Fifth T20I | పవర్ ప్లే లో 'పవర్' చూపించిన భారత్
దీనికి ఏకైక కారణం బ్యాటింగ్ లో విశ్వరూపం చూపిన అభిషేక్ శర్మ. వివరాలు
ఈ రోజు (2.2.25)ముంబై వాంఖాడే స్టేడియంలో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టును అవలీలగా ఓడించింది భారత జట్టు. దీనికి ఏకైక కారణం బ్యాటింగ్ లో విశ్వరూపం చూపిన అభిషేక్ శర్మ. అత్యంత వేగవంతమైన శతకంతో ఇంగ్లాండ్ జట్టు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 37 బంతుల్లో ఐదు ఫోర్లు 13 సిక్సర్లతో సెంచరీ చేసి
రికార్డు సృష్టించాడు అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ బ్యాటింగ్ వల్ల 4-1 తేడాతో భారత్ సిరీస్ ను గెలుచుకుంది.
టాస్ గెలిచి ఇండియాను బ్యాటింగ్ చేయమని అడిగిన బట్లర్, ఆ పని ఎందుకు చేశానా, అని బాధపడే స్థాయిలో ఆడారు భారత ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు ఫోర్లు సిక్సర్లు బాదేశారు. అభిషేక్ శర్మ పవర్ ప్లే లో పవర్ చూపించాడు. ఏడు ఓవర్లో భారత్ జట్టు స్కోరు 111 పరుగులు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ బౌలర్లను ఇష్టం వచ్చినట్టు ఆటాడుకున్నారు, అభిషేక్ శర్మ బ్యాటింగ్ విశ్వరూపం తో ఇంగ్లాండ్ బౌలర్లకి చుక్కలు చూపించాడు.
ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన అభిషేక్ వర్మ
మొదటి బంతిని సిక్సర్ గా మలిచిన శాంసన్ తొందరగానే అవుట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ప్రేక్షకుల కోసం సిక్సర్ల పండగ చేశాడు. అతని బ్యాటింగ్ చూస్తే స్కోరు 300 దాటుతుందేమో అనిపించింది. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కి వచ్చాడు. గత నాలుగు మ్యాచ్లో ఫెయిల్ అయిన సూర్య కుమార్ వచ్చేటప్పటికి పరిస్థితి బ్యాటింగ్ సులభంగా ఉండింది. భారత జట్టు స్కోరు 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు అంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ ధాటిని అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్స్ డ్రింక్ బ్రేక్ ని కోరుకుని ఉంటారు. అభిషేక్ వర్మ సునామీ బ్యాటింగ్ను తప్పించుకోవడానికి అది మంచి మార్గం. అభిషేక్ వర్మ 37 బంతుల్లో శతకం సాధించాడు అంటే ఎలాంటి బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఏడ పెడ బాదినట్లు అనిపించినప్పటికీ, అతను కొట్టిన షాట్లు సాంకేతికంగా చక్కటి క్రికెట్ షాట్లే. సూర్య కుమార్ యాదవ్ మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ జట్టు బౌలర్లకి అది కొంత రిలీఫ్ ఇచ్చింది.
పసలేని ఇంగ్లాండ్ బౌలింగ్
అభిషేక్ శర్మ, ఐదు ఫోర్లు 10 సిక్సర్లతో శతకం సాధించాడు. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన టి20 మ్యాచ్ లలో, ఇదే అత్యంత వేగవంతమైనది. ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు ఫించ్ ఇంతకుముందు అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి ఉన్నాడు. తర్వాత వచ్చిన శివం దూబె, ఒక సిక్స్ ఒక ఫోర్ తో తన అభిమతాన్ని స్పష్టం చేశాడు ఇంగ్లాండ్ బౌలర్లకి. ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్ ఆర్చర్ మూడు ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడంటే , అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ నే కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించాడు అభిషేక్ శర్మ. అతన్ని ఆపాలంటే 20 ఓవర్లు అయిపోవాలి అనిపించింది. తర్వాత వచ్చిన దూబే తక్కువ తినలేదు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఈరోజు వాంఖడే క్రికెట్ స్టేడియంలో కురిసిన సిక్సర్ల వర్షం ప్రేక్షకులకు ఆనందాన్ని, ఇంగ్లాండ్ జట్టుకు నిరాశను కలిగించింది. 13 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది భారత్ జట్టు అంటే, అభిషేక్ బ్యాటింగ్ ఎలా ఉంది అర్థం చేసుకోవచ్చు. 13 బంతుల్లో 30 పరుగులు చేసిన శివం దూబెని కార్ సే బౌలింగ్లో ఆదిల్ రషీద్ క్యాష్ తీసుకుని అవుట్ చేయడంతో ఇంగ్లాండు కొంత ఊపిరి పీల్చుకుంది.
