ఆసియా కప్ లో మరోమారు పాక్ తో భారత్ ఢీ
x
భారత ఆటగాళ్లు

ఆసియా కప్ లో మరోమారు పాక్ తో భారత్ ఢీ

భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడంతో తీవ్ర అవమానంలో పాకిస్తాన్


ఆసియా కప్ లో సూపర్ ఫోర్ దశలో మరోసారి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఈ రోజు దుబాయ్ వేదికగా జరగబోతోంది. ఎడారి ఎండ కంటే హట్ గా మొన్న లీగ్ దశలో జరిగిన ‘నో షేక్ హ్యాండ్’ వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది. దుబాయ్ లో స్లో పిచ్ లపై ఆధిపత్యం కోసం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి స్పిన్ త్రయంపైనే ఎక్కువగా ఆధారపడనున్నాడు.

హ్యాండ్ షేక్ వివాదం..
గతంలో భారత్- పాకిస్తాన్ పురుషుల క్రికెట్ మ్యాచ్ లకు అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానీ గత ఆదివారం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదనే నిర్ణయాన్ని పాకిస్తాన్ ను తీవ్ర అవమానాలా పాలు చేసింది.
నేడు జరగబోయే మరో మ్యాచ్ లోనూ భారత జట్టు ఇదే విధానాన్ని అనుసరించడానికి సిద్దంగా ఉంది. పాకిస్తాన్ ఆటగాళ్లు, దాని మద్దతుదారులు దీనిని ద్వేషపూరిత మ్యాచ్ గా చూస్తున్నప్పటికీ ఈ మ్యాచ్ జరగడం తథ్యంగా మారింది. కానీ కరచాలనలు ఇవ్వకపోవడం అనేది ఆ జట్టుకు మింగుడు పడటం లేదు
అక్షర్ తలకు గాయం..
ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో వెనక్కి ఉరుకుతూ క్యాచ్ తీసుకునే క్రమంలో అక్షర్ తల గ్రౌండ్ ను తాకింది. ఇది జట్టును ఆందోళను గురి చేసింది. అయితే ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ మాత్రం అక్షర్ బాగానే ఉన్నాడని తెలిపాడు.
పాక్ తో కీలక మ్యాచ్ కు ముందు ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు బెంచ్ ను సూర్యకుమార్ యాదవ్ పరీక్షించాడు. హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్ లకు అవకాశం ఇచ్చారు. వీరు ఒమన్ ఆటగాళ్లను ఆపలేకపోయారు.
ముఖ్యంగా 43 ఏళ్ల అమిర్ కలీమ్, మహ్మద్ మీర్జాలు వీరిని సులువుగా ఎదుర్కొన్నారు. వీరు ఇద్దరు పాక్ లో జన్మించినప్పటికీ ఒమన్ తరఫున క్రికెట్ ఆడుతున్నారు.
అయితే ఆదివారం నాటి మ్యాచ్ లో భారత ఏస్ బౌలర్ బుమ్రా తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వస్తారు. అక్షర్ ఫిట్ గా లేకుంటే అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్ లో ఎవరో ఒకరు జట్టులో చేరవచ్చు. కానీ ప్రస్తుతం అలాంటి ఏర్పాటు ఏం కనిపించడం లేదు.
ఆయుబ్..
పాకిస్తాన్ జట్టు అనూహ్యతకు మారుపేరు. ప్రస్తుత జట్టు అంత బలంగా లేదు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ఆటగాళ్లు, ఎవరూ అంచనాలకు తగ్గినట్లు ఆడటం లేదు. గతంలో జావేద్ మియాందాద్, ఇంజమామ్ ఉల్ హక్, సలీమ్ మాలిక్, ఇజాజ్ అహ్మద్ వంటి ఛాంపియన్ ఆటగాళ్లను అందించిన దేశానికి ప్రస్తుతం అటువంటి ప్రతిభావంతులను అందించలేకపోతోంది.
ముఖ్యంగా పాక్ ఒపెనర్ ఈ టోర్నమెంట్ హ్యట్రిక్ డకౌట్ లు చేశాడు. ఎడమ చేతి వాటం ఒపెనర్ సైమ్ ఆయుబ్, బ్యాట్ కంటే బంతితో ఎక్కువ ప్రభావం చూపుతున్నాడు.
సాహిబ్ జాదా ఫర్హాన్, హసన్ నవాజ్ లు కూడా బ్యాటింగ్ చేయడానికి క్రీజులో ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్ బాగా చేసే షాహీన్ షా ఆఫ్రీది రెండు మ్యాచ్ లలో చివరగా ఫినిషర్ పాత్రను పోషించాడు. పఖర్ జమాన్ మాత్రమే ఓ మోస్తారుగా రాణిస్తున్నాడు. యూఏఈపై మంచి రిథమ్ తో బౌలింగ్ చేసిన హరీస్ రవూఫ్ కు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
సంజూ సామ్సన్..
ఒపెనర్ గా శుభ్ మన్ గిల్ రావడంతో మిడిల్ ఆర్డర్ లోకి వచ్చిన సంజూ శాంసన్, ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం మూడో స్థానంలోకి బ్యాటింగ్ లోకి వచ్చాడు. కానీ పాక్ తో జరిగే మ్యాచ్ లో మాత్రం మళ్లీ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి మూడోస్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. పవర్ ప్లే లో అభిషేక్ శర్మ పెవిలియన్ చేరితే తిలక్ వర్మ 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. గిల్, పాండ్యా, దూబే నుంచి పరుగులు రావడం లేదు. ఇదే జట్టును ఇబ్బంది పెడుతోంది.
జట్టు అంచనా:
భారత్: సూర్య కుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్, తిలక్ వర్మ, సంజూ సామ్సన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హర్డిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా, రింకు సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా
పాకిస్తాన్: సల్మాన్ అలా అఘా(కెప్టెన్) అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్థిల్ షా, మహ్మద్ హరీస్(వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, షాహన్ సహీబ్ జీమ్, సాహిబ్ సల్మాన్, సాహిజ్జీమ్ అఫ్రిదీ, సుఫ్యాన్ మొకిమ్.
మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు సోని లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.


Read More
Next Story