చదువులో ఇండియా ఎందుకింత వెనకబడి పోయింది?
x

చదువులో ఇండియా ఎందుకింత వెనకబడి పోయింది?

విద్యా, వైద్య రంగాలు మౌలిక తొలి పెట్టుబడిగా గుర్తించిన దేశాలే అభివృద్ధి చెందుతాయి. సుమారు 1974 నుండి దేశ వ్యాప్తంగా యువతరంలో అసంతృప్తి , ఒకవైపు నిరుద్యోగం మరొకవైపు పలు రంగాల్లో నైపుణ్యాల కొరత పెరుగుతూ వస్తున్నది.


విద్యా, వైద్య రంగాలు మౌలిక తొలి పెట్టుబడిగా గుర్తించిన దేశాలే అభివృద్ధి చెందుతాయి. సుమారు 1974 నుండి దేశ వ్యాప్తంగా యువతరంలో అసంతృప్తి , ఒకవైపు నిరుద్యోగం మరొకవైపు పలు రంగాల్లో నైపుణ్యాల కొరత పెరుగుతూ వస్తున్నది. వీరికి వేదికగా అవినీతికి వ్యతిరేకంగా మొదలైన లోకానాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో సాగిన ఉద్యమం దేశంలో ప్రకంపనలు సృష్టించింది అనే విషయం తెలిసిందే.

ఆ క్రమంలో సోషలిస్టు పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీపై పోటీ చేశారు. ఆమె ఎన్నికను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లారు. ఆమె అక్రమాలకు పాల్పడిందని అలహాబాదు కోర్టు 1975 ఫిబ్రవరిలో ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఆమె రాజీనామా చేయాలని ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. దాంతో 1975 జూన్ 25 న ఎమర్జెన్సీ ప్రకటించి తాను అధికారంలో కొనసాగారు. 1977 మార్చి ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఆయా దేశాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకున్న తీరు మరోవైపు 1970 ల నుండి పెరుగుతున్న విద్యావంతులకు చైనా, జపాన్, రష్యా తదితర దేశాలు నూతన నైపుణ్యాల కోర్సులతో పరిష్కరించుకున్నాయి. ప్రజల అవసరాలను తీర్చేవిధంగా అనేక ఉత్పత్తులు, సేవలు, నూతన రంగాలు, నూతన పారిశ్రామిక రంగాలు విస్తరించాయి. తద్వారా మిగులు కూడా ఏర్పడి ఎగుమతులు పెంచాయి. కాలక్రమంలో చైనా ప్రపంచ దేశాలను అధిగమించి అన్ని దేశాలకు సేవలు, సరుకులు అందించే మార్కెట్గా ఎదిగింది. చైనా నుండి 1 లక్షలాది మంది పౌరులు ఇతర దేశాలకు ఉపాధి నైపుణ్యాలతో సేవలు అందిస్తున్నారు.

అలా 1977 నాటికి ఇండియా కన్నా వెనుకబడిన చైనా నేడు ఇండియా కన్నా నాలుగు రెట్లు ఆదాయంలో, ఉత్పత్తిలో, జీవన ప్రమాణాల్లో ఎదిగింది. ఇండియా నుండి వెళ్లి చూసిన ప్రపంచ పర్యాటకులు ఆ అభివృద్ధిని చూసి మన ఇండియా మరో యాభై యేళ్ళకైనా ఇలా ఎదుగుతుందా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనమెందుకు ఇలా ఎదగలేకపోయాం ?

మానవ వనరులు తక్కువగా ఉన్న యూరప్ , అమెరికా , కెనడా , ఆస్ట్రేలియా వంటి దేశాల ఉత్పత్తి , నైపుణ్యాలు ఆవిష్కరణలు , మార్కెటింగ్ విధానాలు వేరు. అవి గత 300 సంవత్సరాలుగా ఇతర ప్రాంతాల ఆక్రమణ , విస్తరణకనువుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అన్ని సంఘర్షణలకు , ఉద్యమాలకు మూలం అన్ని సంఘర్షణలకు మూలం నిరుద్యోగం , సరియైన ప్రణాళికలు లేకపోవడం. మనదైన స్వంత అభివృద్ధి ప్రణాళికను , ఉత్పత్తి విధానాలను రూపొందించుకోలేక పోవడం !

