లక్ష్యం కోసం ఫర్ ఫెక్ట్ బ్లూప్రింట్ ను ఎలా అమలు చేశారు?
x

లక్ష్యం కోసం ఫర్ ఫెక్ట్ బ్లూప్రింట్ ను ఎలా అమలు చేశారు?

శ్రీలంక వారి ఇన్నింగ్స్ లో కేవలం ఎనిమిది రన్ రేట్ తో పరుగులు సాధిస్తే.. భారత్ మాత్రం పది పరుగుల నెట్ రన్ రేట్ తో లక్ష్యాన్ని చేధించాల్సి వచ్చింది.


(ఆర్. కౌశిక్)

డక్ వర్త్ లూయిస్ అనేది క్రికెట్ లో వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగితే తదుపరి మ్యాచ్ ను నిర్ణయించడానికి వీలుగా ఉపయోగిస్తున్నారు. ఇది క్రికెట్ లో అత్యుత్తమ వ్యవస్థగా పరిగణిస్తుంటారు. ఆదివారం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక- భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది.

భారత్ బ్యాటింగ్ ప్రారంభించగానే ప్రారంభమైన వర్షం.. గంట పాటు ఆటకు అంతరాయం కలిగించింది. డీఎల్ఎస్ లో లక్ష్యాలను సవరించినప్పుడు బ్యాటింగ్ జట్టు వద్ద మిగిలి ఉన్న వనరులను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. రెండో T20 ఇంటర్నేషనల్‌లో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 161 పరుగులను ఛేదించడానికి బరిలోకి దిగింది. మూడు బంతుల్లో ఆరు పరుగులు చేసిన తరుణంలో వర్షం రంగ ప్రవేశం చేసింది.

