ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై గౌతమ్ గంభీర్ ఫిర్యాదు..
x

ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై గౌతమ్ గంభీర్ ఫిర్యాదు..

2.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానంలో పిటీషన్..


Click the Play button to hear this message in audio format

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తనపై సృష్టించిన ఏఐ డీప్‌ఫేక్ వీడియోల దుర్వినియోగంపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. ఈ కేసులో రూ. 2.5 కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేశారు.

డీప్‌ఫేక్‌లపై ఆందోళన..

ఒక వీడియోలో గంభీర్ రాజీనామా చేస్తున్నట్లు చూపించగా, దానికి లక్షల వ్యూస్ వచ్చాయి. మరో వీడియోలో ఇతర క్రికెటర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. ఈ కేసులో 16 మంది ప్రతివాదులను చేర్చారు. అందులో మెటా, అమెజాన్ వంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఈ-కామర్స్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కూడా ఇందులో భాగమయ్యాయి. గంభీర్ చెప్పని విషయాలను చెప్పినట్లు వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వ్యక్తిగత గుర్తింపును కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

కోర్టు ముందు గంభీర్ డిమాండ్లేంటి?

‘తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలి. నకిలీ వీడియోలు, కంటెంట్‌ను వెంటనే తొలగించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని పిటీషన్‌లో కోరారు.

‘ఇది నా ఒక్కరి సమస్య కాదు..’

ఈ సమస్య కేవలం తన ఒక్కడి సమస్య కాదని, డిజిటల్ యుగంలో ప్రముఖుల హక్కులకు సంబంధించిన విషయం అని చెప్పారు గౌతమ్. డీప్‌ఫేక్‌లపై కోర్టును ఆశ్రయించిన ప్రముఖులలో ఇప్పుడు గంభీర్ కూడా చేరారు. ఇప్పటికే పలువురు సినీ నటులు, క్రీడాకారులు ఇలాంటి కేసులు వేశారు. మొత్తంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగంపై గంభీర్ తీసుకున్న ఈ చర్య, డిజిటల్ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.

Read More
Next Story