
ఐపీఎల్-2026: కొత్త ఫ్యాన్ పార్కుల షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాలలో నిజామాబాద్ లో మాత్రమే ఏర్పాటు చేయనున్న బీసీసీఐ
ఐపీఎల్ కు భారీ ప్రజాదరణ తెచ్చేందుకు కారణమైన ఫ్యాన్ పార్క్ షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం కొత్త ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభ దశకు అనుగుణంగా, మొదటి మూడు వారాంతాల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్స్ 2026 షెడ్యూల్‌ను ప్రకటించింది. స్టేడియంలకు ఆవల ఐపీఎల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో, మొదటి మూడు వారాల్లో 11 రాష్ట్రాల్లోని 15 నగరాల్లో ఈ ఫ్యాన్ పార్కులను నిర్వహిస్తారు.
ఇది అభిమానులకు కొత్త కిక్కు ఇవ్వడంతో పాటు సామూహిక స్ఫూర్తితో కూడిన వాతావరణంలో ప్రత్యక్ష ఐపీఎల్ మ్యాచ్‌ల ఉత్సాహాన్ని అనుభవించే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఫ్యాన్ పార్కులు మూడు వారాంతాల్లో జరుగుతాయి:
వారం 1: మార్చి 28, 29
వారం 2: ఏప్రిల్ 4, 5
వారం 3: ఏప్రిల్ 11, 12
ప్రతి వారాంతంలో ఉత్తర, దక్షిణ, తూర్పు పశ్చిమ - విభిన్న జోన్‌లలో ఐదు ఫ్యాన్ పార్కులను బీసీసీఐ ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఫ్యాన్ పార్క్‌లో ప్రత్యక్ష మ్యాచ్ ప్రసారాలతో పాటు, సంగీతం, వినోదం, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆట స్థలాలు, వర్చువల్ బ్యాటింగ్ అనుభవాలు, బౌలింగ్ నెట్‌లు, ఫేస్ పెయింటింగ్, చీర్-ఓ-మీటర్లు, 360° ఫోటో బూత్‌ల వంటి అభిమానులను ఆకట్టుకునే అనేక కార్యక్రమాలు ఉంటాయని బీసీసీఐ తెలిపింది.
“2015లో ప్రారంభమైనప్పటి నుంచి, ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ కార్యక్రమం లీగ్ పరిధిని విస్తరించడంలో, దేశం అంతటా ఉన్న అభిమానులకు ఐపీఎల్ ఉత్సాహాన్ని, శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషించింది.
2026 సీజన్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, పలు నగరాల్లోని అభిమానులు ఐపీఎల్ వేడుకల్లో పాలుపంచుకునేలా చేస్తుంది,” అని బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
మొదటి మూడు వారాల ఐపీఎల్ 2026 ఫ్యాన్ పార్కులు
వారం 1: మార్చి 28, 29
రోహ్‌తక్, హర్యానా – చోటు రామ్ పాలిటెక్నిక్ గ్రౌండ్
భోపాల్, మధ్యప్రదేశ్ – ప్రభుత్వ MVM కాలేజ్ గ్రౌండ్
నాగ్‌పూర్, మహారాష్ట్ర – మెకోసాబాగ్ మెథడిస్ట్ హై స్కూల్ ప్లేగ్రౌండ్
తుమకూరు, కర్ణాటక – ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఫీల్డ్
కృష్ణానగర్, పశ్చిమ బెంగాల్ – DL రాయ్ స్టేడియం
రెండో వారం 2: ఏప్రిల్ 4, 5
మధుర, ఉత్తరప్రదేశ్ – అమర్‌నాథ్ విద్యా ఆశ్రమం
జోధ్‌పూర్, రాజస్థాన్ – బర్కతుల్లా ఖాన్ స్టేడియం –
నిజామాబాద్, తెలంగాణ- మహిళా విద్యాసంఘం
మైసూర్, కర్ణాటక- ఎస్బీఆర్ఆర్ మహాజన ఫస్ట్ గ్రేడ్ కాలేజ్
భువనేశ్వర్, ఒడిశా – KITS యూనివర్శిటీ స్టేడియం
మూడో వారం 3: ఏప్రిల్ 11, 12
మీరట్, ఉత్తరప్రదేశ్ - భైంసాలీ గ్రౌండ్
నదియాడ్, గుజరాత్ - రాధే ఫామ్
రత్నగిరి, మహారాష్ట్ర - స్వర్గీయ ప్రమోద్ మహాజన్ క్రీడా సంకుల్,
కోయంబత్తూర్, తమిళనాడు - హిందుస్తాన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్
రూర్కెలా, ఒడిశా- సెక్టార్ 17 గ్రౌండ్
Next Story