మానవ వనరులు తక్కువ , ఆక్రమిత ప్రాంతాలు, దేశాలు ఎక్కువ కావడం వల్ల యాంత్రిక ఉత్పత్తి, యంత్రాల వినియోగం ద్వారా భారీ ఉత్పత్తి చేసి ఇతర దేశాలను ఆక్రమించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటిదాకా ఉన్న అభివృద్ధి చెందిన దేశాలు పతనం అంచుకు చేరుకున్నాయి. పునర్నిర్మాణం కోసం తీవ్రంగా కృషి చేశారు.

మళ్లీ పుంజుకున్నారు. అదే సమయంలో చైనా భారీ యంత్రాల ఉత్పత్తి మార్కెటింగ్ స్థానాల్లో స్థానిక వనరులతో, స్థానిక ప్రజలతో చిన్న తరహా ఉత్పత్తి మార్కెటింగ్ను అనుసరించింది. కమ్యూన్ అని పిలిచే ప్రాంతం మన రెండు, మూడు జిల్లాల విస్తరణతో ఉంటుంది. ప్రతి కమ్యూన్ స్వయం పోషకంగా ఒక దేశంలా ఎదగాలని, అక్కడి సహజ వనరులతోనే ఇది సాధించాలని, భావించారు. పరిశోధనలు చేశారు. నైపుణ్యాలు పెంచుకున్నారు.

ఏవో కొన్ని జాతీయస్థాయిలో అవసరమైన భారీ యంత్రాలు మాత్రమే జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. చైనా ఎదిగిన క్రమం ఒక ఆదర్శ నమూన దశాబ్దాల క్రమంలో చైనా ప్రజల అవసరాలు తీరాయి. జీవన ప్రమాణాలు పెరిగాయి. 1980 లో ప్రారంభమై 1990 ల నుండి వేగం పుంజుకున్న ప్రపంచీకరణ దశలో చైనా వేగంగా ఎదిగింది. తక్కువ ధరలో ప్రపంచ వ్యాప్తంగా సరుకులను , సేవలను కుమ్మరించింది. అలా ఒకవైపు తమ దేశ ప్రజల ఉపాధి అవకాశాలు పెంచుకున్నారు.

జీవన ప్రమాణాలు పెంచుకున్నారు. మరోవైపు అదనపు ఉత్పత్తిని చేయగలిగారు. ప్రపంచానికి విస్తరించారు. మానవ వనరులతో సాధించలేని అభివృద్ధి లేదు అని యూరప్ , అమెరికా , ఆస్ట్రేలియా తదితర దేశాలకు నిరూపించారు. రామ్ మనోహర్ లోహియా ముందుచూపు ప్రముఖ సోషలిస్టు ఉద్యమ సిద్ధాంతవేత్త, నిర్మాత డా. రామ్ మనోహర్ లోహియా సరిగ్గా ఇలాంటి ఉత్పత్తి మార్కెటింగ్ విధానమే ఇండియా, చైనా వంటి బహుళ జనాభా గల దేశాలకు అవసరం. యూరప్ దేశాల యంత్ర ఉత్పత్తి విధానం నిరుద్యోగాన్ని పెంచుతుంది అని 1940 ల నుండి చెప్తూ వచ్చారు. గాంధీజీ చెప్పిన గ్రామీణ ఉత్పత్తి విధానం స్థానంలో ఆధునిక అభివృద్ధితో కూడుకున్న ఇప్పుడు చైనా నిరూపించిన విధానంలో ఎదగాలని లోహియా ప్రతిపాదించారు.

ఈ విషయాన్ని ప్రణాళికా కర్తలు , మేధావులు నిర్లక్ష్యం చేశారు. అందువల్ల 1977 నుండి అభివృద్ధి ఎదుగుదల మందగించింది. నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది. పెద్దగా పెట్టుబడి లేని అవకాశంగా ప్రైవేటు స్కూళ్ళు పెరిగాయి. రెండు విధాల చెడిన ఇండియా అలా ప్రైవేటు విద్యారంగం క్రమంగా పెరుగుతూ వచ్చి విద్యా, వైద్యం , కార్పొరేట్ రంగాలుగా విస్తరించాయి. విద్య , వైద్యం , నైపుణ్యాల శిక్షణ , తదితర కోర్సులు ప్రభుత్వాల కనీస కర్తవ్యం. యూరప్ దేశాలు , ఆస్ట్రేలియా ఈ విషయంలో ఆదర్శవంతంగా ఉన్నాయి. ఇండియా రెండు విధాలుగా చెడిపోయింది.

