
మిథున్ మన్హాస్
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మన్హాస్ ఎన్నిక
గంగూలీ, రోజర్ బిన్నీ తరువాత వరుసుగా అధ్యక్షుడైన మూడో క్రికెటర్
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా దేశీయ స్టార్ ఆటగాడు మిథున్ మన్హాస్ నియమితులయ్యారు. 45 ఏళ్ల మన్హాస్ దేశవాళీ మ్యాచ్ లో ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
మిథున్ ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ తరువాత వరుసగా బీసీసీఐ చీఫ్ అయిన మూడో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. బీసీసీఐ కి 37 అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహించబోతున్నాడు.
దేశవాలీ స్టార్..
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలో జన్మించిన మిథున్.. 1997-98 నుంచి 2016 మధ్య 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 43 సగటుతో 27 సెంచరీలు సాధించాడు.
49 అర్థ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. పదివేలకు పైగా పరుగులు సాధించాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ లో 40 కి పైగా వికెట్లు పడగొట్టాడు. కీపర్ గాను కొన్ని సంవత్సరాలు తన నైపుణ్యాలు ప్రదర్శించాడు. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, పూణే వారియర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే వివిధ ఐపీఎల్ జట్లకు అసిస్టెంట్ కోచ్ హోదాలో కూడా పనిచేశాడు.
ఆగష్టులో బిన్నీ తరువాత రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశాడు. మిథున్ రాకతో ఆయన ఉపాధ్యక్షుడిగా కొనసాగుతారు. భారత మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లయిన ఆర్పీసింగ్, ప్రజ్ఞాన్ ఓజా కూడా పురుషుల సెలక్షన్ ప్యానెల్ లోకి ప్రవేశించాడు.
మిథున్ కు స్వాగత పలికిన మాజీ క్రికెటర్..
జమ్మూకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఎక్స్ లో ఆయన ఘనతను స్వాగతించారు.
‘‘ఇది ఒక చిరస్మరణీయ సంబంధం. మిథున్ మన్హాస్ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారు. జమ్ము అండ్ కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతాలలో ఒకటైన దోడా జిల్లాకు ఇది దివ్యమైన ఆదివారం.
యాధృచ్చికంగా నా సొంత జిల్లా కూడా’’ అని ఆయన రాసుకొచ్చారు. మన్హాస్ ఎంపికను టర్బోనేటర్, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి అయిన హర్భజన్ సింగ్ ప్రశంసించారు. ఇది క్రికెట్ లో సానుకూల అడుగు అన్నారు.
‘‘ఒక క్రికెటర్ క్రికెట్ సంఘానికి నాయకత్వం వహించినప్పుడూ ఆయన అనుభవం, ఇతర లక్షణాలు సహాయపడతాయి. ఇది మంచి నిర్ణయం. గత మూడు పర్యాయాలుగా ఇది కొనసాగుతోంది. ఇది క్రికెటర్లకు, ఆటకు గొప్ప విషయం’’ అని బజ్జీ అన్నారు.
2016-17 లో భారత ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ రాష్ట్ర జట్టుకు తిరిగి వచ్చిన తరువాత మిథున్ జమ్మూకాశ్మీర్ కు వెళ్లాడు.
Next Story