భారతీయ మీడియా క్షేత్రస్థాయిలో వాస్తవాలను ఎందుకు విస్మరించింది ?
x

భారతీయ మీడియా క్షేత్రస్థాయిలో వాస్తవాలను ఎందుకు విస్మరించింది ?

దేశీయ మీడియా వాస్తవాలను ఎందుకు వెలికితీయలేకపోతోంది. దేశంలో ఇప్పటి వరకూ 16 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే గడచిన సార్వత్రిక ఎన్నికల్లో..


భారత్ స్వాత్రంత్యం పొందిన తరువాత 16 సార్వత్రిక ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించింది. తాజా ఎన్నికలు ఫలితాలు అందరూ ఊహించనిది జరిగింది. కానీ రాజకీయ పరాభవాన్ని కూడా మోదీ ప్రణాళికబద్ధమైన పట్టాభిషేకంగా మార్చుకున్నాడు. దీనితో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఎన్డీఏ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆయన పాతముఖాలతోనే, అదే వాక్చాతుర్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ప్రజాస్వామ్యం ప్రధాన స్తంభమైన మీడియా మాత్రం ఎన్నికల ఫలితాలను కింది స్థాయి నుంచి విశ్లేషించి ప్రజలకు చూపడంతో విఫలమైంది. జూన్ నాటి రాజకీయ భూకంపం కారణంగా చాలా కఠినమైన రాజకీయ ప్రశ్నలు అడగాల్సిన మీడియా గమ్మున ఉండిపోయింది. ఇంకా వేచి చూస్తూనే ఉంది.

రియాలిటీ - హైప్

మార్చి మొదటి వారంలోనే మీడియా గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకుని, బీజేపీని దెబ్బ తీసిన అంశాలను కాస్త పట్టించుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఉద్యోగాల కల్పన, ధరలకు సంబంధించి భ్రమలు, మోదీ మాయజాలం క్షీణించడం ఎన్నికలకు సంబంధించిన సాధారణ కారకాలుగా ఉన్నాయి.

బిజెపి బలం జాతీయ స్థాయిలో 303 నుంచి 240కి తగ్గిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు సగం సీట్లను కోల్పోవడానికి ఆ సమయంలో బిజెపి పై ఉన్న ఆన్-గ్రౌండ్ అసంతృప్తి సూచిక. ఏప్రిల్ మధ్యలో జరిగిన మొదటి రౌండ్ పోలింగ్ తర్వాత మోదీ తన హామీలు పనిచేయవని గ్రహించి ఉండకపోతే పార్టీకి ఇంకా తక్కువ సీట్లు వచ్చి ఉండేవి. కానీ క్షేత్రస్థాయిలో వారి పార్టీ కార్యకర్తలు ఇది ముందుగానే ఊహించి అందరిని సమీకరించే ప్రయత్నం చేశారు.

దళిత ఏకీకరణపై మీడియా దృష్టి..

ఎన్నికల సమయంలో బీజేపీ తమకు నాలుగు వందల సీట్ల మార్క్ ను దాటాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రచారం ప్రారంభించింది. దీనిపై ప్రతిపక్ష ఇండి కూటమి ఈ సారి బీజేపీ నాలుగువందల సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లను తొలగిస్తుందని ప్రచారం చేసింది. నష్టాన్ని అంచనా వేసిన బీజేపీ అంబేడ్కర్ వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రకటించినప్పటికీ నష్టం మాత్రం తప్పలేదు. కానీ ఏ మీడియా ఉత్తర ప్రదేశ్ లో దళితుల మానసిక స్థితి అంచనా వేయలేకపోయారు.

మీడియా - ఆంధ్ర పాఠం

2004 ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికలు మనలో ఎంతమందికి గుర్తున్నాయి? ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా అధికారంలో ఉన్నారు. నాయుడు సాంకేతిక పరిజ్ఞానం అంటూ అప్పట్లో చేసిన ప్రచారం మీడియా మిత్రులకు బాగా నచ్చింది.