అటు యూరప్ లో లాగ విద్యావైద్యం ఉచితంగా అందించే ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఇటు పన్నులు మాత్రం యూరప్ , అమెరికా , ఆస్ట్రేలియా దేశాలవలె ప్రత్యక్ష , పరోక్ష పన్నులను ఆయా దేశాలతో పోటీ పడి దంచి వసూలు చేస్తున్నది. మరి ఈ డబ్బంతా ఏమవుతున్నదో తెలియదు.

ఇన్నోవేటివ్ థింకింగ్ లేని భారతీయ పెట్టుబడిదారులు , వ్యాపారులు ఇన్నోవేటివ్ థింకింగ్ లేని భారతీయ పెట్టుబడిదారులు , వ్యాపారులు ముఖ్యంగా మార్వాడి , గుజరాతీ వ్యాపారులు దేశం దుస్థితిలో ఉండడానికి ప్రధాన కారణం ఏమంటే ప్రైవేటు రంగంలోని పెట్టుబడి దారులు , వ్యాపారవేత్తలు చైనాలోవలె పోటీపడి ఆయా సరుకులను ఉత్పత్తి చేయకపోగా , చైనానుంచి దిగుమతి చేసుకుని సరుకులు అమ్మి లాభపడుతూ మన దేశంలో నిరుద్యోగానికి కారకులవుతూ , ఈ దేశ సంపద లక్షల కోట్ల రూపాయలు చైనాకు తరలిపోయేట్టు చేశారు.

పనికి వంగలేక , మీద మీద సంపాదనలకు అలవాటుపడ్డ భారతీయ పెట్టుబడిదారులు ఇలా కమీషన్ ఏజెంట్లు , బ్రోకర్లవలె సంపాదనకు దిగి సరుకులను ఉత్పత్తి చేసే బదులు దిగుమతి చేసుకుని , వాటిని ఇక్కడ అసెంబ్లింగ్ చేసి అమ్ముకుంటూ ఈ దేశంలో ఉత్పత్తి అయినట్టు నటిస్తుంటారు. ఇలా ఈ దేశం లక్షల కోట్ల అప్పుల పాలు కావడానికి భారతీయ పారిశ్రామిక వేత్తలు , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రధాన కారణం. అప్పులు పెరగడం , నిరుద్యోగం పెరగడం రెండూ ఒకే అంశానికి సంబంధించిన బైప్రొడక్ట్లు అని మరిచిపోకూడదు. ఇప్పటికైనా చైనా నమూనాను అనుసరించక తప్పదు.

సేవారంగంతో బతికిపోయిన ఇండియా రోజురోజుకు అప్పుల పాలైన ఇండియా గ్లోబలైజేషన్ అందివచ్చిన అవకాశాల్లో సేవారంగంతో ఇండియా బతికిపోయింది. 1990 ల నుండి పి.వి. హయాంలో ప్రవేశపెట్టిన ప్రవేటీకరణ విధానంలో మన దేశం నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెరిగి అనేక దేశాలకు విస్తరించారు. ఇది సేవారంగం అని మరిచిపోకూడదు. ఈ సేవా రంగం ద్వారా ప్రపంచంలో మన ఆదాయం పెంచుకోగలిగాము.

1977 నుండి గల్ఫ్ దేశాలకు లక్షలాది యువతరం సేవా రంగంలో పని చేయడానికే వెళ్తూ వస్తున్నారు. ఈ రెండు రకాల ఆదాయం ఈ దేశం అప్పులు పాలు కాకుండా కాపాడుతూ వచ్చింది. సరుకుల ఉత్పత్తి అవసరమైన మేరకు చేసే రంగాలను అభివృద్ధి పరుచుకోక పోవడం వల్ల లక్షల కోట్ల దిగుమతులతో అప్పులు పెరుగుతూనే ఉన్నాయి.

సమస్త సంఘర్షణలకు ఉద్యమాలకు , వైషమ్యాలకు , మతతత్వానికి మూలం మతతత్వం , విద్వేషం పరస్పర సామాజిక వర్గాల మద్య వైషమ్యం పెంచడం ద్వారా యువతరం అసంతృప్తిని దారి మళ్లిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాద , తీవ్రవాద , నక్సలైట్ , మావోయిస్టు , ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా , అంతర్గత వలస ఆక్రమణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి.

