
హైదరాబాద్ NAPM సభలో తెలుగు ను విస్మరించారా?
నాలుగు రోజుల NAPM నేషనల్ కన్వెన్షన్ లో తెలుగు వారికి అవమానం జరిగిందా?
భోజన విరామం లో భోజన విరామ సమయంలో హైదరాబాద్ డిక్లరేషన్ ప్రింటు కాపీని ఇంగ్లీషు, హిందీ భాషలలో చదివి వినిపించారు. తెలుగు రాష్ట్రంలో తెలుగులో వినిపించలేదు. హిందీ భాషా వాదులు కాకపోయినా త్రిభాషా సూత్రం పాటించక పోవడం వల్ల హైదరాబాద్ కు వచ్చి తెలుగు వారిని అవమానించినట్టయింది. . 70 ఏళ్ల కిందటి అవమానాలే ఇప్పుడూ ఎదురయ్యాయి ఎవరూ గమనించలేకపోవడమే విషాదం.
భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం (Defending Democracy) అనే నినాదం తో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నాపమ్ (National Alliance of People's Movements) నాలుగు రోజులు నేషనల్ సెమినార్ జరిగింది. దేశంలోని పలు ప్రాంతాల నుండి వందలాది ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా ఆయా లక్ష్యాల కోసం కృషి చేస్తున్న సంస్థలు, ప్రతినిధులు. జాతీయ వేదికలో సభ్య సంస్థల ప్రతినిధులు, సౌహార్ద్ర ప్రతి నిధులు పాల్గొన్నారు.
ఈ సభలకు ప్రతినిధులుగా వచ్చిన హోమియో డాక్టర్ల రాష్ట్ర అధ్యక్షుడు సామాజిక ఉద్యమకారుడు పరికిపండ్ల అశోక్ (మెహబూబాబాద్) , స్వదేశీ పరికిపండ్ల (నిర్మల్) , సింగిరెడ్డి నరేష్ రెడ్డి (జగిత్యాల) తాము వచ్చామని ఫోన్ చేసారు. మూడో రోజు సాయంత్రం వివరాలు చెప్పి చివరి రోజు రావాలని ఆహ్వానించడంతో అందరం కలిసి బయలు దేరాము.
మేం చేరే సరికి ఎవరిదో ప్రసంగం నడుస్తున్నది. స్టేజి మీద అందరు కూర్చొని ఉన్నారు. మాట్లాడుతున్న మనిషి కనపడలేదు. కాసేపటికి తెలిసింది ఏదో రాష్ట్రం నుండి లైవ్ లో మాట్లాడుతున్నారని. అలాంటివి రెండు ప్రసంగాలు జరిగాయి. వేదికమీద ఉన్నవారు సంక్షిప్తంగా మాట్లాడారు. కొందరు వివరంగా మాట్లాడారు. అందరు ప్రజలకు మేలు జరగాలని, పర్యావరణం కాపాడుకోవాలని, ఎదురవుతున్న సవాళ్ల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అనే థీం సెంటర్ పాయింటుగా నడిచాయి సభలు .
రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక ఉద్యమాలకు పరిమితమై దశాబ్దాలుగా పని చేస్తున్నవారు తమ లక్ష్యాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
వీటన్నిటికీ కేంద్ర బిందువుగా యాక్టివిస్టు మేథా పాట్కర్ అనిపించించింది. వేదిక మీద ఆసీనులైన వారు ప్రతి విషయానికి మేథా పాట్కర్ ను సంప్రదిస్తున్నారు. ప్రసంగాలు హిందీలోనే సాగాయి. తమిళనాడు లో హిందీ వ్యతిరేక ఉద్యమం వేగం పుంజుకుంటున్న సమయంలో హైదరాబాద్ లో హిందీలో ప్రసంగాలకు వ్యతిరేకత లేకుండా సాగిపోయింది. సభ నిర్వాహకులు త్రిభాషా సూత్రం పాటించినట్టు లేదు. బ్యానర్ పైన కూడా హిందీ, ఇంగ్లీషు రెండు భాషలే కనపడ్డాయి. పక్కకు చిన్నగా తెలుగు, ఉర్దూల్లో కూడా రాసారు.వెదికితేనే కనిపిస్తాయి. దానికంత ప్రాధాన్యత లేదని అర్థమయింది.
నాలుగు రోజుల సదస్సులో హిందీ హంగామాకి ఎవరూ అభ్యంతర పెట్టినట్టు లేదు. తెలుగు వారి తెలుగు భాషాభిమానం లోలోపలే వుండిపోయింది. తెలంగాణ జన సభ నాయకులు తాజా ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం కూడా హిందీలో మాట్లాడడం విశేషం. సమాజ్ వాదీ పార్టీ నేతలు, మార్క్సిస్టు లెనినిస్ట్ పార్టీ నేతలు, వామ పక్ష నేతలు ఈ కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. ప్రసంగాలు చేసారు.
1990 లో మొదలైన ప్రపంచీకరణ, ప్రైవేటీకరం, సరళీకరణ పరిణామాలు, కేంద్రంలో అధికారం లో వున్న పార్టీ ప్రచారంలోకి తెచ్చిన మత విద్వేషాలు, రాజ్యాంగం స్వరూపానికీ, హక్కులకు తెచ్చిన ముప్పు, తెస్తున్న తీరు వివరిస్తూ వర్తమాన కర్తవ్యాలు పై ప్రసంగాలు సాగాయి.