ఆయన నాయకత్వంలోనే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా పార్టీ ఓటమి పాలైంది. కేవలం 49 సీట్లే గెలుచుకుంది. ఐటీ నినాదాలు చేసిన హైదరాబాద్, సైబరాబాద్ లో కూడా ఆయనకు సీట్లు రాలేదు. దీనిని మీడియా అసలు అంచనా వేయలేదు. ఇది ప్రధాన స్రవంతి మీడియా క్షేత్రస్థాయి పరిస్థితిని పసిగట్టడంతో విఫలమయిందని తెలియజేసింది.

ఏదైన పరిశ్రమలో పనిచేస్తున్న వ్యక్తులు అక్కడి నిజమైన సమాచారాన్ని సేకరించడం ముఖ్యం. కానీ ఆ లక్షణాలు మీడియా విస్మరించడం ప్రారంభించింది.

భారత మీడియా...

ప్రధాన వార్తాపత్రికలన్నింటికీ రాష్ట్ర రాజధానులలో రాష్ట్ర కరస్పాండెంట్‌లు ఉన్న సమయం, వారు రాష్ట్ర రాజకీయాలను బాగా క్షణ్ణంగా అధ్యయనం చేసేవారు. ప్రత్యేక కాలమ్ లో క్షేత్ర స్థాయి విశ్లేషణలను వివరించేవారు. వార్తాపత్రికలన్నీ కూడావిజ్ఞాన సముదాయాలుగా ఉండేవి. 1970 కాలంలో పత్రికలు ఈ విధమైన వాటికి అడ్డాగా ఉండేవి. తరువాత కాలంలో న్యూస్ ఛానెల్స్ దీనిలో చేరాయి. తరువాత ఈ వ్యవస్థ కుప్పకూలింది.

వార్తా నిపుణుల కంటే బయటి వ్యక్తుల ప్రమేయం న్యూస్ లో ఎక్కువైంది. వారి సంబంధం లేని వ్యాఖ్యానాలు, పక్షపాతంతో కూడిన బైలైన్ ల ప్రచారంతో నిండిపోయాయి. అయితే అవన్నీ కూడా చాలాసందర్భాల్లో ఉత్తమమైనవిగా, వాస్తవాలతో నిండిపోయాయనే వివరణలు వినిపించాయి.

పోలింగ్ ఏజెన్సీలు..

ఎన్నికల వాతావరణంలో పోల్ స్టర్లు, ఏజన్సీలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రధాన వనరులుగా మారారు. ఎన్నికల ఫలితాలను అంచనా వేసే సెఫాలజిస్టులకు ప్రాధాన్యం పెరిగింది. ఇది ప్రజల నాడీని అంచనా వేసే వ్యవస్థలుగా చలామణిలోని వచ్చాయి.

దేశంలోని ప్రధాన టీవీ చానెళ్లు వార్తలను భ్రష్టు పట్టించడం గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. వారి సార్వత్రిక ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 400 సీట్లు రావడం గ్యారంటీ. కానీ వాస్తవానికి జరిగిందేమిటీ?

కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు మెరుస్తున్నాయి

మరోవైపు యూట్యూబ్ ఛానెల్‌లు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే మీడియా పాత్రలో ఆసక్తికరమైన పరిణామం. స్థానికంగా ఉండి అక్కడి పరిస్థితులను బాగా అంచనా వేస్తున్నారు. వారి స్వరమే వారికి బలం. నేను దీనిని ధృవీకరించలేకపోయాను కానీ ఉత్తరప్రదేశ్ తీర్పును సరిగ్గా అంచనా వేసిన ఇద్దరు యూట్యూబ్ UP జర్నలిస్టులు ఉన్నారని నేను విన్నాను.

