
సీనియర్లతో గంభీర్, అగార్కర్ కు పడటం లేదా?
రో-కో ద్వయంతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని జాతీయ మీడియా కథనాలు
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో టీమిండియా కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్ కు సరైన సంబంధాలు లేవా అంటే అవుననే అంటోంది జాతీయ మీడియా. ఇద్దరి మధ్య కనీస మాటలు కూడా లేవని ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ జాగరణ్ వార్తా కథానాన్ని ప్రసారం చేసింది.
రాంఛీలో నిన్న జరిగిన తొలి వన్డేలో స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ రికార్డు స్థాయిలో 52 వ వన్డే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం కోచ్, సీనియర్ ఆటగాళ్ల మధ్య సంబంధాలు కాస్త కుదురుకున్నట్లు ఒక నివేదిక బయటకు వచ్చింది. కొన్ని రోజుల క్రితమే టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి రో-కో ద్వయం నిష్క్రమించింది.
ఇద్దరు ఆటగాళ్లు కేవలం వన్డే జట్టులో మాత్రమే కొనసాగుతున్నారు. నిన్న జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు సాధించారు. రోహిత్ 51 బంతులలో 57 పరుగులు చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 349/8 పరుగులు సాధించింది. తుది వరకూ పోరాడిన సౌత్ ఆఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది.