ముంబై మాదే అని మహారాష్ట్రులు నినాదం యిచ్చారు. అక్కడ అభివృద్ధిలో ఇతర ప్రాంతాలవారు రావడం , తమకు అవకాశాలు లేకపోవడం అందుకు కారణం. అలాగే మరో 4 పదిహేను చిన్న రాష్ట్రాల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు బీసీ , ఎస్సీ , ఎస్టీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం రిజర్వేషన్లు , బడ్జెట్లు పెరగాలని , 1980 ల నుండి ఉద్యమాలు ఎప్పటికప్పుడు సాగుతూనే ఉన్నాయి. విభిన్న రూపాల్లో నిరుద్యోగ సమస్య సాధికారికత సమస్య 1980 ల నుండి మహిళా సాధికారికత కోసం స్త్రీవాద ఉద్యమాలు పెరిగాయి.

ఇలా అన్ని వైపులా ఒత్తిడి పెరిగింది. అవకాశాలు తక్కువ. అందువల్ల అవన్నీ స్త్రీ పురుషుల మధ్య అసమానతలు అనే సంఘర్షణ రూపం తీసుకున్నాయి. ప్రాంతీయ అసమానతలు అనే సంఘర్షణ , అంతర్గత వలసవాదం , బీసీ , ఎస్సీ , ఎస్టీ సామాజిక వర్గాల అభివృద్ధి , అగ్రవర్ణ , అగ్రకుల వ్యతిరేక ఉద్యమాలు మొదలైనవన్నీ చైనావలె ఉత్పత్తి , అభివృద్ధి , నైపుణ్యాల శిక్షణ, సమస్థ రంగాల విస్తరణ , మార్కెటింగ్ చేయలేక పోవడమే ప్రధాన కారణం. మతతత్వం పెంచి నిరుద్యోగాన్ని మరిపించిన శక్తులు దీన్ని 1980 ల నుండి మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని , అలా చేయకూడదని పరస్పర సామాజిక వర్గాల సంఘర్షణ పెరిగింది. ఈ సంఘర్షణను ఆర్ఎస్ఎస్ , బిజెపి , విశ్వహిందూ పరిషత్ , ఎల్.కె. అద్వానీ , రామజన్మభూమి , బాబ్రీ మసీదు రథయాత్రలతో ప్రజలను దారి మళ్ళించారు.

ఇలా పరస్పరం కొట్టుకు చచ్చే పరిస్థితి పెంచుతూ వచ్చారు. రాజకీయంగా బిజెపి , క్రమంగా పుంజుకొని అదే సిద్ధాంతంగా మార్చుకుంది. నిరుద్యోగ సమస్య పరిష్కారం తనది కాదని , ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చుడు తమ కర్తవ్యం కాదని ప్రకటించారు. పోనీ ప్రైవేటు రంగాన్ని ఎదిగించారా అంటే అదీ జరగలేదు. కేవలం దిగుమతుల ద్వారా సంపన్నులు అయ్యే బ్రోకర్ వ్యాపారవేత్తలను పెంచారు. స్టార్టప్ లు , కుటీర పరిశ్రమలు , స్థానిక పరిశ్రమల ఆవశ్యకత ఇప్పటికైనా వెనక్కి తిరిగి చూసి జరిగిపోయిన నష్టాన్ని పూడ్చుకోవడానికి చైనా వంటి దేశాల అభివృద్ధి క్రమాలను స్వయం పోషక ఆర్థిక పారిశ్రామిక , గ్రామీణ కుటీర పరిశ్రమల విధానాలను , ఆవిష్కరణలను , స్టార్టప్లను వందల రెట్లు ఎదగడానికి చేయూతనివ్వడం అవసరం.

ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండూ ఏక కాలంలో ఎదగడం అవసరం. దీనికి తొలి మెట్టుగా యూరప్ , ఆస్ట్రేలియాల వలె విద్యా , వైద్య రంగాలు , క్రమంగా మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం అవసరం. ఇది తొలి పెట్టుబడి అని గుర్తించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. చేసిన లక్షల కోట్ల అప్పులు తీరుతాయి. క్యూబాలో పెరిగిన డాక్టర్లు ప్రపంచానికి సేవలు అందించారు. కేరళలో పెరిగిన నర్సింగ్ శిక్షణ పొందిన వారు దేశానికి , ప్రపంచానికి సేవలు అందిస్తున్నారు. ఇలా విద్య , వైద్యం , నైపుణ్యాల అభివృద్ధి అనే తొలి పెట్టుబడి సమకూర్చిన తర్వాత గృహవసతి ఒక్కటే ప్రధాన సమస్యగా ఉంటుంది. దాన్ని ప్రభుత్వం గానీ , ప్రజలు స్వయంగా గానీ పూనుకొని పరిష్కరించుకోవచ్చు. ఇందుకు రాజకీయ సంకల్పం అవసరం.

Read More
Next Story