రాజకీయ చతురత వెనుక ఉన్న పద్దతి, తార్కికతను జాతీయంగా తెలియజేయాలని నేను వార్తాపత్రిక సంపాదకులకు సూచించాను. ఈ అభివృద్ధి చెందుతున్న డిజిటల్, ఎలక్ట్రానిక్ స్థలాన్ని పెంపొందించే మీడియా దిగ్గజాలు, ధైర్యవంతులైన, స్వతంత్ర జర్నలిస్ట్ వ్యవస్థాపకులకు కొరత లేదని, వార్తలను ఎవరైనా ప్రజల చూపు నుంచి దాచడానికి ప్రయత్నిస్తున్నారనే మాటను అనుసరించడానికి ప్రయత్నించారు.

దేశంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను బహిర్గతం చేయడంలో అనేకమంది కృషి చేస్తున్నారు. దీని వెనక చిన్న డిజిటల్ సంస్థలు ఉన్నాయి. కానీ విస్తృత రాజకీయాలను వెలికి తీయడానికి వారికి వనరులు, నైపుణ్యం లేదు. నా జ్ఞానం ప్రకారం, అంతర్గత రాజకీయ ఎడిటర్‌ను కలిగి ఉన్న ఒకే ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఉంది. అతను చాలా మంచివాడు. మోదీ-షాలకు సలహాలు అందించే ధైర్యం కూడా ఆయనకు ఉంది.

ప్రశ్నలు ఇంకా మిగిలి ఉన్నాయి

ఐదు నెలలు గడిచినా, జాతీయ మీడియా అడగాల్సిన కఠినమైన రాజకీయ ప్రశ్నలు అడగలేదు. ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఓటమి ఎంత దగ్గరగా ఉందనేది వివరించలేదు. సమాజ్‌వాదీ పార్టీ 39 సీట్లకు ఎగబాకడానికి అమిత్ షా కంటే అఖిలేష్ యాదవ్ అనుసరించిన ఉన్నతమైన సోషల్ ఇంజినీరింగ్ మాత్రమే కారణమా? రాహుల్ గాంధీ-అఖిలేష్ యాదవ్ ర్యాలీలలో కనిపించిన పిచ్చి ఉన్మాదం వెనుక నెగిటివ్ సెంటిమెంట్ మాత్రమే ఉందా?

కాంగ్రెస్‌కు విశ్లేషణ అవసరం..

కాంగ్రెస్‌ను కూడా పదునైన ప్రశ్నలు వేయాలి. ఇండి కూటమి 2023 వేసవిలో ఏర్పడింది. 2024 ఎన్నికలలో వారు కలిసికట్టుగా ఉంటే అది ఓడిపోయేలా గ్రౌండ్ పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసిందా? డిసెంబరులో జరిగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా నిర్ణయించుకున్నందున ఇండి కూటమి ఎంత కోల్పోయిందో వారు అంచనావేశారా? 2024 ఎన్నికలపై పార్టీ ఏదైనా చింతన్ బైఠక్ నిర్వహించిందా?

కర్నాటక, తెలంగాణలలో అధికారంలోకి తెచ్చిన ప్రతికూల ఓట్ల నుంచి కాంగ్రెస్ నేర్చుకోవలసిన రాజకీయ పాఠం ఏదైనా ఉందంటే, ప్రజలు తిరస్కరించిన ప్రభుత్వాలకు చాలా భిన్నంగా పరిపాలించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు ఏడాదికి పైగా అధికారంలో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా విభిన్నంగా, మెరుగ్గా పాలన సాగిస్తున్నాయో అంచనా వేయడానికి జాతీయ మీడియా కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ అవి ఉన్నాయని భావిస్తే..

( ఫెడరల్ స్పెక్ట్రమ్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. కథనాలలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితకు చెందినవి. ఫెడరల్ అభిప్రాయాలను తప్పనిసరిగా ప్రతిబింబించవు.)

Read More
Next Story