భారత్ బాకీ ఉంది.. ఇంగ్లండ్ చరిత్ర సృష్టించాలనుకుంటోంది.. ఏం జరుగుతుంది
x

భారత్ బాకీ ఉంది.. ఇంగ్లండ్ చరిత్ర సృష్టించాలనుకుంటోంది.. ఏం జరుగుతుంది

ఐసీసీ టీ20 ప్రపంచకప్ చివరకు వచ్చేసింది. కేవలం రెండే మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆఫ్ఘన్ ను ఓడించి సౌత్ ఆఫ్రికా తొలిసారిగా ఫైనల్ కు చేరింది. ఈ రోజు..


క్రీడల్లో రివెంజ్ అనే పదం తరుచుగా వినిపిస్తూ ఉంటుంది. ఒక జట్టు చేతిలో ఓటమి ఎదురయ్యాక.. అలాంటి స్థాయి ఈవెంట్ అదే దశలో మనల్ని ఓడించిన పాత ప్రత్యర్థిని ఇప్పుడు ఓడించాలని దీనర్థం. కానీ చాలా మంది క్రీడాకారులు దీనిని ఒప్పుకోరు. అసలు తమ నిఘంటువులో ఇలాంటి పదానికి అసలు చోటే లేదని చెబుతుంటారు. ఇలాంటివి తమ మనస్సుకు చాలా దూరమని వివరిస్తారు. పోటీల్లో తమ మనస్సును, మైండ్ ను చాలా రిలాక్స్ గా ఉంచుకోవడానికి ఆటగాళ్లు ప్రయత్నిస్తారు. ఎందుకంటే పాత ఫలితాలే కొత్తగా వస్తాయని చెప్పలేము.

వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో..
భారత్, ఆస్ట్రేలియా మధ్య నిరుడు జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మన అభిమానుల ఆశలు నిజంగా ముక్కలయ్యాయి. అయితే మొన్న జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తు చేయడంతో భారత్ అభిమానులు దీనిని రివెంజ్ గానే భావించారు.
ప్రపంచకప్ లో జరిగిన ప్రతి మ్యాచ్ లో రోహిత్ సేన సాధికారికంగా మ్యాచ్ లు ఆడింది. ప్రేక్షకుల అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఫైనల్ కు దూసుకెళ్లింది. కానీ ఫైనల్ మ్యాచ్ ప్చ్..
సూపర్ ఎయిట్ లో..
ప్రపంచకప్ తరువాత భారత్, ఆస్ట్రేలియా మరోసారి తలపడ్డ సందర్భం ఇది. ఇక్కడ ఆసీస్ ను ఓడించి టీమిండియా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అయితే ఇక్కడ జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. కానీ ఈ మ్యాచ్ లో రోహిత్ నిజంగా అదరగొట్టాడు. కేవలం 41 బంతుల్లో 92 పరుగులు చేసి అదరగొట్టాడు.
మరో వైపు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆసీస్ ఓటమి, తరవాత బంగ్లాదేశ్ ను కాబూలీవాలీ ఓడించడంతో వారి పసికూన అనే ముద్ర నుంచి బయటపడ్డారు. అయితే ఆస్ట్రేలియాను ఓడించడం భారత అభిమానులకు నిజంగా సంతోష పడేలా చేసిందా అంటే నిజానికి కాదు. ఎందుకంటే అప్పుడు ఓడిపోయింది వరల్డ్ కప్ ఫైనల్.. ఇది సూపర్ ఎయిట్ మ్యాచ్ మాత్రమే.
ఇంగ్లండ్‌తో పనిపట్టాలి...
భారత్- ఇంగ్లండ్ తొలిసారిగా 2007 టీ 20 ప్రపంచకప్ తలపడ్డారు. అప్పుడు యువీ చెలరేగడంతో భారత్ విజయం సాధించింది. కానీ 19 నెలల క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ ను ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఓడించింది. తరువాత ఇంగ్లీష్ టీమ్ పాకిస్తాన్ ను ఓడించి కప్ ను ఎగరేసుకుపోయింది. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో భారత్ ను మరోసారి ఎదుర్కొబోతోంది. కానీ ఈసారి ఇంగ్లండ్ పడుతూ లేస్తూ ఇక్కడి దాకా వచ్చింది.
ఇంగ్లండ్ 2015 వరల్డ్ కప్ ఫలితాల తరువాత పూర్తిగా మారిపోయింది. తన జట్టు దృక్ఫథంలో మార్పు తీసుకువచ్చింది 2019లో తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ ను అందుకుంది. అంతకుముందు 2010లో టీ20 వరల్డ్ కప్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. 2022 నాటి టీ20 కప్ ను సైతం అందుకున్నారు.
అడిలైడ్ 2022 ఓటమి తర్వాత భారత్..
అడిలైడ్ 2022 భారత క్రికెట్‌కు అలాంటిదే చేసింది. యువ జట్టును ప్రోత్సహించడం ప్రారంభించింది. మల్టీ ఫర్మామెన్స్ ఉన్న క్రికెటర్ల కోసం చూడటం మొదలుపెట్టింది. రెండు T20 ప్రపంచ కప్‌ల మధ్య మధ్య కాలాన్ని భారత్ తెలివిగా ఉపయోగించుకుంది, వనరులను గుర్తించడం, వాటిని గరిష్ట స్థాయికి చేర్చడం, వారు తమ పాత్రలలో ఎదగడానికి వీలు కల్పించడం, గేమ్ ప్లాన్‌లకు కట్టుబడి ఉన్నప్పుడు వైఫల్యాన్ని పతనం కాదనే విశ్వాసాన్ని నింపింది. జట్టు విశ్వాసాన్ని పూర్తిగా మార్చివేసింది.
టీమిండియా జరిగిన ఆరు మ్యాచ్‌లలో నలుగురు ఆల్-రౌండర్లను రంగంలోకి దించింది. వారిలో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు జడేజా, అక్షర్, ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్లు అయినా పాండ్యా, దూబే. అందరూ అవసరమైన సమయంలో తమ పాత్రలను సరిగ్గా నిర్వర్తించగలుగుతున్నారు. ఇప్పుడు బౌలింగ్ తో పాటు 8 నంబర్ వరకూ బ్యాటింగ్ చేసే వారు ఉన్నారు. ఒకరు విఫలమైన ఆ లోపాన్ని మరొకరు తీర్చగలరు.
అడిలైడ్‌లో ఇంగ్లండ్ ఏం చేసిందో.. ఇప్పుడు భారత్‌, ఇంగ్లండ్‌కు అదే చేసే అవకాశం ఉంది. ఈ గేమ్ లో ముఖ్యంగా జస్ప్రీత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్ కు ముఖ్యపాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. పవర్ ప్లే, మిడిల్ ఓవర్, డెత్ ఓవర్లలో సమర్థవంతంగా బౌలింగ్ చేయగల యూనిట్స్ మన దగ్గర ఉన్నాయి.
పునరావృతమా లేక ప్రతీకారం ?
అడిలైడ్‌లో 168 పరుగుల ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌ ఎలాంటి కష్టం లేకుండా ఛేజింగ్ చేసింది. మరో బౌలింగ్ ఆప్షన్ ఉండే ఫలితం ఇంకోలా ఉండేదేమో. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అప్పటిలా ఏకపక్షంగా ఉండే అవకాశం లేదు. కానీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇప్పటి వరకూ టైటిల్ వరుసగా ఎప్పుడు కాపాడుకోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో?


Read More
Next Story