CHESS | రాపిడ్ చెస్ వరల్డ్ ఛాంపియన్ కోనేరు హంపి
x

CHESS | రాపిడ్ చెస్ వరల్డ్ ఛాంపియన్ కోనేరు హంపి

భారత చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.


భారత చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం ఇండోనేషియాకు చెందిన ఇరేన్ సుకందర్‌ను ఓడించి ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రెండోసారి విజయం సాధించారు. 37 ఏళ్ల హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించింది. జార్జియాలో 2019లో జరిగిన పోటీలోనూ హంపి ఈ టైటిల్ గెలుచుకున్నారు. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా హంపి ఘనత సాధించారు.

గతంలోనూ ఉత్తమ ప్రదర్శన..

హంపి రాపిడ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ప్రతిభ చాటారు. 2012లో మాస్కోలో జరిగిన ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు.గత ఏడాది ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో రజతం సాధించారు.

విజేతగా ప్రకటించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈ విజయం మరికొంత భారతీయులను చెస్‌వైపు ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. గుకేష్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఇప్పుడు నేను రెండవ ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్నాను. ఇది చెస్‌ను వృత్తిపరంగా ఎంచుకునే యువతకు ప్రేరణ ఇస్తుందని ఆశిస్తున్నా.” అని పేర్కొన్నారు.

పురుషుల విభాగంలో విజయం:

పురుషుల విభాగంలో 18 ఏళ్ల రష్యాకు చెందిన వొలోడార్ ముర్జిన్ విజయం సాధించారు. ముర్జిన్, నోదిర్బెక్ అబ్దుసత్తరోవ్ తర్వాత రెండవ అత్యంత పిన్న వయస్కుడైన ఫైడ్ రాపిడ్ ఛాంపియన్‌గా నిలిచారు.

Read More
Next Story