భారత్- పాక్ మ్యాచ్ పై అభిమానుల అనాసక్తి
x

భారత్- పాక్ మ్యాచ్ పై అభిమానుల అనాసక్తి

ఇప్పటి దాకా అమ్ముడు పోని టిక్కెట్లు


ఆసియా కప్ ప్రారంభమైంది. నేడు భారత్ తన ప్రత్యర్థి యూఏఈతో తలపడబోతోంది. తదుపరి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడబోతోంది. ఈ సమయంలో సాధారణంగా స్టేడియంలో మ్యాచ్ చూడాలనుకుంటే టికెట్లు దొరకవు.

అసలు బుకింగ్ ఓపెన్ చేయగానే టికెట్లు హట్ కేకుల్లా అమ్ముడు పోయిన సంగతులే మనం చూశాం. కానీ ఇందుకు విరుద్దంగా దుబాయ్ వేదిక గా జరగబోయే మ్యాచ్ కు టికెట్లు ఇంకా అమ్ముడు పోలేదని జాతీయ మీడియా వార్తా కథనాలు ప్రసారం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించాలనే ప్రపంచకప్, ఛాంపియన్ ట్రోఫి సహ ప్రధాన అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ షెడ్యూల్ లలో భారత్, పాక్ జట్లను ఒకే గ్రూపులో పెడతారు. అయితే ప్రస్తుతం ఆసియాకప్ టీ20 లో ఈ వ్యూహం బెడిసికొట్టింది.

బల్క్ టికెట్ ఆలోచన..
నిర్వాహాకులు ప్రవేశపెట్టిన బల్క్ టికెట్ ఐడియా టిక్కెట్లు అమ్ముడు పోకుండా ఉండటానికి ఒక కారణంగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆసియా కప్ కోసం అభిమానులు నిర్దిష్ట జట్టు అన్ని మ్యాచ్ ల కోసం టికెట్లను బండిల్ గా కొనుగోలు చేయాల్సి ఉంది.
యూఏఈ, ఒమన్, హాంకాంగ్ వంటి జట్లు ఆడే మ్యాచ్ లను ప్రొత్సహించాలనే ఉద్దేశ్యంతో వీటిని ప్రవేశపెట్టారు. కానీ క్రికెట్ అభిమానులకు ఈ విషయం నచ్చలేదు. ఉదాహారణకు గ్రూప్ ఏ లోని మ్యాచ్ ల ప్యాకేజీ ఏఈడీ 475(రూ.11 వేలు) నుంచి ప్రారంభం అవతుంది.
మ్యాచ్ జరిగే దగ్గర్లో సింగిల్ మ్యాచ్ టికెట్లను విడుదల చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారని మరో కథనం తెలియజేస్తోంది. సూపర్ ఫోర్ మ్యాచ్ లు ఫైనల్ లను మాత్రం ప్యాకేజీలో చేర్చకపోవడంతో మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకౌట్ మ్యాచ్ లు దానిలో భాగమైతే ప్యాకేజీ వ్యవస్థ ప్రయోజనకరంగా ఉండేదని అన్నారు.
టికెట్ ధరలు..
టికెట్ ధరలు అధికంగా ఉండటం కూడా అభిమానులు అనాసక్తి ప్రదర్శించడానికి మరో కారణం. టికెటింగ్ పోర్టల్ రూ. 2.57 లక్షల ధర గల వీఐపీ సూట్స్ ఈస్ట్ జతను చూపించింది. రెండు స్కై బాక్స్ ఈస్ట్ టిక్కెట్ల ధర రూ. 1.67 లక్షలు, ప్లాటినం టికెట్ల రెండు రూ. 75 వేలు, రెండు గ్రౌండ్ లాంజ్ టిక్కెట్ల ధర రూ. 70 వేలుగా ఉంది.
పహల్గామ్ దాడి.. ఆపరేషన్ సిందూర్..
భారత్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పహల్గామ్ ఉగ్రవాద దాడి, దీనికి న్యూఢిల్లీ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన తరువాత రెండు దేశాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
రెండు జట్లు ఇప్పటికీ ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫి వంటి బహుళ పక్ష టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. అయితే ఈ క్రీడా మ్యాచ్ లు కూడా నిలిపివేయాలని భారత్ లో గట్టిగా డిమాండ్లు వినిపించాయి.
భారత ప్రభుత్వం అనుమతి..
పాక్ తో క్రికెట్ సహ ఏ రకమైన క్రీడలు ఆడరాదని దేశవ్యాప్తంగా డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆసియాకప్ ఆడటానికి అనుమతి ఇచ్చింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరువాత రిటైరయిన క్రికెటర్లు ఆడుతున్న పలు టోర్నీలలో భారత జట్టు పాక్ తో మ్యాచ్ లు ఆడటానికి నిరాకరించారు.
ప్రస్తుతం ఆసియా కప్ భారత్, పాకిస్తాన్ ఏకంగా మూడు సార్లు తలపడే అవకాశం కనిపిస్తుంది. గ్రూప్ స్టేజీలో ఒకసారి, సూపర్ ఫోర్, చివరగా ఫైనల్ లో కూడా తలపడే అవకాశం ఉంది. భారత్, పాక్ లు ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్ లో 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్ లలో గెలవగా, పాక్ మూడు సార్లు మాత్రమే గెలిచింది. ఆసియా కప్ లో చివరగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ ను భారత్ ఓడించింది.


Read More
Next Story