ఇండియన్ క్రికెట్ లో గంభీర్ శకం.. జట్టు కూర్పు ఎలా ఉంటుందో?
x

ఇండియన్ క్రికెట్ లో గంభీర్ శకం.. జట్టు కూర్పు ఎలా ఉంటుందో?

కొత్త కోచ్, కెప్టెన్ కలయికలో భారత్, శ్రీలంకతో నేటీ నుంచి టీ20 ల్లో తలపడబోతోంది. ఇప్పటి వరకూ జట్టుతో ఉన్న సీనియర్ ఆటగాళ్లు ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావడంతో..


(ఆర్. కౌశిక్)

భారత క్రికెట్ లో కొత్త శకం మొదలైంది. కొత్త ఆటగాళ్లు, కొత్త కెప్టెన్, కొత్త కోచ్ తో శ్రీలంక పర్యటనకు వెళ్లింది. 2007 లో రోహిత్ శర్మ, టీ20 అరంగ్రేటం చేశాడు. కొద్ది కాలం తరువాత విరాట్ కోహ్లి అతని జత కూడాడు. ఈ ఇద్దరు మొనగాళ్ల రిటైర్ మెంట్ తో వీరి స్థానాలను భర్తీ చేసే కొత్త ఆటగాళ్లు ఎవరా అని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

వీరితో పాటు ఇన్నాళ్లు స్పిన్ ఆల్ రౌండర్ గా ఉన్న రవీంద్ర జడేజా కూడా టీ20 లకు రిటైర్ మెంట్ ప్రకటించాడు. భారత్ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవగానే ఈ సీనియర్ ఆటగాళ్లందరూ తమ ఆటకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ అనే ట్యాగ్ ను ఈ యువ ఆటగాళ్లు ఎలా కాపాడుకుంటారో చూడాలి.

