లామా వారసత్వం, హసీనా అప్పగింత న్యూఢిల్లీకి సమస్యలు తెస్తుందా?
x
షేక్ హసీనా, దలైలామా

లామా వారసత్వం, హసీనా అప్పగింత న్యూఢిల్లీకి సమస్యలు తెస్తుందా?

లామా ఎంపికపై చైనా అసంతృప్తి, ఢాకాతోనూ భవిష్యత్ లోనూ ఘర్షణలు?


భారత గడ్డపై చాలాకాలంగా దలైలామా ప్రవాస జీవితం గడుపుతున్నారు. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ కు చెందిన హసీనా గత ఏడాది దేశంలో చెలరేగిన అల్లర్ల తరువాత పదవీచ్యుతీరాలై ఢిల్లీలో ఆశ్రయం పొందుతోంది.

దలైలామా కొత్త వారసుడిని ఎన్నుకోనున్నట్లు వార్తలు రావడం, ఇటు బంగ్లాదేశ్ లో వచ్చే ఏడాది నుంచి సార్వత్రిక ఎన్నికలు జరగుతాయని ప్రకటన రావడంతో చైనా, బంగ్లా నుంచి భారత్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయల్, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు జరుగుతున్న కాలంలో ఈ దేశాలతో సమతుల్యమైన సంబంధాలు కొనసాగించడం భారత దౌత్యానికి అతిపెద్ద సవాల్.
కానీ ఇప్పుడు భారత గడ్డపై ఒకరు కాదు ఇద్దరు ప్రాంతీయ నేతలు ఉన్నారు. వారిలో టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా, బహిష్కరించబడిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా. వీరికి ఆశ్రయంతో ఇవ్వడంతో రెండు వైపుల నుంచి అనేక దౌత్యపరమైన సవాళ్లు భారత్ ఏకకాలంలో ఎదుర్కొంటోంది.
చైనాకు కలవరం..
దలైలామా వారసత్వంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిపై చైనా అసంతృప్తిగా ఉంది. లామా ఎంపిక ప్రక్రియను టిబెటన్ నాయకుడికి, వారి సమాజానికి వదిలివేయడం మంచిందని ఢిల్లీ వాదిస్తోంది.
కేంద్రమంత్రి కిరణ్ రిజుజు అలాంటి వాదన లేవనెత్తడం బీజింగ్ చికాకును రెట్టింపు చేసింది. ఆయన అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన బౌద్ధుడు. దీనిని దక్షిణ టిబెట్ చైనా వాదిస్తోంది. కానీ భారత్ ఈ వాదనలను తోసిపుచ్చుతోంది.
దలైలామా 90 వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పడం బీజింగ్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చైనా అంతర్గత విషయం అని తమ దేశ వ్యవహరాల్లో ఇతరుల జోక్యాన్ని సహిందని అన్నారు.
అయితే దలైలామా మాత్రం తన మరణం తరువాత లామా సంస్కృతి కొనసాగుతుందా లేదా అనేది తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.
దలైలామా లేకపోతే..
లామా సంస్కృతిపై నిర్ణయం తీసుకుంటే వారసత్వ సమస్య ఉండేది కాదు. టిబెటన్ సమాజ నాయకత్వం ఎన్నికైన ధర్మశాలలోని ప్రవాస ప్రభుత్వానికి సిక్యోంగ్(అధ్యక్షుడు) నడిపే కేంద్ర టిబెటన్ పరిపాలనకు అధికారులు బదిలీ అవుతాయి.
నిజానికి దలైలామా ఇప్పటికే టిబెటన్ సమాజానికి సంబంధించిన చాలా విషయాలను సిక్యోంగ్, అతని ప్రభుత్వానికి వదిలివేశారు. కానీ అలాంటి అధికారం దలైలామాకు ఉన్న ఆధ్యాత్మిక ఆకర్షణను అందుకోలేదు. ఇది టిబెట్ లోపల, వెలుపల టిబెటన్ సమాజంపై అతని నిరంతర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచం దృష్టిలో టిబెట్, దాని ప్రత్యేక గుర్తింపును సజీవంగా ఉంచుతుంది.
టిబెటన్ ప్రవాస ప్రభుత్వం చైనాకు ఒక సవాల్ గానే మిగిలిపోతుంది. కానీ దలైలామా సంస్థ ఇక లేకుంటే బీజింగ్ ఆ ప్రవాస ప్రభుత్వాన్ని వేర్పాటువాద ప్రభుత్వంగా ముద్రవేసి, భారత్ పై ఒత్తిడి పెంచి, దాని స్వంత గడ్డపై దానికి ఆశ్రయం, మద్దతును నిరాకరించవచ్చు. భారత్, టిబెట్ ను ఇంతకుముందే చైనాలో అంతర్భాగంగా గుర్తించింది. ఇప్పుడు పొరుగు దేశంతో ఉన్న దైపాక్షిక సంబంధాన్ని పణంగా పెట్టుకుని వాటిని వదులుకోలేదు.
ఇద్దరు దలైలామాలు..?
