తెలంగాణ ఏర్పాటు జాప్యానికి కెసిఆరే కారణం
x

తెలంగాణ ఏర్పాటు జాప్యానికి కెసిఆరే కారణం

పదేళ్ల తెలంగాణ: 7. బిఎస్ రాముడు విశ్లేషణ "తన నాయకత్వం తన వర్గం తన పెత్తనం బలపడేదాకా, ఉద్యమాన్ని సాగదీసి రాష్ట్రం ఏర్పాటు జాప్యం చేసింది కేసిఆర్ కాదా?"


తెలంగాణ బిడ్డల్ని చంపిన బలి దేవత ఎవరు? అనే శీర్షికతో మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెశిడెంట్ చేసిన ప్రకటనను పత్రికలో చూసాను. అలా అనడం రాజకీయ విజ్ఞత కాదు. అధమ స్థాయి విమర్శ అది. పదేళ్బు పాలించిన పార్టీ నేతగా కెటిఆర్ అలా అనడం తగదు. మొన్న కాంగ్రెస్ తో జత కట్టి గెలిచారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించారు. రేపు వారితో తిరిగి ఐక్య సంఘటన కట్టరు అనేదేమీ లేదు. అలా తిరిగి మొహాలు చూసుకునే అవకాశం ఉండాలి. ఆ సంస్కారం పెంచుకోవాలి. తెలంగాణను అడ్డుకున్నది సోనియా గాంధీయా?


త్యాగాలు చేసిన ప్రజలను మరిచి , క్రూర దుర్మార్గాలు చేసిన ఆంధ్ర పాలకులను వదిలి చేసే విమర్శ లెందుకు? ఆ రక్త యుక్తచరిత్ర మరిచిన సంస్కారానికి ఆవేశంతోడైతేఅందునా ఓటమి ఓరిమిని నశింప చేస్తే , అధికార పీఠం కోల్పోయినా అహంకారం పోక పోతే ఆ భాష, ఆ వ్యక్తీకరణ ఎలా వుంటుందో టీఆర్ ఎస్ నాయకుల్లో చూడ వచ్చు. మరీ ముఖ్యంగా కేటిఆర్ , హరీష్ రావు, బాల్క సుమన్ మాటల్లో వారి సంస్కారం గమనించ వచ్చు. నిన్న కెటిఆర్ సోనియా గాంధీపై. చేసిన ప్రకటన తాజా అందుకు ఉదాహరణ.


వైయస్ వైయస్ రాజశేఖర్ రెడ్డి యా? అసలే మెజారిటీ లేని కాంగ్రెస్ యుపిఎలో ఎంత రాజీ పడవలసి వచ్చిందో అందరికి తెలుసు. పైగా కాంగ్రెసుకు అధిక సీట్లు, ఏపీ నుండే కదా!


ప్రతి దశలో వై యస్ రాజ శేఖర్ రెడ్డి , కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను తెలంగాణ అభివృద్ది ని అడ్డుకున్నారు. లగడపాటి రాజ గోపాల్ , కెవిపి రామచంద్ర రావు వంటి వాల్లు చేసిన ద్రోహాలు ఇన్నీ అన్ని కావు. రాష్ట్ర ఎంపీలతోనే 10 ఏళ్ కాంగ్రెస్ పాలన నడిచింది. టి ఆర్ ఎస్ కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములే. సరిగా పూనుకుంటే 2006 మరోసారి 2009 లో నైనా తెలంగాణ ఏర్పడకుండా వాయిదా పడడానికి కెసిఆర్ వ్యూహం కూడా కారణం అని మరిచిపోరాదు. ఈ విషయం 2009 లోనే పత్రికలో వివరించాను.

