మొదటి వన్డేలో . సునాయసంగా విజయం సాధించిన భారత్ , రెండో వన్డేలో .... చివరి వరకు తెచ్చుకుంది … కొంత అలసత్వాన్ని జట్టు మొత్తం ప్రదర్శించింది. అయినా సరే నిన్న (25.1.25) చెన్నైలో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో T20I ఉత్కంఠ భరిత మ్యాచ్ లో తిలక్ వర్మ 55 బంతుల్లో చేసిన 72 పరుగులు (6 బౌండరీలు, ఐదు సిక్సర్లు) భారత్ కు విజయాన్ని అందించాయి. మ్యాచ్ చివరి వరకు తీసుకువెళ్లడంలో ఎక్కువ భాగం శ్రేయస్సు ఇంగ్లాండుకే దక్కినప్పటికీ, కొంతవరకు భారత బ్యాట్స్మెన్లు కూడా దానికి కారణం. భారత బౌలర్లు కూడా ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరుకే అవుట్ చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ, అంత సీరియస్ బౌలింగ్ చేయలేదు. అలాగని ఇంగ్లాండ్ జట్టు ను తక్కువ చేయడానికి వీల్లేదు. 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచడంలో, ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ బ్యాటింగ్ ప్రతిభ తో పాటు కిందిస్థాయిలో దిగిన ఒకరిద్దరూ బ్యాట్స్మెన్ ల పాత్ర కూడా ఉంది .. మొత్తం మీద ఎవరి పాత్ర ఎంత ఉన్నా, ఒక ఉత్కంఠ భరిత మ్యాచ్ ను భారత ప్రేక్షకుల కు అందించారు. ప్రేక్షకుల ను అలరించారు
సాదాసీదా బౌలింగ్.. ఇంగ్లాండ్ కు లాభించింది
మరోసారి టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్కత్తా లాగే కూడా స్పిన్ పిచ్ కావడం భారత జట్టుకు కలిసి వచ్చే అంశం. అదే జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా ఇద్దరు స్పిన్నర్లు, అక్షర పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇంత ముందు మ్యాచ్ లాగానే అర్ష దీప్ మొదటి ఓవర్లోనే వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్ ను ఇబ్బందులు పెట్టాడు. అయితే ఇంత ముందులాగా ఇంగ్లాండ్ తడబడలేదు. మరోసారి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (45 పరుగులు) ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ని నిలబెట్టాడు, గెలిచే అవకాశం ఉన్న స్కోర్ ను
సాధించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు మొదటి వన్డే నుంచి ఒక పాఠం నేర్చుకున్నట్టు అనిపించింది భారీ స్కోర్ కాకపోయినా, గెలిచే అవకాశం ఉన్న 166 పరుగులు సాధించింది.
తిలక్ వర్మ వర్సెస్ ఇంగ్లాండ్ బౌలర్స్
భారత జట్టు 5 వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్ వర్మ తనదైన బ్యాటింగ్ శైలితో భారత జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వాషింగ్టన్ సుందర్ సహా కారంతో నూరు పరుగులు దాటించాడు. 13 ఓవర్లు పూర్తి అయ్యేసరికి భారత జట్టు స్కోరు 114 పరుగులు అయింది. మరోసారి భారత్ జట్టులో హుషారు వచ్చింది. అయితే ఇంగ్లాండ్ జట్టు బౌలర్ కార్స్ వాషింగ్టన్ సుందర్ వికెట్ తీసి ఇంగ్లాండ్ జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. మరోసారి ఇంగ్లాండ్ గెలుస్తామనుకుంది. మ్యాచ్ ఒకసారి గా రసవత్తర స్థాయికి చేరుకుంది.
తిలక్ వర్మ ఉన్నంత వరకు భారత జట్టు ఆశలు సజీవంగా ఉన్నాయి. 5 ఓవర్లలో 40 పరుగులు చేయవలసిన స్థితికి భారత జట్టు చేరుకుని ప్రేక్షకుల లో ఉత్సాహం కలిగించింది. ఈ స్థితిలో రెండు వరుస సిక్సర్లతో తిలక్ వర్మ ఇంగ్లాండ్ జట్టు ను నిరాశ పరిచాడు ఆ ఓవర్ లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. 17 వ ఓవర్ ఆదిల్ రషీద్ వేయడం కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అయితే రషీద్ వేయడం అన్న ఇంగ్లాండ్ వ్యూహం పని చేసింది. అతి తక్కువ పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టాడు
మరోసారి ఇంగ్లాండ్ జట్టులో ఉత్సాహాన్ని నింపి గెలుపు పాట పట్టించాడు మ్యాచ్ చివరి దశకు చేరుకుంది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ వికెట్ కోల్పోవడం తో భారత జట్టు కొంత ఇబ్బందిలో పడింది ఇంగ్లాండ్ జట్టు మరోసారి గెలుపుకు దగ్గరగా అయింది
21 బాల్స్ లో 21 పరుగులు!!