ఈ సంవత్సరం ప్రారంభంలో దలైలామా ‘వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్’ ను ప్రచురించాడు. దీనిలో తన వారసుడు కచ్చితంగా చైనా వెలుపల జన్మించినవాడై ఉండాలని అందులో దృఢంగా చెప్పారు. దీనికి బీజింగ్ నిస్సందేహంగా చికాకుపడింది.
దలైలామా వారసత్వంలో చైనా ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని నిరాకరించడానికి ఇది తెలివైన కుట్రగా భావించింది. ఇది టిబెట్ లో జరిగితే దానికి చాలా ప్రాధాన్యత లభించేది.
1950 లలో టిబెట్ ను ఆక్రమించినప్పటి నుంచి దలైలామా సంస్థను అణగదొక్కడంలో విఫలమైన చైనా కమ్యూనిస్టు పాలకులు, ప్రస్తుత అధికారంలో ఉన్న దలైలామా చైనా వెలుపల తన వారసుడిని ఏర్పాటు చేస్తే ఇప్పుడు టిబెటన్లపై తమ సొంత దలైలామను రుద్దడానికి ప్రయత్నించవచ్చు.
ఈ కారణంగా చైనా మద్దతుగల దలైలామా, మరొకరు ప్రస్తుత పదవిలో ఉన్న వ్యక్తి నిర్వహించే వారసత్వ ప్రక్రియ ద్వారా సృష్టించబడ్డారు.
బీజింగ్ చర్చలు వద్దు..
ప్రస్తుత దలైలామా ను చైనా ‘‘స్ప్లిటిస్ట్, వేర్పాటువాదీ, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు’’ అని ముద్రవేసింది. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు 1950 చివరలో చైనా చేసిన దాడుల నుంచి తప్పించుని భారత్ ను శరణు వేడారు.
ఆయన టిబెటన్ సాయుధ తిరుగుబాటుకు మద్దతు ఇవ్వలేదు. టిబెట్ భవిష్యత్ కోసం ఆయన బీజింగ్ తో చర్చలు జరపాలని కోరుకుంటున్నాడు.
ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తన పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రారంభంలో దలైలామాతో చర్చల కోసం ప్రయత్నించినప్పటికీ తరువాత వెనక్కితగ్గారు. బహుశా బలమైన వ్యక్తిత్వం ఉన్య మనిషి అనే ఇమేజ్ ను ఆయన పొగొట్టుకోవడానికి ఆయన సిద్దంగా లేకపోవడమే కారణం కావచ్చు. ఇలాంటి ఆయన వ్యతిరేక వర్గానికి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉందని భావించవచ్చు.
టిబెటన్లకు ఎక్కువ స్వయంప్రతిపత్తి, మతపరమైన హక్కులు మంజూరు చేస్తే ఇటువంటి సమస్యను పరిష్కరించవచ్చని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.
వలస రాజ్యాల అనంతరం భారత జాతిలో వచ్చిన వేర్పాటువాదాన్ని పరిష్కరించడానికి ఇటువంటివి ఉపయోగపడ్డాయి. కానీ కమ్యూనిస్ట్ చైనా అదే విధంగా మతోన్మాద, సైనిక ఆధిపత్య పాక్ లో వాటికి మద్దతు ఉన్నట్లు కనిపించడం లేదు.
భారత్ పై ప్రభావాలు..
కొన్ని సంకేతాల ప్రకారం.. టిబెటన్ సమస్య అలాగే ఉండి, భారత్ ను దానిలోకి లాగుతోంది. ఆలస్యంగా భారత్, చైనా మధ్య సరిహద్దు సమస్యపై కొంత పురోగతి ఉంది. కానీ వారసత్వ ప్రక్రియపై దలైలామకు భారత్ కు మద్దతు ఇవ్వడం బీజింగ్ ను చికాకుపెడితే, అది సరిహద్దు సమస్యపై చర్చలను నిలిపివేయవచ్చు. పీఎల్ఏ హిమాలయ సరిహద్దులో తన రెచ్చగొట్టే సలామీ స్లైసింగ్ చొరబాట్లను తిరిగి ప్రారంభించవచ్చు.
బీజింగ్ నిబంధనల ప్రకారం భూటాన్ తన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని చైనా ఒత్తిడి పెంచుతుండటం ద్వారా భారత్ ఇప్పటికే ఆందోళన చెందుతోంది.
ఉత్తరాన ఉన్న రెండు లోయలపై చైనా వాదనలను ఉపసంహరించుకుంటే డోక్లాం పీఠభూమిలో కొంతభాగాన్ని థింపు చైనాకు అప్పగించడం ఇందులో ఉంటుంది.
భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య ప్రాంతాలతో కలిపే సిలిగురి కారిడార్ లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఆధిపత్యం చెలాయించేందుకు డోక్లాం ఉపయోగపడుతుందని చైనా భావించింది.
2017 లో డోక్లాం వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, భారత్ సైన్యం రెండు ముఖాముఖిగా నిలబడ్డాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది రాజ్యాన్ని సందర్శించిన సమయంలో ఇది జరిగింది. అయితే ఢిల్లీ తరువాత థింపుకు తన అభ్యంతరాలను స్పష్టం చేసింది.