అందరు బ్యాట్స్మెన్ ల మాదిరే హార్దిక్ పాండ్యా కూడా సిక్స్ కొట్టి బ్యాటింగ్ మొదలుపెట్టాడు. అయితే మార్క్ ఉడ్ బౌలింగ్లో లియం పట్టిన ఒక మంచి క్యాచ్ తో అవుట్ అయ్యాడు. ధాటిగా బ్యాటింగ్ చేసే రింకు సింగ్ ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఎట్టకేలకు ఆర్చర్ కి ఒక వికెట్ దొరికింది. కానీ నాలుగు ఓవర్లలో 55 పరుగులు ఇచ్చాడు ఆర్చర్. అభిషేక్ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తూ వెళ్ళాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్ సే ఒక్కడు మాత్రమే మంచి బౌలింగ్ చేశాడు. వైస్ కెప్టెన్ అక్షర పటేల్ కూడా ఒక బౌండరీ తో బ్యాటింగ్ మొదలు పెట్టాడు.
ఇంగ్లాండ్ బౌలర్ కార్ సే మూడు వికెట్లు తీసుకున్నాడు. రషీద్ బౌలింగ్లో తన 12వ సిక్సర్ కొట్టిన అభిషేక్ శర్మ భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లలో అందరికన్నా ఎక్కువ సిక్స్ లు కొట్టిన బ్యాట్స్మెన్ అయ్యాడు. 54 బంతుల్లో 13 సిక్సర్లు 7 ఫోర్ లతో 135 పరుగులు చేసిన అభిషేక్ శర్మ చివరకు అవుట్ అయ్యాడు బ్యాటింగ్ కు కొంత అనుకూలమైన పిచ్ అయినప్పటికీ 135 పరుగులు చేయడం సామాన్యమైన విషయం కాదు . 19 ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇవ్వడము ఇంగ్లాండ్ కు కొంత ఊరట ఇచ్చింది. చివరికి 17 ఫోర్లు, 19 సిక్సర్లతో భారత జట్టు 247 పరుగులు చేయడం చూస్తే బ్యాటింగ్ సునామీ అర్థం చేసుకోవచ్చు.
ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్న ఇంగ్లాండ్
248 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించవలసిన పరిస్థితుల్లో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు కూడా షమీ వేసిన మొదటి ఓవర్ లో సాల్ట్ కొట్టిన రెండు ఫోర్లు ఒక సిక్సర్ తో లక్ష్యసాధన మొదలుపెట్టింది .అంతలో చాలా రోజుల తర్వాత మళ్లీ ఆడుతున్న మహమ్మద్ షమీ డకెట్ ను అవుట్ చేసి భారత్ కు శుభారంభాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ ఓపెనింగ్ బ్యాట్స్మన్ సాల్ట్ కూడా దాటిగా ఆడటం మొదలుపెట్టాడు. అయితే ఈ సిరీస్ లో అత్యంత విజయవంతమైన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో తిలక్ వర్మ క్యాచ్ పట్టగా బట్లర్ పెవిలియన్ బాట పట్టడం తో ఇంగ్లాండ్ కొంచెం ఇబ్బందిలో పడింది. ఇక బాధ్యత మొత్తం సాల్ట్ పైన పడింది.
