
CRICKET : రాత్రి మన మ్యాచ్ ను ఎన్ని కోట్ల మంది చూశారంటే..
దేశ జనాభా 130 కోట్ల మంది. వీళ్లలో సగం మంది క్రికెట్ చూశారా.. అంటే పిల్లాజెల్లా అందరూ కట్టగట్టుకుని చూసినట్టేనా..
దేశ జనాభా 130 కోట్ల మంది. ఇందులో దాదాపు సగం మంది క్రికెట్ చూశారా.. ఇది నిజమేననేగా మీ అనుమానం.. మనం క్రికెట్ మ్యాచ్ ను చూసేది నిజమే అయితే జియోహాట్ స్టార్ చూపించిన ఈ ఫిగర్ నూ నమ్మాల్సిందే. మ్యాచ్ ను ఎంతమంది చూస్తున్నారో ఆ పైన ఇస్తుంటారు. ఆ లెక్క చూస్తుంటే మనకు దిమ్మతిరుగుతుంది గాని నిజమేననిపిస్తోంది. ఆ లెక్క వాళ్లు ఎలా చూస్తారనేది తెలియాల్సి ఉంది. దీని వెనుక ఏదైనా మార్కెటింగ్ మతలబు ఉందో లేదో ఎనలటిక్స్ వాళ్లు చెప్పాలి.
అవన్ని ఎలా ఉన్నా మనవాళ్లు క్రికెట్ చూడడం ఎక్కువే. అందునా ఇండియా, పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు ఆ ఉత్కంఠ వేరు. కానీ టీ 20 సెమీఫైనల్ లో ఇండియా ఇంగ్లండ్ మాచ్ ను కూడా అంతకుమించి చూడడం విశేషం. 58.7 కోట్ల మంది ఈ సెమీఫైనల్ మ్యాచ్ ను చూశారు.
వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ కేవలం ఒక క్రికెట్ మ్యాచ్‌లా కాకుండా దేశవ్యాప్తంగా ఒక ఉత్సవంలా సాగింది. ఈ మ్యాచ్‌ను ఏకంగా 58.7 కోట్ల మంది డిజిటల్ ప్లాట్‌ఫామ్ (JioStar) ద్వారా వీక్షించడం ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది క్రికెట్ చరిత్రలోనే సరికొత్త ప్రపంచ రికార్డు!
డిజిటల్ సునామీ.. జియోస్టార్ మ్యాజిక్... గతంలో ఏ క్రికెట్ మ్యాచ్‌కూ లేని విధంగా ఈ సెమీఫైనల్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూవర్‌షిప్ నమోదైంది. జియోస్టార్ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పుడు ఆ వ్యూవర్‌షిప్ కౌంటర్ కోట్లలో పెరగడం భారతీయుల్లో ఉన్న క్రికెట్ మక్కువను చాటిచెప్పింది.
ఐసీసీ చైర్మన్ జై షా కూడా ఈ ఘనతపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇది భారత క్రికెట్ మార్కెట్ సత్తా అని కొనియాడారు.7 పరుగుల తేడాతో ‘విజయదుందుభి’నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్‌ను ఇంటికి పంపింది.
భారత్ స్కోరు: 253/7 (సంజు శామ్సన్ 89 పరుగులతో వీరవిహారం)
ఇంగ్లాండ్ స్కోరు: 246/7 (జాకబ్ బెతెల్ 105 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది)
మలుపు తిప్పిన క్షణాలుబుమ్రా యార్కర్లు
మ్యాచ్ గెలుపుపై సందేహం ఉన్న వేళ 16వ ఓవర్లో బుమ్రా వేసిన స్పెల్ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది.
బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ పట్టిన ‘సూపర్ క్యాచ్’ ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లింది.
సెంచరీతో ప్రమాదకరంగా మారిన బెతెల్‌ను ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా తన ఫీల్డింగ్‌తో రన్ అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
పాకిస్తాన్ కంటే ఎక్కువ...
భారత్ vs ఇంగ్లాండ్ (2026 సెమీస్)
JioStar58.7 కోట్లు
భారత్ vs పాకిస్థాన్ (గత రికార్డు)
JioHotstar50.7 కోట్లు
"సినిమా కంటే క్రికెట్టే మా ఊపిరి" అని భారతీయులు మరోసారి నిరూపించారు. అటు మైదానంలో టీమ్ ఇండియా, ఇటు స్క్రీన్‌ల ముందు 58.7 కోట్ల మంది అభిమానులు కలిసి ఇంగ్లాండ్‌ను మట్టికరిపించారు. ఇక ఇప్పుడు అందరి చూపు ఆదివారం జరగబోయే ఫైనల్ (భారత్ vs న్యూజిలాండ్) పైనే ఉంది!
Next Story

