తడబాటుతో ఆట మొదలెట్టిన ఇండియా, వెస్టిండీస్ ఫస్ట్ వికెట్ డౌన్
x

తడబాటుతో ఆట మొదలెట్టిన ఇండియా, వెస్టిండీస్ ఫస్ట్ వికెట్ డౌన్

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో టీమ్ ఇండియా హోరాహోరి


టీ20 ప్రపంచ కప్ సూపర్-8లో టీమ్ ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య అత్యంత కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ విజేతే సెమిఫైనల్‌కు వెళుతుంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ (బౌలింగ్) ఎంచుకుంది, వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేయిస్తోంది. 7 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 56 పరుగులు చేసింది. పది ఓవర్లు పూర్తయ్యేపాటికి వెస్టిండీస్ ఒక వికెట్ నష్టపోయి 80 పరుగులు చేసింది.
ఓపెనర్ షాయ్ హోప్ అవుటయ్యారు. రొస్టన్ చేజ్ బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లు మొదటి ఓవర్లలో బాగా నియంత్రిస్తున్నట్టు కనిపించినా ఆ తర్వాతి ఓవర్లలో పరుగులు ఇచ్చారు. మధ్యలో ఒక క్యాచ్ కూడా మిస్ చేశారు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెమీఫైను చేరుతుంది. ఇరు జట్లు సూపర్-8లో రెండు పాయింట్లు సాధించిన స్థితిలో ఉన్నాయి. సెమీస్ ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌ గెలవటం తప్పనిసరి.
భారత జట్టు ఇటీవల జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. 72 పరుగుల తేడాతో గెలిచింది, ఇది ఉత్సాహాన్నిచ్చింది. అయినా ఈ గెలుపు తప్పని సరి.
ఈ మ్యాచ్ ని “వర్చువల్ క్వార్టర్‌ఫైనల్” లాగా భావిస్తున్నారు. ఎందుకంటే విజేతే సెమీస్ బర్త్‌ను పొందుతుంది. స్టేడియంలో ప్రేక్షకుల సందడి చేస్తున్నారు. సిక్సర్లు కోసం భారీ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. వెస్టిండీస్ గెలుపు రన్ రేట్ ఆధారంగా కూడా సెమీస్ అర్హతపై ప్రభావం చూపింది. కానీ ఇరు జట్లు గెలవడం ఫలితాన్ని నిర్ణయిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
టీమిండియా ఫైనల్ టీమ్ ఇదే..
సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
వెస్టిండీస్ తుది జట్టు
షై హోప్ (కెప్టెన్ / వికెట్ కీపర్), రోస్టన్ ఛేజ్, షిమ్రోన్ హెట్‌మయెర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానె రూథర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డె, అకీల్ హోసీన్, గుడాకేష్ మోతీ, షమార్ జోసెఫ్
Read More
Next Story