అయితే అంతకుముందు వికెట్ తీసిన వరుణ్ చక్రవర్తి సాటిస్పిన్నర్ రవి బిష్ణొయి బౌలింగ్ లో ఒక మంచి క్యాచ్ పట్టగా బ్రూక్ అవుట్ కావడం తో ఇంగ్లాండ్ మరింత ఇబ్బంది పడింది. వెనువెంటనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో రింకు సింగ్ కి క్యాచ్ ఇచ్చి లివింగ్ స్టోన్ వెను తిరగడంతో ఇంగ్లాండ్ నాలుగు ముఖ్యమైన వికెట్లు పోగొట్టుకొని ఇబ్బందుల్లో పడిపోయింది. క్లిష్ట పరిస్థితుల్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సాల్ట్ 21 బంతుల్లో అర్థ శతకం సాధించి పోరాటాన్ని కొనసాగించాడు. 7 ఓవర్లలో భారత జట్టు స్కోరు111 పరుగులు ఉండగా, ఇంగ్లాండ్ జట్టు స్కోరు నాలుగు వికెట్లు కోల్పోయి 82 పరుగులు ఉంది.
పేలవమైన బ్యాటింగ్ తో నిరాశపరిచిన ఇంగ్లాండ్
బ్యాటింగ్ లో బాగా ఆడి బౌలింగ్ కు దిగిన శివం దూబే సాల్ట్ ను అవుట్ చేయడంతో.. ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించడం కష్ట తరంగా మారింది. ఇక బాధ్యత మొత్తం యువ ఆటగాడు బెతెల్ పైన పడింది. అయితే ఐదు మంది ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ కు చేరితే 248 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం. 3-1 తేడాతో సిరీస్ ఇది వరకే గెల్చుకున్న భారత జట్టు గెలుపు నామమాత్రంగా మారింది. ఆరో వికెట్ రూపంలో, ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు కార్స్ అభిషేక్ శర్మ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇవ్వడంతో భారత జట్టు విజయం ఖాయం అయింది. అంతలో ఓవర్టను సూర్య కుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పోవడంతో అభిషేక్ శర్మ కు 2 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ లో అదరగొట్టిన అభిషేక్ శర్మ బౌలింగ్ కూడా చేసి రెండు వికెట్లు సాధించడం విశేషం. 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడం ఖాయం అయిపోయింది. శివం దూబే బ్యాటింగ్ లో రాణించడమే కాకుండా 2 వికెట్లు కూడా సాధించాడు. 10 ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఇంగ్లాండ్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. 97 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు పోరాటాన్ని ఆపేసింది. చివరకు షమీ బౌలింగ్ లో వుడ్ అవుట్ కావడం తో భారత జట్టు 150 పరుగుల తేడాతో చివరి టి20 ని గెలిచింది. 4-1 తేడాతో భారత జట్టు సిరీస్ ను గెలుచుకుంది. ఇంగ్లాండ్ జట్టు ఏమాత్రం పోరాటం చేయకుండా ఓడిపోయింది. ఏకపక్షంగా సాగిన ఈ టి20 లో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది
భారత్ బ్యాటింగ్:
247 పరుగులు/ 9 వికెట్లు (20 ఓవర్లు)
అభిషేక్ శర్మ 135 పరుగులు (54 బంతులు)
తిలక్ వర్మ 24 పరుగులు (15 బంతులు)
శివం దూబె 30 పరుగులు (13 బంతులు)
ఇంగ్లాండ్ బౌలింగ్:
జొఫ్రా ఆర్చర్ 1 వికెట్ (4 ఓవర్లు)
మార్క్ ఉడ్ 2 వికెట్లు (4 ఓవర్లు)
ఆదిల్ రషిద్ 1 వికెట్ (3 ఓవర్లు)
బ్రైడన్ కార్సె 3 వికెట్ (4 ఓవర్లు)
జేమి ఒవెర్టన్ 1 వికెట్ (3 ఓవర్లు)
ఇంగ్లాండ్ బ్యాటింగ్:
97 పరుగులు/10 వికెట్లు (10.3 ఓవర్లు)
సాల్ట్ 55 పరుగులు (23 బంతులు)
భారత్ బౌలింగ్:
షమి 3 వికెట్లు (2.3 ఓవర్లు)
వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు (2 ఓవర్లు)
బిష్నోయ్ 1 వికెట్ (1 ఓవర్)
అభిషేక్ శర్మ 2 వికెట్లు (1 ఓవర్)
శివం దూబె 2 వికెట్లు (2 ఓవర్లు)
Next Story