తనదంటూ సొంత వర్గం , సొంత బలం ఉద్యమంలో మెజారిటీగా, పైచేయిగా ఎదిగేదాకా సాగతీత ఉద్యమాలు చేసింది కెసిఆర్. పార్లమెంటు సమావేశాల చివరి రోజు చివరి క్షణాల్లో పూనుకున్నది సోనియాగాంధీ, మీరాకుమార్ సుస్మాస్వరాజ్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. ఈ పరిణామాలు మరిచి పోతే ఎలా? సోనియాను కలిసి కృతజ్ఞతలు తెలిపి గ్రూపు ఫోటో దిగింది కెసిఆర్ కుటుంబమే కద ! అలా ఫోటో దిగే అవకాశం ఉద్యమ కారులకే దక్కలేదు. రెండు రాష్ట్రాల్లో ఓటమి తప్పదు అని తెలిసి కూడా సోనియా గాందీ మాట నిలుపుకున్నారు. కాంగ్రెస్ లో తమ పార్టీని కలుపుతామని మాట ఇచ్చి మోసం చేసింది, కాంగ్రెస్ ను నిండా ముంచింది కేసిఆర్ కాదా? తన పార్టీ ప్రయోజనాలు బలి పెట్టి తెలంగాణను ఆమోదించిన సోనియా గాంధీని

ఇపుడు బలి దేవత అని అనవచ్చా? అసలు బలి తీసుకున్న దెవరు, ? చంపింది ఎవరు? వారిని వారి క్రూరత్వాన్ని యువ తరాలకు చెప్పాల్సింది ఎవరు? 1968 నుండికాసు బ్రహ్మానంద రెడ్డి, జలగం వెంగళరావు, 1984 నుండి ఎన్టీ రామా రావు, చంద్ర బాబు నాయుడు, 2004 నుండి వైయస్ రాజ శేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఈ బలి కి కారకులు. క్షమాగుణం మంది పై లాఠీలు. జైల్లు కేసులు హింసలు , పోలీసు కాల్పులు, యవత ఆత్మహత్లలకు , రైతుల ఆత్మ హత్యలకు, నేత కార్మికుల ఆత్మ హత్య కు కారకులు వీరు కాదా? వీరే వేలాది

మంది చనిపోవడానికి కారణం అని తెలంగాణ పేదలు గుర్తుంచుకోవడం అవసరం. టి ఆర్ ఎస్ నాయకులు అసలైన నేరస్తులను వదిలి పెట్టి సోనియా గాందీ తెలంగాణ ఇచ్చిిందన్న కాంగ్ర్రెస్ మాటు పోటీ గా బలి దేవత సోనియా అనడం సంస్కారం అనిపించుకోదు.

1998 లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడ తీర్మానం చేసి ప్రచారం చేసినా ఆలె నరేంద్ర పార్ల మెంటులో ప్రయివేటు బిల్లు పెడితే సాధ్యకాదు అంటూ నిరాకరించాడు హోం మంత్రి ఎల్ కె అద్వానీ! ఆనాడు టిడిపి చంద్రబాబు తో ఎన్డీయే ప్రభుత్వం నడిచింటింది. చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించాడు. లక్షలాది మందిపై క్రూర నిర్బంధాలు ప్రయోగించాడు.ఈ చరిత్రంతా తెలంగాణ యువతకు విడమరిచి చెప్పాలి.
అందుకు పార్టీలన్నీ పూనుకోవాలి. అసలైన దోషులు నేరస్థుల ఆనవాళ్లుగా వున్న కెబీఆర్ పార్కు వంటి వాటి పేర్ల ు వెంటనే మార్చుకోవాలి. వారి విగ్రహాలను తెలంగాణ నుండి తొలగించి ఆంధ్ర ప్రభుత్వానికి అప్పగించాలని ప్రజలు ఎన్నాల్లుగానో కోరుతున్నారు. మక్కాలో సైతాన్ అని రాల్లతో కొట్టడానికి ఒక ప్రదేశం వుందట! అట్లా తెలంగాణ ప్రజలపై దుర్మార్గంగా క్రూరంగా ప్రవర్చిన పైన పేర్కొన్న వారందరి విగ్రహాలను అమర వీరుల దినోత్సవం నాడు తగు ఛీత్కార సెమినార్లు పెట్టాలని పాఠ్య పుస్తకాల్లో వారి నిర్వాకం రాయాలని అలా వారికి తగు“సత్కారం “ విధించాలని,ఉద్యమ కారులు కోరుతున్నారు.


పదేళ్ల తెలంగాణ, Ten Years of Telangana, KCR, Sonia Gandhi, KTR


Read More
Next Story