సరిహద్దు సమస్యను తిరిగి తెరవడం, పొరుగు ప్రాంతంలో శత్రుత్వ చర్యలు తీసుకోవడంతో పాటు భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాట్లకు చైనా మద్దతును తిరిగి ప్రారంభించడానికి కూడా ప్రయత్నించవచ్చు.
అరుదైన మట్టి లేదా ఔషధ ఉత్పత్తులకు ఉపయోగించే ఏపీఐలు వంటి కీలకమైన పదార్థాలను భారత్ నిరాకరించడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హసీనా ఉండటం, యూనస్ కు చికాకు..
దలైలామా 1959 నుంచి భారత్ లో ఉండగా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గత సంవత్సరం ఆగష్టులో విద్యార్థి యువత తిరుగుబాటులో బహిష్కరించబడినప్పటి నుంచి భారత్ లో ఆశ్రయం పొందారు.
బ్యాంకాంక్ లో జరిగిన బిమ్స్ టెక్ శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు మహ్మద్ యూనస్ భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతూ.. ఆమెను(హసీనా) అదుపులో ఉంచాలని కోరారు. అయితే సోషల్ మీడియా యుగంలో ఇతరుల భావప్రకటన స్వేచ్ఛను తిరస్కరించడం సాధ్యం కాదని మోదీ తోసిపుచ్చారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హసీనాపై లెక్కలేనన్నీకేసులు పెట్టింది. విచారణ కోసం ఆమెను అప్పగించాలని ఇప్పటికే అధికారికంగా అభ్యర్థించింది. ఇప్పుడు దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
వాస్తవానికి అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రిబ్యూనల్ లో దాఖలైన కోర్టు ధిక్కార కేసులో హసీనా ఇప్పటికే దోషిగా నిర్ధారించారు. ఆమెపై ప్రభుత్వం నియమించిన న్యాయవాదీ ఈ కేసులను యుద్ధ నేరాల ట్రిబ్యూనల్ అధికార పరిధికి మించినవిగా సవాల్ చేశారు.
ఎందుకంటే యుద్ధ సమయంలో జరిగిన నేరాలు ఏవీ లేవు. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనాను తిరిగి దేశానికి రప్పించడానికి ఇంటర్ పోల్ ను రంగంలోకి దించితే భారత్ క్లిష్ట పరిస్థితిలో పడుతుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య అప్పగింత ఒప్పందం ఉంది. హసీనా పదవీకాలంలో ఆసక్తికరంగా సంతకం చేశారు.
యూనస్ ఆందోళన..
బంగ్లాదేశ్ లోని తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఆన్ లైన్ యాప్ ల ద్వారా హసీనా వారితో నిరంతరం సంభాషిస్తూనే ఉంది. ఇది తాత్కాలిక ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
యూనస్ పాలనపై ఆమె మాటల దాడుల తీవ్రమయ్యాయి. ఢాకాలో తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి ఆమె పార్టీ మద్దతుదారులను సమీకరించే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆమె యూనస్ ను ఇస్లామిక్ తీవ్రవాదులు, విదేశీయుల సహాయంతో బలవంతం, కుట్ర ద్వారా సురక్షితమైన చట్ట విరుద్ద ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తిగా ముద్రవేసింది.
అమెరికా, చైనా ముఖ్యంగా పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న యూనస్ తన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు హసీనా తన మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారు. ఇది హసీనా ను అప్పగించడానికి ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. ఇది యూనస్ అందోళనకు ప్రధాన కారణంగా మారవచ్చు.
భారత్ మద్దతుగా నిలుస్తుంది
దలైలామ విషయంలో మాదిరిగానే హసీనా విషయంలో కూడా భారత్ మద్దతుగా ఉంది. మాజీ విషయంలో కాకుండా భారత్ రాజకీయ కారణాల వల్ల కాకుండా ఆధ్యాత్మిక కారణాల వల్ల మద్దతు ఇచ్చినప్పుడూ హసీనా విషయంలో ఇది స్పష్టంగా రాజకీయపరమైనది.
ఆమె దివంగత తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్, హసీనా భారత్ విశ్వసనీయ మిత్రులు, వారు అధికారంలో ఉన్నప్పుడూ ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందాయి.
ఈ రెండు సందర్భాల్లోనూ మద్దతు ఉపసంహరణను భారత్ బలహీనతగా అర్థం చేసుకోవచ్చు. బలమైన వ్యక్తి ఇమేజ్ ను ఆశించే ప్రధానమంత్రి నేతృత్వంలో ప్రపంచ వేదికపై పాత్ర పోషించాలనే ఆకాంక్ష ఉన్న ప్రాంతీయ శక్తికి ఇది ఆమోదయోగ్యం కానీ పని. కానీ దీని అర్థం భారత్ పరిణామాలకు సిద్దంగా ఉండాలి.
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. ఇవి ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)
Read More
Next Story