
ఛాంపియన్ ట్రోఫీ-2025 ఫైనల్స్.. విన్నర్‌పై ఏఐ ప్రెడిక్షన్ ఇదే..!
ఏఐ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఒక జట్టు విజయాన్నే సూచిస్తున్నాయి. మరి ఆ జట్టు ఏం చేస్తుందో ఫైనల్‌లో చూడాలి.
ఛాంపియన్ ట్రోఫీ-2025 సిరీస్ అంతా కూడా బ్రెత్ టేకింగ్‌గా సాగింది. భారీభారీ స్కోర్లు, వాటిని ఛేదించడానికి ప్రత్యర్థి జట్లు పర్వఫుల్ పర్ఫార్మెన్స్‌తో సిరీస్ అంతూ ఇంట్రస్టింగ్‌గా సాగింది. ఇందులో టీమిండియా మొదటి నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడింది. టీమిండియా ప్లేయర్స్ అంతా ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారారు. ప్రత్యర్థులు అందించిన లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా.. ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్ చేర్చడంలో కూడా టీమిండియా ప్లేయర్స్ అద్భుతంగారాణించారు. ఇప్పుడు ఈ సిరీస్ ఫైనల్స్‌కు వచ్చేసింది. మరికాసేపట్లో న్యూజిల్యాండ్, భారత్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్‌తో తలపడనున్నాయి. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. అభిమానులు కూడా రెండు భారీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగుతుందో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు అన్న అంశంపై ఏఐ తనదైన ప్రెడిక్షన్ చేసి వార్తల్లో నిలుస్తోంది. వందకు వందశాతం గెలిచేది ఫలానా జట్టే అని కృత్రిమ మేధా గట్టిగా చెప్తుంది.
ఫ్యాన్స్ ప్రెడిక్షన్ ఇదే..
టీమిండియా ఫ్యాన్స్ అంతా కూడా టీమిండియాను మూడోసారి ట్రోఫీను సొతం చేసుకోవడం పక్కా అని అంటున్నారు. న్యూజిల్యాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని తన్నుకెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ గంఠాపథంగా చెప్తున్నారు. అలాగని న్యూజిల్యాండ్ ఏమీ తక్కువ కాదు. ఇప్పటి వరకు రెండు ఐసీసీ సిరీస్‌లను గెలిచింది కివీస్ జట్టు. భారత్ కూడా ఇప్పటివరకు రెండు కప్‌లు కొట్టింది. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఎవరు తమ మూడో కప్‌ను సాధిస్తారా అనేది కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ.. ఈ మ్యాచ్‌పై ఇంట్రస్టింగ్ ప్రెడిక్షన్ చేసింది. ఒక్కటని కాదు చాట్‌జీపీటీ, జెమిని, క్రూక్ వంటి అన్ని ఫ్లాట్‌ఫామ్‌లు ఈ మ్యాచ్‌పై ప్రెడిక్షన్ చేశాయి.
జెమినీ:
గూగుల్‌కు చెందిన ఏఐ ఫ్లాట్ ఫామ్ జెమిని ప్రకారం.. ఈ ఫైనల్స్‌లో భారత్ గెలవడానికే అధిక అవకాశాలు ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్, ఇటీవల జరిగిన ఐసీసీ టోర్నీల్లో భారత్ పర్ఫార్మెన్స్‌ల ఆధారంగా ఈ ప్రెడిక్షన్ చేసినట్లు జెమినీ చెప్పింది. అదే విధంగా ఫైనల్‌లో కథ అడ్డం తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది.
చాట్‌జీపీటీ
చాట్‌జీపీటీ కూడా భారత్‌కే ఓటేసింది. భారత్‌కే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పింది. ఈ టోర్నీలోనే ఇప్పటి వరకు భారత్ ఓటమిని ఎరుగకుండా ఫైనల్స్‌కు చేరుకుందని తెలిపింది. లీగ్ స్థాయి మ్యాచ్‌లో ఇప్పటికే న్యూజిల్యాండ్, భారత్ తలపడగా అందులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించింది. కాబట్టి మరోసారి న్యూజిల్యాండ్‌ను ఓడించడంలో భారత్ సక్సెస్ అవుతుందని అంటోంది. దుబాయ్‌లో మ్యాచ్ జరగనున్నస్టేడియం పిచ్.. స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, టీమిండియాలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారని, కాబట్టి వారికి పిచ్ బాగా అనుకూలంగా ఉండి బౌలింగ్‌లో భారత్ దుమ్ముదులిపేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని చాట్‌జీపీటీ చెప్తోంది. కాగా కివీస్ బౌలర్లు తక్కువ కాదని, కాబట్టి ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అంచనా వేసింది.
క్రూక్: ప్రపంచకుబేరుడు ఎలాన్‌మస్క్‌కు చెందిన ఏఐ ఫ్లాట్ ఫామ్ క్రూక్. ఇది కూడా భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్‌పై ప్రెడిక్షన్ చేసింది. దీని ప్రకారం కూడా.. ఈ మ్చాచ్‌లో టీమిండియానే ఆధిపత్యం చెలయిస్తుంది. సెమీఫైనల్లో భారత్.. బలంగా ఉన్న ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ అన్నీ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఫైనల్స్‌లో భారత్‌కే గెలిచేూ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రూక్ అంచనా వేస్తోంది. ఇదే సందర్భంగా ఏఐ అనేది భవిష్యత్తును అంచనా వేయలేదని, కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగొచ్చని, తన ప్రెడిక్షన్ తప్పు కూడా కావొచ్చని క్రూక్ తెలిపింది.