Ind vs Aus : దుబాయ్ చాంపియన్స్ ట్రోఫీ హైలైట్స్
x

Ind vs Aus : దుబాయ్ చాంపియన్స్ ట్రోఫీ హైలైట్స్

ఆ స్ట్రేలియా పై భారత్ సునాయాస విజయం


2015 ఐసిసి ప్రపంచ కప్ సెమీఫైనల్ లో, 2023 ఐసిసి ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తో ఓడిపోయిన భారత జట్టు, నిన్న(4.3.25) జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ(2025) మొదటి సెమి ఫైనల్లో కంగారులను కంగారు పెట్టి.. ఫైనల్ లోకి అడుగు పెట్టింది. మ్యాచ్ సాంతం ఆస్ట్రేలియా జట్టుపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, భారత జట్టు ఆస్ట్రేలియా విజయ పరంపరకి అడ్డుకట్ట వేసింది.

ఆస్ట్రేలియా బ్యాటింగ్:

264 పరుగులు/10 వికెట్లు (49.3 ఓవర్లు)

ట్రావిస్ హెడ్ 39 పరుగులు (33 బంతులు)

స్టీవ్ స్మిత్ 73 పరుగులు (96 బంతులు)

లబుస్చగ్నె 29 పరుగులు (36 బంతులు)

అలెక్స్ కారి 61 పరుగులు (57 బంతులు)

భారత్ బౌలింగ్:

వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు (10 ఓవర్లు)

అక్షర్ పటేల్ 1 వికెట్ (8 ఓవర్లు)

రవీంద్ర జడేజా 2 వికెట్ (8 ఓవర్లు)

షమ్మి 3 వికెట్లు(10 ఓవర్లు)

హార్దిక్ పాండ్యా 1 వికెట్ (5.3 ఓవర్లు)

భారత్ బ్యాటింగ్ :

267 పరుగులు/6 వికెట్లు (48.1 ఓవర్లు)

రోహిత్ 28 పరుగులు (29 బంతులు)

అయ్యర్ 45 పరుగులు (62బంతులు)

కోహ్లీ 84 పరుగులు (98 బంతులు)

హార్దిక్ పాండ్యా 28 పరుగులు (2445 బంతులు)

రాహుల్ 42 పరుగులు (34 బంతులు)

ఆస్ట్రేలియా బౌలింగ్ :

బెన్ ద్వరషోస్ 1 వికెట్ (7 ఓవర్లు)

నాథన్ యెల్లిస్ 2 వికెట్లు (9.6 ఓవర్లు)

అడం జంప 2 వికెట్లు (10 ఓవర్లు)

కొనొల్లి 1 వికెట్ (8 ఓవర్లు)