తిలక్ వర్మ ఉన్నంతవరకు భారత్ కు ఢోకా లేదని అనిపించింది.
19 బాల్స్ 20 పరుగులు..ఉన్నవి 3 వికెట్లు.
ఇక మొత్తం తిలక్ వర్మ చేతిలో ఉండినది.
ఇంగ్లాండ్ కు కావలసింది 2 వికెట్లు. భారత్ కు 17 పరుగులు!!!
అప్పుడు ఊహించని విధంగా రవి బిష్ణోయి ఒక బౌండరీ సాధించాడు.
ఇక 12 బంతుల్లో 13 పరుగుల స్థితి.
అంతా ఉత్కంఠ.
19 వ ఒవర్ ను ఆడేది వర్మ..
10 బాల్స్ 13 పరుగులు
వర్మ 2 పరుగులు చేసాడు.
అంతా ఉత్కంఠ..
వర్మ ఒక పరుగు
8 బాల్స్ 10 పరుగులు!!
రవి 4 కొట్టాడు
చివరకు 6 బంతుల్లో 6 పరుగులు!!!
సర్వత్ర ఉత్కంఠ
5 బంతుల్లో 4 పరుగులు
వర్మ 4 కొట్టాడు
జట్టును గెలిపించాడు
ఒక దశలో ఈ మ్యాచ్ నువ్వా నేనా అనే పరిస్థితిలో ఉండింది. అంతకుముందు భారత జట్టు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు అనిపించింది. సూర్య కుమార్ యాదవ్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఇంతకు ముందు అతనే చెప్పినట్టు, టి20 లో సరిగా ఆడక పోవడం వల్ల ఐసీసీ చాంపియన్ ట్రాఫిక్ అతన్నిసెలెక్ట్ చేయలేదు. ఇక్కడ జరిగింది కూడా అదే. వరుసగా రెండు మ్యాచ్ లలో జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ ను భారత ఆటగాళ్లు ఒకింత ఈజీగా తీసుకొని ఆడారు అని ప్రేక్షకుల కు అనిపిస్తే వాళ్ళ తప్పులేదు. అలాగని ఇంగ్లాండ్ జట్టు ని తక్కువ అంచనా వేయకూడదు. గెలవాలన్న కసితో ఆడారు. చివరికి
ఒక ఉత్కంఠ భరిత మ్యాచ్లో భారత్ ది పై చేయి అయింది.
స్కోర్ బోర్డ్:
ఇంగ్లాండ్ బ్యాటింగ్:
165 పరుగులు/09 వికెట్లు (20 ఓవర్లు)
బట్లర్ 45 పరుగులు (30 బంతులు)
భారత్ బౌలింగ్:
అర్షదీప్ 1 వికెట్ (4 ఓవర్లు)
హార్దిక్ పాండ్య 1 వికెట్ (2 ఓవర్లు)
వరున్ చక్రవర్తి 2 వికెట్లు (4 ఓవర్లు)
అక్సర్ పటేల్ 2 వికెట్లు (4 ఓవర్లు)
అభిషేక్ శర్మ 1 వికెట్ (1 ఓవర్)
భారత్ బ్యాటింగ్:
166 పరుగులు/ 8 వికెట్లు (19.2 ఓవర్లు)
తిలక్ వర్మ 72 పరుగులు (55 బంతులు)
వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు (19 బంతులు)
ఇంగ్లాండ్ బౌలింగ్:
ఆర్చర్ 1 వికెట్ (4 ఓవర్లు)
ఆదిల్ రషిద్ 1 వికెట్ (4 ఓవర్లు)
బ్రైడన్ కార్సె 3 వికెట్లు (4 ఓవర్లు)
మార్క్ ఉడ్ 1 వికెట్ (3 ఓవర్లు)
జేమి ఒవెర్టన్ 1 వికెట్ (2.2 ఓవర్లు)
లివింగ్స్టన్ 1 వికెట్ (2 ఓవర్లు)