మహిళా క్రికెట్ జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
x
భారత మహిళా క్రికెట్ జట్టు

మహిళా క్రికెట్ జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

రూ. 50 కోట్ల ప్రైజ్ మనీ, ఐసీసీ నుంచి రూ. 40 కోట్ల రివార్డ్


మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచినందుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. క్రికెటర్లు, వారి సహాయక సిబ్బందికి రూ. 50 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని పేర్కొంది. వీటికి తోడు ఐసీసీ నుంచి దాదాపు 40 కోట్ల రూపాయాలు అందనున్నాయి.

హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్ లో దక్షిణాఫ్రికా ను 52 పరుగుల తేడాతో ఓడించి, తమ తొలి వన్డే మహిళల ప్రపంచకప్ ట్రోఫిని గెలుచుకుంది. భారత్ 47 ఏళ్లుగా ట్రోఫి కోసం ప్రయత్నిస్తోంది. ఇంతకుముందు రెండుసార్లు భారత జట్టు ఫైనల్ చేరిన తుది మెట్టుపై బోల్తా పడింది.

విజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రికార్డు ప్రైజ్ మనీని ప్రకటించింది. విజేతకు రూ. 39.78 కోట్లు(4.48 మిలియన్లు) దక్కాయి. వీటితో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మహిళా క్రికెటర్లకు రూ. 51 కోట్ల రివార్డును ప్రకటించింది.
‘‘ఐసీసీ చైర్మన్ గా ఉన్న జై షాకు కచ్చితంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ టోర్నమెంట్ కు కేవలం నెల ముందు వారు ఐసీసీ మహిళల ప్రపంచకప్ ప్రైజ్ మనీని పెంచారు. అంటే ప్రైజ్ మనీలో దాదాపు 300 శాతం పెంచారు’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
‘‘అది జట్లకు మాత్రమే అందుతుంది. ఈ రోజు డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా ఓడించి ఛాంపియన్ షిప్ గెలుచుకోవడంతో బీసీసీఐ సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఐసీసీ తో సంబంధం లేకుండా బీసీసీఐ స్వయంగా భారత జట్టుకు రూ. 51 కోట్ల బహుమతిని ప్రకటించింది. ఆ మొత్తం ఆటగాళ్లకు సెలెక్టర్లకు, అమోల్ ముజుందార్ నేతృత్వంలోని సహాయక సిబ్బందికి వెళ్తుంది’’ అని ఆయన అన్నారు.


Read More
Next Story