హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్ పోటీల సందడి
x

హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్ పోటీల సందడి

హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ లో జరుగుతున్న 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పోటీలు ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్నాయి.


అది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ జలాశయం...ట్యాంక్ బండ్‌తో పాటు నెక్లెస్ రోడ్డు మూడువైపులా వేలాది మంది సందర్శకుల సందడి...దేశంలోని నలుమూలల నుంచి తరలివచ్చిన సెయిలర్లు సెయిలింగ్ బోట్లతో హుసేన్ సాగర్ గ్రాండ్ ఈవెంటులో పాల్గొంటున్నారు. యువ తరంలో నౌకాయానం పట్ల ప్రేమను పెంపొందించేందుకు సెయిలింగ్ పోటీలు దోహదపడతాయని ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా చెప్పారు.

- సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 100 మంది సెయిలర్లు పాల్గొంటున్నారు. జులై 3 నుంచి జూలై 6 వరకు జరిగే జాతీయ రేసింగ్ ఈవెంట్‌లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,తమిళనాడు,గోవా,ఆంధ్రప్రదేశ్,మేఘాలయ,హర్యానా, ఇతర రాష్ట్రాల నుంచి నావికులు పాల్గొంటున్నారు.

సెయిలింగ్ వీక్ కీలకం
భారతదేశ సెయిలింగ్ క్యాలెండర్‌లో 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ కీలకమైంది.సెయిలింగ్ పోటీలను ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా ప్రారంభించారు. లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే ఆధ్వర్యంలోని సైనిక విభాగాలు,సెయిలింగ్ అసోసియేషన్, ప్రెసిడెంట్ లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో సెయిలింగ్ పోటీలు సాగుతున్నాయి.

హుసేన్ సాగర్ లో సెయిలింగ్ కోలాహలం

సెయిలింగులో బాలికలకు శిక్షణ
ఈ ఏడాది సాగుతున్న హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌ సెయిలింగ్‌ ప్రతిభకు,క్రీడాస్ఫూర్తికి పోటీగా నిలిచాయి.సెయిలింగ్ పోటీలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈవెంట్ నిర్వహిస్తున్నామని సెయిలింగ్ అసోసియేషన్ ప్రతినిధి చెప్పారు.ఈ శిబిరంలో బాలికలకు సెయిలింగులో శిక్షణ ఇస్తామని అసోసియేషన్ ప్రకటించింది.

పెయిలింగ్ పోటీల్లో విజేతలు వీరే
హైదరాబాద్‌లోని ఈఎంఈ సెయిలింగ్ క్లబ్‌లో జరుగుతున్న 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో ఐఎన్‌డబ్ల్యుటీసీ ముంబయికి చెందిన రితికా డాంగి వరుసగా ఐఎల్‌సిఎ 6 ఓపెన్, మహిళల విభాగంలో డబుల్ ఛాంపియన్‌గా నిలిచింది.ఇతర రేసుల్లో మోహిత్ సైనీ ఐఎల్ సీఏ 7 ఈవెంట్‌ను గెలుచుకున్నారు. అంకిత్ సింగ్ సిసోడియా,సోమ్యా సింగ్ పటేల్ వరుసగా ఐఎల్ సీఏ బాలురు, బాలికల టైటిల్‌లను కైవసం చేసుకున్నారు.

సెయిలింగ్ పోటీల ముగింపు జులై 7

సెయిలింగ్ క్లబ్‌లో జరిగిన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో మొదటి రోజు జరిగిన ఈవెంట్‌లో మోహిత్ సైనీ అగ్రస్థానంలో నిలిచాడు.జులై 3వతేదీ నుంచి జులై 6 వరకు ఈ పోటీలు జరుగుతాయని సెయిలింగ్ క్లబ్ నిర్వాహకులు చెప్పారు. జులై 7వతేదీన బహుమతి ప్రదానోత్సవం, ముగింపు వేడుకలు నిర్వహిస్తామని వారు తెలిపారు.


Read More
Next Story