
దేశవ్యాప్తంగా ఐపీఎల్ జోష్: ఫ్యాన్ పార్కులకు బీసీసీఐ ప్రణాళిక
ఏప్రిల్ 18 నుంచి మే 24 వరకు 30 నగరాల్లో ఐపీఎల్ 2026 ఫ్యాన్ పార్కులు.. ప్రత్యక్ష మ్యాచ్‌లు, వినోదంతో అభిమానులకు ప్రత్యేక అనుభవం.
క్రికెట్ అభిమానులకు భారీ శుభవార్త. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐపీఎల్ 2026 ఫ్యాన్ పార్కుల రెండో దశ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ దశలో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 30 నగరాలు కవర్ కానున్నాయి.
బీసీసీఐ ప్రకారం.. ఫ్యాన్ పార్కులు ఏప్రిల్ 18-19 నుంచి మే 23-24 వరకు వరుసగా ఆరు వారాంతాల్లో నిర్వహిస్తారు. ఫ్యాన్ పార్కుల్లో కేవలం మ్యాచ్ ప్రసారాలు మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి వినోదాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాన ఆకర్షణలు..
భారీ స్క్రీన్‌లపై ప్రత్యక్ష మ్యాచ్ ప్రసారాలు
సంగీత కార్యక్రమాలు, వినోద ప్రదర్శనలు
ఫుడ్ కోర్టులు
పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు
ఇంటరాక్టివ్ గేమ్స్, ఆకర్షణలు
అభిమానులకు క్రికెట్ అనుభవాన్ని మరింత దగ్గర చేయడానికి పలు ఇంటరాక్టివ్ కార్యకలాపాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఫ్యాన్ పార్కుల ద్వారా స్టేడియానికి వెళ్లలేని అభిమానులకు కూడా ఐపీఎల్ అనుభవాన్ని అందించడమే బీసీసీఐ లక్ష్యం. కుటుంబంతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదించేలా ఈ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి.
తేదీలను పరిశీలిస్తే..
4వ వారం: ఏప్రిల్ 18 & 19
5వ వారం: ఏప్రిల్ 25 & 26
6వ వారం: మే 2 & 3
7వ వారం: మే 9 & 10
8వ వారం: మే 16 & 17
9వ వారం: మే 23 & 24
4వ వారం: ఏప్రిల్ 18 & 19
బఠిండా, పంజాబ్
కోట, రాజస్థాన్
బెళగావి, కర్ణాటక
పుతుప్పల్లి, కేరళ
జంషెడ్‌పూర్, జార్ఖండ్
5వ వారం: ఏప్రిల్ 25 & 26
అమృత్‌సర్, పంజాబ్
బికానెర్, రాజస్థాన్
మంగళగిరి, ఆంధ్రప్రదేశ్
దిండిగల్, తమిళనాడు
ధన్‌బాద్, జార్ఖండ్
6వ వారం: మే 2 & 3
చంబా, హిమాచల్ ప్రదేశ్
సూరత్, గుజరాత్
సోలాపూర్, మహారాష్ట్ర
తిరుచిరాపల్లి, తమిళనాడు
సిలిగురి, పశ్చిమ బెంగాల్
7వ వారం: మే 9 & 10
మండి, హిమాచల్ ప్రదేశ్
రాజ్‌కోట్, గుజరాత్
హుబ్బళ్లి, కర్ణాటక
పుదుచ్చేరి, పుదుచ్చేరి
గోలాఘాట్, అస్సాం
8వ వారం: మే 16 & 17
పటియాలా, పంజాబ్
ఇండోర్, మధ్యప్రదేశ్
గోవా, గోవా
శివమొగ్గ, కర్ణాటక
ఇంఫాల్, మణిపూర్
9వ వారం: మే 23 & 24
ఆగ్రా, ఉత్తర ప్రదేశ్
భిల్లై, ఛత్తీస్‌గఢ్
కొల్హాపూర్, మహారాష్ట్ర
వరంగల్, తెలంగాణ
సిల్చార్, అస్సాం

