పరుగుల్లో అంతు తేల్చాలని చూస్తున్నా: సంజూ శాంసన్
ప్రస్తుతం ఉన్న ఫామ్ తో క్రికెట్ ఎక్కువ పరుగులు స్థిరంగా రాణించాలని కోరుకుంటున్నా అని టీ20 నయా ఒపెనర్ సంజూ శాంసన్ చెప్పారు.
టీ20 లో తాను కొనసాగిస్తున్న ఫామ్ తో గరిష్టంగా పరుగులు సాధించాలని కోరుకుంటున్నానని టీమిండియా నయా ఓపెనర్ సంజూ శాంసన్ చెప్పారు. " జట్టు ఉద్దేశం, మేము దూకుడుగా ఉండటం, జట్టును ముందుకు తీసుకెళ్లడం. మూడు-నాలుగు బంతులు ఆడిన తర్వాత మేము బౌండరీ కోసం చూస్తున్నాం," అని శాంసన్ అన్నాడు.
టీ20 నయా ఒపెనర్ గా అవతారం ఎత్తిన సంజూ శాంసన్ వరుస సెంచరీలతో భీభత్సం సృష్టిస్తున్నాడు. తాను ఆడిన చివరి ఆరు మ్యాచులలో మూడు సెంచరీలు సాధించాడు. ఇందులో టీ20 లో వరుసగా చేసిన రెండు సెంచరీలతో పాటు దులీప్ ట్రోఫి లో చేసిన సెంచరీ కూడా ఉంది.
దక్షిణాఫ్రికాపై 50 బంతుల్లో 107 పరుగులు, గత నెలలో బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. సంజూ ధాటికి టీ20లలో భారత్ అత్యధిక పరుగులు స్కోర్ సాధించింది. టెస్ట్ క్రికెట్ ఆడుతున్న దేశాలలో టీ20 లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది.
శ్రీలంకతో జరిగిన టీ20లలో కూడా ఒపెనర్ గా వచ్చిన సంజూ చివరి రెండు టీ20లలో డకౌట్ గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ మొదటి రెండు మ్యాచుల్లోనూ విఫలం అయ్యాడు. కానీ హైదరాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20 లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఫామ్ అందుకున్న శాంసన్, తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 లోనూ అదరగొట్టాడు.
తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన సంజూ.. "మధ్యలో నేను కేరళలో గడిపిన సమయాన్ని నిజంగా ఆస్వాదించాను. మీరు చెప్పగలిగే నా ప్రస్తుత ఫామ్‌ను నేను గరిష్టంగా ఉపయోగించుకున్నాను" అని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ను అందుకున్న తర్వాత శాంసన్ చెప్పాడు.
'హై రిస్క్, హై రివార్డ్ గేమ్ ఆడతాడని అతనికి తెలుసు." "నేను పెద్దగా ఆలోచించడం లేదు, కొన్నిసార్లు అది ఫలిస్తుంది, కొన్నిసార్లు పని చేయదు. ఈ రోజు అది బాగా పనిచేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను." కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శాంసన్ ను ప్రశంసించాడు. "గత 10 సంవత్సరాలలో అతను చేసిన శ్రమ, పని ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. 90 లలో ఉన్నప్పుడు కూడా బౌండరీలను వెతుకుతున్నాడు’’ అని కెప్టెన్ సూర్య ప్రశంసలు కురిపించాడు.
Next Story