80 కోట్ల మంది చూస్తున్న క్రికెట్ ఫైనల్స్
x

80 కోట్ల మంది చూస్తున్న క్రికెట్ ఫైనల్స్

భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ మ్యాచ్ ఫైనల్ ని రాత్రి 9.30 గంటల సమయానికి సుమారు 80 కోట్ల మంది చూస్తున్నారు. మూడు ఖండాల జనాభాకి ఇది సమానం


భారత్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా మార్చి 9వతేదీ రాత్రి 9.15 గంటల సమయానికి 42.2 ఓవర్లకి 5 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. క్రీజ్ లో హార్దిక్ పటేల్,రాహుల్ ఆడుతున్నారు. చేతిలో ఇంకా 5 వికెట్లు, 7 ఓవర్లు ఉన్నాయి. ఇంకా 46 పరుగులు చేయాల్సి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు అత్యధికంగా అనుసరించే రెండవ ఆట క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో 104 సభ్య దేశాలు , ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది ప్రొఫెషనల్ క్రికెటర్లు మరియు 3 కోట్ల మంది నమోదిత ఆటగాళ్ళు ఉన్నారు.
భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ ని సుమారు 80 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. లక్షలాది మంది యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు ఈ ఆటను చూస్తున్నారు.
క్రికెట్ వ్యూయర్‌షిప్ గణాంకాలు విస్మయం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ జనాభాలో అత్యధికులు క్రికెట్ చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 16 నుండి 69 సంవత్సరాల వయస్సున్నవాళ్లు వీక్షకుల్లో ఎక్కువగా ఉన్నారు. ఓ అంచనా ప్రకారం సుమారు వంద కోట్ల మంది వివిధ మాధ్యమాల ద్వారా క్రికెట్ ను ఆస్వాదిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అభిమానులు 34 ఏళ్ల వారు, వీరిలో 61% మంది పురుషులు, 39% మంది మహిళలు.
మొత్తం మీద క్రికెట్ ఓ పెద్ద వినోద సోర్సుగా ఉంది.
న్యూజిలాండ్ ను కట్టడి చేసిన తీరు ఇలా...
ఛాంఫియన్స్ ట్రోపీలో ఇప్పటివరకు ఆడిన అన్నింటిలో భారత్ గెలుస్తూ వచ్చింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో ఈజీగా గెలుస్తామనే నమ్మకాన్ని క్రికెట్ అభిమానులు వ్యక్తం చేస్తున్నప్పటకీ న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ లైనఫ్ చూస్తే ఫైనల్స్‌లో గెలుపు అవత ఈజీ కాదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కేన్ విలియమ్‌సన్, రచిన్ రవీంద్ర సెంచరీలతో అదరగొట్టారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఇద్దరు సెంచరీలు చేశారు. ప్రస్తుత ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర అవుట్ కావడం భారత్‌కు ప్లస్‌గా చెప్పుకోవచ్చు. విలియమ్‌సన్‌ పెవిలియన్‌కు చేరడంతో న్యూజిలాండ్‌ను 251 పరుగులకు కట్టడి చేశారు.
కుల్దీప్ అదుర్స్...
భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అదరగొట్టారు. తాను వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికే డేంజరస్ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్రను అవుట్ చేసిన కుల్దీప్, తాను వేసిన రెండో ఓవర్ రెండో బంతికి మరో డేంజరస్ బ్యాట్స్‌మెన విలియమ్‌సన్ పెవిలియన్ చేరడంతో భారత అభిమానులు పండుగ చేసుున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్‌సన్ అవుట్ కావడంతో భారత్ కొంత ఊపిరిపీల్చకున్నట్లైంది.


Read More
Next Story