీడాభిమానులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించమని చెప్పారు. స్టేడియం ఆవరణలోకి వాటర్ బాటిళ్లు, పానీయాల అమ్మకాలకు అనుమతించడమపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story