పరివర్తన దశ
T20 కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ నియమితులయ్యాడు. గౌతమ్ గంభీర్ మూడున్నరేళ్ల పదవీకాలానికి ప్రధాన కోచ్‌గా పగ్గాలు అందుకున్నాడు. 2027 వరకూ పదవీలో గంభీర్ కొనసాగుతాడు. 2026 లో భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ జరగబోతోంది. ఈ టైటిల్ కాపాడుకోవాలని భారత్ ఇప్పటి నుంచే కూర్పు మొదలు పెట్టింది.
శ్రీలంక పర్యటనలో భారత్ వైట్ బాల్ క్రికెట్ లో మూడు టీ20 లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందులో ప్రయోగాలు ఉంటాయని చెప్పవచ్చు. రాబోయే ఫలితాలతో సంబంధం లేకుండా ఇవి కొనసాగుతాయని చెప్పవచ్చు.
సూర్యకుమార్ లేదా గంభీర్‌లు.. రోహిత్, ద్రవిడ్‌లకు స్పష్టమైన వారసులు కాదు. కానీ ఇప్పుడు వారు ఈ స్థానాల్లో ఉన్నారని మాత్రమే చెప్పవచ్చు. వారి సామర్థ్యాలను బయటపెట్టడానికి కొంత సమయం అవసరం.
సూర్యకుమార్ పరిణితి..
2014-15 సీజన్‌లో ముంబయికి నాయకత్వం వహించిన సూర్యకుమార్ కెప్టెన్సీకి కొత్తేమీ కాదు. తరువాత తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లో ఓటమితో తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. డ్రెస్సింగ్ రూమ్, మైదానంలో దుర్భాషలు ఆడటం, శార్ధూల్ ఠాకూర్ తో వాగ్వాదం అతని కెప్టెన్సీపై తీవ్ర మచ్చగా పడింది.
"ఇది జరిగి ఇప్పుడు ఒక దశాబ్దం అయ్యింది, నేను ఒక వ్యక్తిగా మారిపోయాను, నేను పరిపక్వం చెందాను," అని అతను శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరించాడు. ఇప్పుడు మ్యాన్ మేనేజ్ మెంట్ లో అతను చాలా పరిణతి కనపరిచాడు. అలాగే డ్రెస్సింగ్ రూమ్ లో చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడనే పేరు పొందాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొన్నటి వరకూ అగ్రస్థానంలో కొనసాగాడు. ఫామ్ తో సంబంధం లేకుండా అత్యుత్తమ బ్యాట్స్ మెన్.
పాండ్యా తన ఆటతీరుపై దృష్టి
టీ20 లో రోహిత్ తరువాత పాండ్యా కెప్టెన్ గా ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ప్రస్తుతం అతను కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగబోతున్నాడు. పైగా జట్టులో పేస్ ఆల్ రౌండర్. అతను జట్టులో ఉంటే సమతూకం ఉంటుంది. అయితే తరుచుగా గాయాలపాలవడం, జట్టుతో ఎక్కువ కాలం కొనసాగకపోవడం అతని కెప్టెన్ పదవికి ఎసరు తెచ్చిందని చెప్పవచ్చు.
శనివారం - మంగళవారం మధ్య మూడు T20 లు జరగనున్న పల్లెకెలెలో ప్రాక్టీస్ సెషన్‌ల సమయంలో హర్ధిక్ చాలా సరదాగా కనిపించాడు. నాయకత్వ లక్షాణాలకు ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన తన ఆటతీరులో మార్పు ఉండదని పరోక్షంగా ప్రకటించినట్లు అయింది.
గిల్-జైస్వాల్ ఓపెనింగ్ కి అవకాశం..
సూర్యకుమార్ గతంలో ఏడు T20 లలో జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో 5 మ్యాచుల్లో భారత్ గెలిచింది. రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. ఇప్పుడు కెప్టెన్ గా పూర్తి స్థాయి బాధ్యతులు చేపట్టిన నేపథ్యంలో తన రికార్డును మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తాడనంలో సందేహం లేదు. ఇప్పుడు గంభీర్ కు ఉన్న ప్రధాన సమస్యల్లో ప్రధానమైంది. రోహిత్- కోహ్లి లాంటి ఒపెనర్లను జట్టులో తయారు చేయడం. అయితే ఇప్పుడు మేనేజ్ మెంట్ యువ ఓపెనర్లు అయిన జైశ్వాల్- గిల్ ను కొత్తగా పరీక్షించబోతోంది.
గిల్ ఇప్పుడు టీ20, వన్డేల్లో వైస్ కెప్టెన్. గిల్ బ్యాటింగ్ నైపుణ్యాలు మూడు ఫార్మాట్లకు సరిపోతుందని సెలెక్టర్లు నమ్ముతున్నారు. దీర్ఘకాలంలో అని రకాల ఫార్మాట్లకు నాయకుడిగా ఎదిగే లక్షణం అతనికి ఉందని, అలాగే సీనియర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాడని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు.
ఈ నెల ప్రారంభంలో జింబాబ్వేలో జరిగిన T20 సిరీస్‌లో భారత్‌ను 4-1 తేడాతో గెలిపించడం ద్వారా అతను T20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన నిరాశను పక్కన పెట్టాడు. అతను బాగా రాణిస్తే రాబోయే చాలా సంవత్సరాలు ఓపెనర్ స్లాట్ అతనిదే కావచ్చు అనే వాస్తవాన్ని అతను గ్రహిస్తాడు. అతనికి కేవలం 24 ఏళ్లు, మూడు వేరియంట్‌లలో అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. భారత బ్యాటింగ్ వర్తమానం, భవిష్యత్తు రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎడమచేతి వాటం ఆటగాడు జైస్వాల్‌కు ఇప్పటికే టీ20లో సెంచరీ బాదాడు. ఇద్దరు యువ గన్‌లు - గిల్‌కి 24, జైస్వాల్‌కి 22 - జింబాబ్వేలో అద్భుతమైన కెమిస్ట్రీని ప్రదర్శించారు. అక్కడ వారు 156 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. వారు ఇప్పుడు రోహిత్- కోహ్లి కాకపోవచ్చు. కానీ భవిష్యత్ లో వారి సామర్థ్యాన్ని వీరు అందుకొనే అవకాశం మాత్రం కనిపిస్తోంది.
మిడిల్ ఆర్డర్‌లో సమస్య
రింకు సింగ్, పాండ్యా, రిషబ్ పంత్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లతో మిడిల్ ఆర్డర్ ఎవరు ఎలా ఆడతారనే విషయంలో సందిగ్ధం ఉంది. చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉండటం ఇక్కడో చిక్కు సమస్య. వచ్చే ఫిబ్రవరిలో 50 ఓవర్ల ఫార్మాట్ లో ఛాంపియన్స్ ట్రోఫి ఉంది. ఈ లోగా భారత్ కేవలం ఆరు వన్డే మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. ఈ లోగా జట్టు కూర్పును ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్డే జట్టుపై పెద్దగా శ్రద్ధ పెట్టాల్సిన పనిలేదు కానీ.. టీ20 జట్టును ప్రస్తుతం ఫైనల్ ఎలెవన్ ను జాగ్రత్తగా కూర్చాల్సి ఉంటుంది.
శ్రీలంకకు పెను సవాలు..
2018 ప్రపంచ కప్‌లో అండర్-19 జట్టుకు నాయకత్వం వహించిన మృదుస్వభావి ఎడమచేతి వాటం ఆటగాడు చరిత్ అసలంక.. శ్రీలంక కూడా కొత్త T20 కెప్టెన్‌. ప్రపంచ కప్ తర్వాత కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్ పదవీకాలం ముగియడంతో, శ్రీలంక క్రికెట్‌కు చీఫ్ కన్సల్టెంట్ సనత్ జయసూర్య తాత్కాలిక హోదాలో ఆ స్థానాన్ని తీసుకున్నారు. అయితే రోహిత్, కోహ్లి, జడేజాల రిటైర్ మెంట్.. విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ లేకుండా కూడా, భారతదేశం బలీయమైనదని అంగీకరిస్తారు.


Read More
Next Story