సాధారణ ఆస్ట్రేలియా బ్యాటింగ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు నాలుగు పరుగులకే మొదటి వికెట్ కనోలి రూపంలో కోల్పోయింది. చాలా రోజుల తర్వాత ఆడుతున్న భారత పేస్ బౌలర్ షమీ ఆ వికెట్ తీసుకున్నాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ స్మిత్, హెడ్ తో కలిసి బాగానే బ్యాటింగ్ చేస్తూ ఉండగా మళ్లీ 54 పరుగులు వద్ద హెడ్ అవుట్ అయ్యాడు. భారత ప్రముఖ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మొదట్లోనే వికెట్ తీసి ఆస్ట్రేలియాను కొంత భయపెట్టాడు. అయితే స్మిత్ లబుస్చగ్నె తో కలిసి స్కోరును కొంత ముందుకు నడిపాడు. లబుస్చగ్నె అవుట్ అయిన తర్వాత వచ్చిన వికెట్ కీపర్ ఇంగ్లిస్ కూడా త్వరగానే అవుట్ అయిపోయాడు. ఈ రెండు వికెట్లు స్పిన్నర్ జడేజా తీసుకున్నాడు. తర్వాత కెప్టెన్ స్మిత్, బ్యాట్స్మెన్ క్యారీ తో కలిసి ఒక మంచి భాగస్వామ్యాన్ని నడిపాడు. అయితే పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉన్నట్టు అనిపించింది. 35 ఓవర్లు ముగిసేటప్పటికీ ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
షమీ బౌలింగ్లో స్మిత్(73) బౌల్డ్ కావడంతో ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది. తర్వాత వచ్చిన మాక్స్వెల్ ఒక బౌండరీ కొట్టి వెంటనే అక్షర పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 205 పరుగులకు ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. . ఇండియా మళ్లీ పుంజుకుని గేమ్ లోకి వచ్చింది. 45 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి 208 పనులు చేసింది
ఈ దశలో బ్యాట్స్మెన్ క్యారీ, ద్వారర్స్ తో కలిసి నిదానంగా ఆడుతూ చిన్నగా స్కోర్ ను ముందుకు తీసుకువెళ్ళాడు . తన 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. స్కోరు కనీసం 280 పరుగులు చేయాలన్న లక్ష్యంతో క్యారీ బ్యాటింగ్ చేశాడు. భారత బౌలింగ్ కొంతవరకు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను అదుపులో ఉంచిందని చెప్పాలి. 45 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 239 పరుగులు చేసింది
46 వ ఓవర్ ప్రారంభంలోనే వరుణ్ చక్రవర్తి మరోసారి భారత్ కు ఒక వికెట్ ను అందించాడు. ద్వరషోస్ ని పెవిలియన్ బాట పట్టించాడు. బ్యాట్స్మెన్ క్యారీ తనదైన శైలిలో ఆడుతూ, స్కోర్ ను నిదానంగానైనా సరే పెంచుతూ వెళ్ళాడు.
ఈ స్థితిలో రెండో పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో బ్యాట్స్మెన్ క్యారీ అవుట్ కావడం భారత్ కు కలిసి వచ్చింది. ఈ దశలో ఒక సిక్స్ కొట్టి ఆస్ట్రేలియా స్కోర్ పెంచిన ఎల్లిస్ ను షమీ అవుట్ చేశాడు. చివరి ఓవర్ లో ఆస్ట్రేలియా ఎన్ని పరుగులు చేస్తుంది అనే దానిమీద అందరి దృష్టి ఉంది. చివరకు 50 ఓవర్లు ముగిసె సరికి ఆస్ట్రేలియా ఎన్ని పరుగులు చేస్తుంది అన్న ఉత్సాహానికి తెరదించాడు హార్దిక్ పాండ్యా. చక్కటి బంతితో జంపాను అవుట్ చేశాడు. ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. ఇక భారత్ 50 ఓవర్లలో 265 పరుగులు చేయాలి
మరోసారి సత్తా చూపిన కోహ్లీ
265 పరుగుల లక్ష్యాన్ని సాధించడానికి మైదానంలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు త్వరగానే కోల్పోయింది. గిల్ ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ యిపోయాడు.వరుసగా మూడు మ్యాచ్ లలో ఫెయిల్ అయ్యాడు. రోహిత్ శర్మ కూడా త్వరగానే పెవెలియన్ చేరాడు. అయితే మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు కలిసి భారత్ స్కోర్ ను బాగానే ముందుకు తీసుకెళ్లారు. 91 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తర్వాత జంప వేసిన ఒక అద్భుతమైన బంతికి శ్రేయాస్(45) అవుట్ అయ్యాడు.
మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ భారత జట్టు స్కోరు ఆస్ట్రేలియా జట్టు స్కోర్ కన్నా మెరుగ్గా ఉంది. అక్షర పటేల్ కోహ్లీ ఇద్దరు కొంచెం జాగ్రత్తగా, సమన్వయంతో ఆడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి.కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు కాబట్టి భారత జట్టుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. 30 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 150 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి, గెలిచే అవకాశాలను మెరుగుపరుచుకుంది.
అర్థ శతకం సాధించిన విరాట్ కోహ్లీ, భారత్ ను గెలిపించే సత్తా ఉన్న ఆటగాడు. మైదానంలో కోహ్లీ ఉన్నంతవరకు భారత్ గెలిచే అవకాశాలు ఉన్నట్లే. అక్షర పటేల్ తో కలిసి కోహ్లీ స్కోరును అభివృద్ధి చేసుకుంటూ పోయాడు. అక్షర పటేల్ ఒక సిక్స్ కూడా కొట్టి తన బ్యాటింగ్ ప్రతిభను తెలియపరిచాడు. ఇద్దరి భాగస్వామ్యంలో నిదానంగానే అయినా స్కోరు ముందు కదిలింది.
33 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 173 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. అదే భారత జట్టు 168 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఇదిలా ఉండగా 35 ఓవర్ లో ఎల్లీస్ బౌలింగ్లో అక్షర పటేల్(27) క్లీన్ బోల్డ్ కావడంతో భారత్ కొంచెం ఇబ్బందిలో పడింది. కోహ్లీ ఇంకా ఆడుతూ ఉండడం వల్ల భారత జట్టు ఆశలు సజీవంగా ఉన్నాయి. 35 ఓవర్ల తర్వాత భారత్ సాధించాల్సిన పరుగులు, బంతులు,రెండు దాదాపు సమానంగా ఉన్నాయి. 37 ఓవర్ల తర్వాత భారత్ 78 బంతుల్లో 78 పరుగులు సాధించాలి. 225 పరుగుల వద్ద కోహ్లీ (84) అవుట్ కావడంతో భారత జట్టుకి కొంచెం ఇబ్బంది వచ్చింది.కోహ్లీ స్థానంలో వచ్చిన పాండ్యా కూడా సమర్థవంతుడైన బ్యాట్స్మెన్ కాబట్టి భారత జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చివర్లో కొంత ఉత్కంఠ
చివరి ఆరు ఓవర్లలో 36 పరుగులు చేయవలసిన స్థితి కి భారత్ చేరుకుంది. ఆస్ట్రేలియా ఒక వికెట్ కోసం విశ్వప్రయత్నం చేసింది. అయినా లాభం లేకపోయింది. 45వ ఓవర్ లో పాండ్యా కొట్టిన సిక్స్ ప్రేక్షకుల్లో, భారత జట్టులో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఓవర్లలో ఎనిమిది పరుగులు వచ్చాయి. భారత్ 30 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఇప్పుడు భారత జట్టు ఒకటి రెండు వికెట్లు కోల్పోతే తప్ప, భారత్ ఓడిపోయే అవకాశాలు లేవు. అంతలో రాహుల్ 33వ ఓవర్ లో ఒక పరుగు చేసి వన్డేల్లో 3000 పరుగులు సాధించిన ఆటగాడు అయ్యాడు.
చేతిలో ఐదు వికెట్లు, ఇద్దరు గుర్తింపు పొందిన బ్యాట్స్మెన్లు, ఒక బంతికి ఒక పరుగు చేయవలసిన పరిస్థితిలో భారత్ ఉండడం వల్ల, ఓడిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నాలుగు ఓవర్లలో 27 పరుగులు చేయాల్సిన స్థితికి భారత్ చేరుకుంది. అది పెద్దగా కష్టం కాకపోవచ్చు అనిపించింది. అప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ 47 వ ఓవర్ వేయడానికి పు ప్రముఖ స్పిన్ బౌలర్ జంపాను బరిలో దింపాడు.
ఆస్ట్రేలియా బౌలర్ జంపాను, ఆడుకున్న పాండ్యా
మ్యాచ్ లో కొంత ఉత్కంఠత నెలకొంది. అప్పుడు కొట్టాడు పాండ్యా ఒక అద్భుతమైన సిక్స్. అంతవరకు జంపా బౌలింగ్లో ఎవరు ఆ సాహసం చేయలేదు. 106 మీటర్ల సిక్స్ అది. ఆ వెంటనే మరొక అద్భుతమైన సిక్స్ కొట్టాడు హార్దిక్ పాండ్యా. తాను ఒక హిట్టర్నని నిరూపించుకున్నాడు. మ్యాచ్ ఫలితం ఇక్కడే దాదాపు తేలిపోయింది. ఇక 18 బంతులలో 12 పరుగులు. అప్పుడు హార్దిక్ పాండ్యా మరొక బౌండరీ కొట్టాడు. చివరికి మ్యాచ్ ఒక సిక్స్ కొడితే గెలిచే అవకాశం వచ్చేసింది. అప్పుడు హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టడానికి వెళ్లి మ్యాక్స్వెల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయినా భారత్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
12 బంతుల్లో 4 పరుగులు, చేతిలో నాలుగు వికెట్లు. చివరికి భారత జట్టు 48 వ ఓవర్ మొదటి బంతికి రాహుల్ కొట్టిన సిక్సర్ వల్ల నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలిచి ఫైనల్ కి వెళ్ళింది.




Read More
Next Story