DLS పద్ధతి
ప్రపంచంలోని చాలా మైదానాల్లో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది. కానీ శ్రీలంకలోని పల్లెకెలెలో మాత్రం సిబ్బంది మొత్తం గ్రౌండ్ ను కవర్లతో కప్పివేశారు. దీనివల్ల వర్షం తగ్గిన తరువాత కూడా మైదానం ఆరడానికి సమయం తీసుకునే అవకాశం ఉండదు. అవుట్ ఫీల్డ్ కూడా పొడిగా ఉంటుంది. అందువల్ల, భారత్ ఛేజింగ్ 70 నిమిషాల అంతరాయం తర్వాత తిరిగి ప్రారంభించగలిగింది. మన జట్టు లక్ష్యం అప్పటికే ఎనిమిది ఓవర్లలో 78 గా నిర్ణయించారు.
యశస్వి జైస్వాల్ - సంజూ శాంసన్ రెండో సారి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, భారత్‌కు 45 బంతుల్లో 72 పరుగులు కావాలి. పది వికెట్లు మిగిలి ఉన్నాయి. అది కొంత గందరగోళంగా కనిపించి ఉండవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా శ్రీలంక వారి ఇన్నింగ్స్ లో కేవలం ఎనిమిది రన్ రేట్ తో పరుగులు సాధిస్తే.. భారత్ మాత్రం పది పరుగుల నెట్ రన్ రేట్ తో లక్ష్యాన్ని చేధించాల్సి వచ్చింది. దానికి ప్రధాన కారణం భారత్ చేతిలో పది వికెట్లు ఉన్నాయి. అందువల్ల డీఎల్ఎస్ మరోసారి ఈ వివాదాస్పద లక్ష్యాన్ని జట్టు ముందు నిలిపేలా చేసింది.
విచిత్రమైన సంఘటన 1992
డక్ వర్త్ నియామాలు ఇంతే. 1992 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ జట్ల మధ్య ఇలాగే ఒక జట్టుకు ప్రయోజనం కలిగించేలా డీఎల్ఎస్ లెక్కలు తేలాయి. అదే కప్ లో మరో మ్యాచ్ లో ఇంగ్లండ్ ను డక్ వర్త్ గెలిపించింది. 1992 సెమీఫైనల్లో ఇంగ్లండ్- దక్షిణాఫ్రికా తలపడ్డాయి. సౌత్ ఆఫ్రికా 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన తరుణంలో వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం కలిగింది. తదుపరి మ్యాచ్ ప్రారంభం అయ్యేసరికి ఈ ఆఫ్రికన్ దేశం ఒక బంతికి 22 పరుగులు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సంధించిన రెండు మెయిడిన్ ఓవర్లను పరిగణలోకి తీసుకుని ఈ లెక్కలు వేశారు. అందువల్ల కేవలం ఒక బంతికి 22 పరుగులు సాధించాల్సిన పరిస్థితి దాపురించింది.
నిరుత్సాహకరం కానీ అసాధ్యం కాదు
దానితో పోలిస్తే, ఎనిమిది ఓవర్లలో 78 పెద్దగా పెరుగుదల కాదు. కానీ ఇది ఒక బంతిలో 22 పరుగుల కంటే అసాధ్యం కాదు. 45 బంతుల్లో 72 కనిపించినంత తేలిక కాదు. రెండు టైట్ ఓవర్ల తరువాత రిషబ్ పంత్ మ్యాచ్ బరిలోకి దిగాడు. సంజూ శాంసన్ కు చాలా సంవత్సరాలుగా మ్యాచ్ ఆడటానికి సరైన అవకాశాలు ఇవ్వట్లేదని విమర్శలు ఉన్న వస్తున్న నేపథ్యంలో అతడిని ఒపెనర్ గా బరిలోకి దించారు. అయితే తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు.
ఒత్తిడి మాత్రమే
వైస్ కెప్టెన్ గా ప్రమోట్ అయిన శుభ్ మన్ గిల్ మెడనొప్పి కారణంగా ఆదివారం నాటి మ్యాచ్ లో బరిలోకి దిగలేదు. ఈ కారణంగా శాంసన్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. యంగ్ ఒపెనర్ యశస్వి జైస్వాల్ కు తోడుగా ఓపెనర్ గా బరిలోకి దింపారు. రెండో ఓవర్ ప్రారంభంలోనే మహేశ్ తీక్షణ సంధించిన క్యారమ్ బాల్ కు సంజూ దగ్గర సమాధానం లేదు. ఆ ఓవర్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. షనక వేసిన ఓవర్ లో జైస్వాల్ భారీ షాట్లు ఆడి తన ఉద్దేశ్యాన్ని ప్రకటించాడు. తరువాత హసరంగ బౌలింగ్ కు దిగాడు. ఇది కూడా టైట్ ఓవర్ గా మిగిలింది.
హసరంగా టీ20 లో బౌలర్ల ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్నాడు. ఇంతకుముందు మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో కేవలం 28 పరుగులే ఇచ్చి జై స్వాల్ వికెట్ తీసుకున్నాడు. గత మ్యాచ్ అనుభవనాలను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ చరిత అసలంక హసరంగను బౌలింగ్ కు తీసుకువచ్చాడు. కానీ జైస్వాల్ బంతిని బలంగా బాదుతూ పరుగులు సాధించాడు. మరో వైపు కెప్టెన్ సూర్య కుమార్ నాలుగు బౌండరీలు సాధించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇవన్నీ కూడా తీక్షణ బౌలింగ్ లోనే కావడం గమనార్హం.
ఓవర్ కు కనీసం పది పరుగుల రన్ రేట్ తో పరుగులు సాధించాల్సిన తరుణంలో ఈ లెప్ట్ అండ్ రైట్ కాంబినేషన్ స్ట్రోక్ ప్లేలో తమ తెలివితేటలను ప్రదర్శించారు. ఇద్దరు కూడా స్వీప్ షాట్లు ఆడటంలో సమర్థులు కావునా.. అలవోక పరుగులు రాబట్టారు. చివరగా ఫినిషర్ గా హర్ధిక్ తన పని పూర్తి చేశాడు. కెప్టెన్ గా సూర్యకు, కోచ్ గా గంభీర్ కు తొలి సిరీస్ దక్కింది.


Read More
Next Story