వారిద్దరే ఓపెనర్ గా రావాలి: సంజయ్ మంజ్రేకర్
x

వారిద్దరే ఓపెనర్ గా రావాలి: సంజయ్ మంజ్రేకర్

టీ20 వరల్డ్ కప్ లో ఓపెనర్లుగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. తనే సెలెక్టర్ అయితే యువకులతో జట్టును..


టీ20 వరల్డ్ కప్ కోసం నేను జట్టును ఎంపిక చేయాల్సి వస్తే సీనియర్లను పక్కన పెట్టేవాడినని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చెప్పాడు. ఇంతకుముందు సీనియర్లతో కూడిన జట్టును ప్రకటించిన సరైన ఫలితాలు రాలేదని అభిప్రాయపడ్డారు. కేవలం యువకులతో జట్టును నింపేవాడినని పేర్కొన్నారు.

రోహిత్ శర్మతో జోడిగా విరాట్ కోహ్లిని పంపాలని ఆయన సూచించాడు. ఇంతకుముందు చాలా సంవత్సరాల పాటు సీనియర్ సభ్యులైన రోహిత్, విరాట్ టీ20 స్క్వాడ్ లో కనిపించలేదని, కానీ సెలక్టర్లు మరోసారి జట్టులో వీరికి చోటు కల్పించారని అన్నారు.
యువ ప్రతిభావంతుడైన యశస్వి జైశ్వాల్ కు మరో ఓపెనర్ పెయిర్ ను వెతకాలని సూచించారు. విరాట్ నంబర్ త్రీలో బ్యాటింగ్ చేస్తే పూర్తి ర్యాలీ లభించదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే జైశ్వాల్ కు తుది జట్టులో చోటు లభిస్తుందని అన్నారు. సంవత్సరాలుగా చేస్తున్న పనే సెలక్షన్ కమిషన్ మరోసారి చేసిందని మంజ్రేకర్ చెప్పారు.
అయితే ఈ సారి మెరుగైన ఫలితాలు వస్తాయనే ఆశిస్తున్నాని, జూన్ 9 న పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో మహ్మద్ ఆమీర్, షాహిన్ షా అఫ్రిదీల నుంచి భారత బ్యాట్స్ మెన్లకు సవాల్ ఎదురవుతుందనే వ్యాఖ్యలను మంజ్రేకర్ తోసిపుచ్చాడు.
"మహ్మద్ అమీర్ ఏడేళ్ల క్రితం తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు. ఈ రోజు అతని ఫామ్ ఎలా ఉందో మాకు తెలియదు. షాహీన్ ఆఫ్రిది రెండేళ్ల క్రితం బౌలర్ కాదు" అని అన్నారు. ఇంతకుముందు జరిగిన మ్యాచ్ లలో కూడా అతడిని భారత్ సమర్థవంతగా ఎదుర్కొందని, ఆసియాకప్ లో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసిన విషయాన్ని గుర్తు చేశారు. పాకిస్తాన్ ను పెద్ద ముప్పుగా చూడట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే స్పిన్నర్ ఇమాద్ వాసిమ్ ను ముప్పుగా పేర్కొన్నారు.
"కొత్త బంతితో ఎడమచేతి వాటం స్పిన్నర్‌ మంచి బంతులు సంధిస్తాడని అన్నారు. తెలివైనవాడు, స్టంప్‌లకు గురి పెడుతూ బౌల్ చేస్తాడు కొత్త బంతి పట్టుకుంటే అతను ముప్పుగా మారవచ్చు" అని చెప్పాడు.
హార్దిక్ పాండ్యా ఫినిషర్‌గా రాణిస్తాడని మంజ్రేకర్ సమర్థించాడు. "నా ఓటు ఎప్పుడూ హార్దిక్ పాండ్యాకే చెందుతుంది. గత వరల్డ్ కప్ లో అడిలైడ్ లో జరిగిన మ్యాచ్ లో పాండ్యా 30 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 190 స్ట్రైక్ రేట్ తో పరగులు సాధించాడు". అని మంజ్రేకర్ చెప్పాడు. శివమ్ దూబే కంటే హార్డిక్ పాండ్యా, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు ఎప్పుడు ప్రతిభలో ముందుంటారని అన్నారు. వీరు భిన్న సామర్థ్యంతో ఆడతారని అన్నారు.
"హార్దిక్ పాండ్యా - శివమ్ దూబే విభిన్న పాత్రలను పోషిస్తారు. ఆటను ముగించడానికి హార్దిక్‌కు సెట్ రోల్ ఉంటుంది స్పిన్నర్లకు వ్యతిరేకంగా శివమ్ ఫ్లోటర్‌గా ఆడతారు," అని అతను చెప్పాడు.
2007లో కరీబియన్‌లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్‌లో భారత్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. తరువాత జరిగిన ఐసీసీ ఈవెంట్ లో కూడా భారత్ కు ఇక్కడ మంచి రికార్డు లేదు.


Read More
Next Story