
భారత్, పాక్ ఆటగాళ్లు
ఆసియా కప్ లో పాకిస్తాన్ తో ఎలా ఆడతారు?
బీసీసీఐ పై విపక్షాల ఆగ్రహం
ఆసియా కప్ లో భారత్- పాక్ మధ్య ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు మ్యాచ్ లు జరిగే అవకాశం ఉండటంతో దేశంలోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో 20 మంది హిందువులని గుర్తించి పాక్ ఇస్లామిక్ జిహాదీ ఉగ్రమూకలు కాల్చి చంపిన తరువాత క్రికెట్ లో భారత్- పాకిస్తాన్ తో ఆడుతుందనే వార్తలు ప్రతిపక్షానికి ఆగ్రహానికి కారణమైంది.
కాశ్మీర్ ఊచకోతలో పాల్గొన్న ఉగ్రవాదులు తప్పించుకుని తిరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడతారని విపక్ష నాయకులు విమర్శించారు. ప్రస్తుత వాస్తవికతల్లో క్రీడా దౌత్యంపై వెనక్కి తగ్గాలని కూడా అన్నారు.
ప్రతిపక్షాల అసంతృప్తి
శివసేన(యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదీ మాట్లాడుతూ.. ‘‘సైనికులు రక్తం కంటే లాభం ఎక్కువా’’ అని ప్రశ్నించారు. భారతీయులు, పాకిస్తాన్ తో ఏదైనా క్రికెట్ ఆటను వ్యతిరేకిస్తారని అన్నారు. అది దేశంలో జరిగిన, విదేశాలలో అయిన ఇదే పరిస్థితి ఉంటుందన్నారు.
‘‘ప్రియమైన బీసీసీఐ మీరు ఏ దేశానికి తరలించిన, క్రికెట్ మైదానంలో పాకిస్తాన్ తో జరిగే ఏదైనా ఒప్పందాన్ని భారతీయులంతా నిరసిస్తారని గుర్తుంచుకోండి. భారతీయులు, సాయుధ దళాల రక్తంతో మీ లాభాన్ని ఆపండి.
ఒక వైపు భారత సీడీఎస్ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రకటించగా మరోవైపు మీరు మీ రక్తపు ధనాన్ని సంపాదించడానకి తొందరపడుతున్నారు’’ అని ఒక ఎక్స్ పోస్ట్ లో విమర్శించారు. ఆమె తన పోస్ట్ ను క్రీడా మంత్రి మన్సుక్ మాండవీయకు ట్యాగ్ చేశారు. ఇది ఎలా సరైందని ప్రశ్నించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్- పాకిస్తాన్, పీఓజేకేలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఫలితంగా రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు ప్రారంభం అయ్యాయి.
నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఘర్షణలో పాక్ తెల్ల జెండా ఎగరవేసి కాళ్ల బేరానికి వచ్చింది. పాక్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఆరోపిస్తోంది. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని కఠిన వైఖరి అవలంబించింది.
జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుఖ్ దేవ్ భగత్ మాట్లాడుతూ.. ఆసియా కప్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషించవని అభిప్రాయపడ్డారు.
‘‘చాలామంది క్రీడలను రాజకీయాల నుంచి లేదా మిగతా వాటి నుంచి వేరుగా ఉంచాలని చెబుతారు. కానీ పాకిస్తాన్ చర్యల వల్ల మొత్తం దేశం, దేశభక్తి, జాతీయ భావాలు దెబ్బతిన్నాయి. వాటిపై బలమైన చర్య తీసుకున్న తరువాత మనం తదుపరి చర్య తీసుకోవాలి’’ అని ఆయన చెప్పారు.
మాజీ కెప్టెన్ అజారుద్దీన్..
మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మాట్లాడుతూ.. చిరకాల ప్రత్యర్థులతో సంబంధాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. భారత్ ద్వైపాక్షిక సిరీస్ నుంచి వైదొలిగితే దాని అంతర్జాతీయ భవిష్యత్ నాశనం అవుతుందని అన్నారు.
భారత్- పాకిస్తాన్ ల మధ్య రాజకీయ సంబంధాలు చెడిపోవడం వారి ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను ప్రభావితం చేసినప్పటికీ రెండు దేశాలు ఇప్పటికే ఐసీసీ సహ ఇతర టోర్నమెంట్లలో, తటస్థ వేదికలలో ఆడారు.
కానీ పహల్గామ్ దాడి తరువాత అది కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఇటీవల భారత మాజీలు కూడా ఇంగ్లాండ్ లో జరగాల్సిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ లో పాకిస్తాన్ తో జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేశారు. ఈ జట్టులో హర్భజన్ సింగ్, ఇర్పాన్ పఠాన్, శిఖర్ ధావన్ వంటి క్రికెటర్లు ఉన్నారు.
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఆసియా కప్ నిర్వహణ షెడ్యూల్ విడుదల చేశారు. అది కూడా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రావడంతో వివాదం అయింది.
ప్రియాంక చతుర్వేది ఈ అంశాన్ని కూడా లేవనెత్తారు. ‘‘కార్గిల్ విజయ్ దివస్ రోజు భారత సైన్యాన్ని స్మరించుకునే రోజు. మన దేశాన్ని రక్షించుకోవడానికి తమ ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులను గుర్తు చేసుకునే రోజు.
అదే రోజున బీసీసీఐ పాకిస్తాన్ అంతర్గత మంత్రి పీసీబీ చైర్మన్ ను యూఏఈలో భారత్- పాక్ మ్యాచ్ లను నిర్వహించే ఆసియా కప్ టోర్నమెంట్ ధృవీకరించమని కోరింది. ఇది సిగ్గు చేటు’’ అని ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ 9 న ప్రారంభం అయ్యే ఈ టోర్నమెంట్ లో ఆసియాలోని ఎనిమిది దేశాలు పాల్గొంటాయి. సూపర్ ఫోర్ దశకు చేరుకోవడానికి అనుకూలంగా ఉన్నందున భారత్, పాకిస్తాన్ లు ఏకంగా మూడు సార్లు తలపడే అవకాశం కనిపిస్తోంది.
బహుశా ఫైనల్ మ్యాచ్ కూడా ఈ జట్ల మధ్య జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆసియాకప్ గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్ తో పాటు ఒమన్, యూఏఈ జట్లు కూడా ఉన్నాయి.
గ్రూప్ బీ లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. పైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. 2023 లో పాకిస్తాన్ లో ఆసియా కప్ నిర్వహించినప్పటికీ భారత్ అక్కడికి వెళ్లడానికి నిరాకరించింది.
ఫైనల్ మ్యాచ్ సహ భారత్ ఆడిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో నిర్వహించారు. భారత్ ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి కప్ ను కైవసం చేసుకుంది.
Next Story