రాజ్యాంగ పరిరక్షణ ప్రధాన థీంతో సాగుతున్న సభలు గనక ఇటీవల నేను ఫునర్ముద్రించిన " భారత రాజ్యాంగం. ముఖ్యాంశాలు" పుస్తకాన్ని ఆవిష్కరిస్తే సముచితంగా వుంటుందని నన్ను ఆహ్వానించి వారు సూచించారు. దీనితో 200 పుస్తకాలు కారులో తీసుకొని బయలుదేరాము. కార్యక్రమం పకడ్బందీగా నిర్దిష్టమైన సమయపాలన, ప్రకారం క్రమశిక్షణతో సాగుతున్నది. నేను వేదిక పైకి పుస్తకం ఆవిష్కరించడానికి ప్యాక్ ను పంపించాను. వారిలో వారు మాట్లాడుకున్నారు.
అందరు మేథా పాట్కర్ ను సంప్రదిస్తుండడంతో ఆమె అనుమతి అవసరమని భావించి నేనూ వేదిక పైకి వెళ్లి వారిని కలిసాను. 1994 లో ఈ సంస్థ ప్రారంభసమయంలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని సాక్రిలో మూడు రోజులపాటు సభలు జరిగాయి. సత్యశోధక కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులు శరద్ పాటిల్ నాయకత్వం వహించారు. అక్కడ అంతర్జాతీయ అంబేద్కరైట్ మార్క్సిస్టు అంతర్జాతీయ రచయిత్రి గెయిల్ ఒంవెద్ (Gail Omvedt) , మేథా పాట్కర్ లతో పాటు పలు రాష్ట్రాల వారం రోజులు కలుసుకున్నాము. ఆ తరువాత గుంటూరులో పెద్ద ఎత్తున జరిగిన దళిత మహిళా సంఘం ఊరేగింపు లో కత్తి పద్మారావుతో పాటు మేథా పాట్కర్ నేనూ కలిసి పాల్గొన్నాము. మేథా పాట్కర్ తో ఆ విషయాలు గుర్తు చేసాను. ఆమె పాత మిత్రులు కలిసిన సంతోషంతో రెండు చేతులు జోడించారు. ఈ సభలు జరుపుతున్నట్టు 15 రోజుల ముందు నాకు తెలపాల్సి ఉండింది అన్నాను. ‘అవును, సారీ’ అన్నారు.
సెషన్ ముగిసే సమయంలో నేను తెచ్చిన పుస్తకం ఆవిష్కరిస్తారను అన్నాను. కిరణ్ కుమార్ , మరొకరు కలసి ‘సారీ’ చెప్తూ నిర్ణీత కార్యక్రమంలో ఆవిష్కరించలేము అన్నారు.
200 పుస్తకాలు తీసుకెళ్తున్నపుడు చర్చించాను. యాభయి రూపాయల పుస్తకం 25 రూపాయల కు ఇవ్వాలా? ఉచితంగా ఇవ్వాలా అని ఆలోచించి ఉచితంగా ఇవ్వడం వల్ల అందరికి చేరుతుంద, అనేక తెలుగు ప్రాంతాలకు చేరుతుంది అని నిర్ణయం తీసుకోవడం వల్ల ఆవిష్కరణకు ముందేపుస్తకాలను పంచడం జరిగింది.
ఇక లాంచనంగా వేదిక పై ఓ నిమిషం పుస్తకాన్ని పట్టుకొని ఆవిష్కరణ అయిందనిపించడమే. ఏ లక్ష్యంతో సభలు నిర్వహిస్తున్నారో ఆ లక్ష్యం కోసమే రాయబడిన భారత రాజ్యాంగ లక్ష్యాలను సరళంగా తెలిపే పుస్తకం ఆవిష్కరించుకోవడం ఆ వేదికకే గొప్ప గౌరవం. కాని వారు నిర్ణయించుకున్న కార్యక్రమంలో చేర్చలేం అన్నారు. తద్వారా వారు తక్షణం ఎదురయ్యే వాటి మీద వెంటనే నిర్ణయాలు తీసుకోలేని దశలో కొనసాగుతున్నారని పంపించింది.
ఇందుకు భిన్నంగా 2003 లో నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో వారం పాటు సాగిన ‘ఆసియా సోషల్ ఫోరం’ సభల్లో అప్పటికప్పుడు “ప్రపంచీకరణ నేపథ్యంలో వేప చెట్టు- తెలంగాణ కథలు “ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. 2017 ప్రపంచ తెలుగు మహా సభల్లో నా అధ్యక్షత ఎన్నో పుస్తకాలు అప్పటికప్పుడు వచ్చినవి ఆవిష్కరించడమే కాదు పుస్తకాల రచయితలను వేదికపై పిలిచి గౌరవించుకోవడం జరిగింది.
సభల్లో వేదిక మీద ఉన్న వారికి స్వయం నిర్ణయ శక్తి లేదని ఎవరో ఏవో శక్తులు వెనక ఉండి నడిపిస్తే వీరు నడుస్తున్నారేమో నటిస్తున్నారేమో అనిపించింది. ప్రసంగాలు కూడా మార్పు లేకుండా నాలుగు దశాబ్దాల నాటి అదే ధోరణి లో సాగాయి.
1983 నుండి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పర్యటించినప్పుడు జాతీయ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఏమి మాట్లాడాలో, ఏమి విన్నామో అదే ధోరణి ఇప్పటికీ కొనసాగుతున్నదని అనిపించింది. దశాబ్దాలుగా ఉద్యమించడం, ఎదిరించడం జరుగుతున్నది. నిరంతరం ఇదే పనా?సంఘ సంస్కరణ జరిగితే మార్పు రావాలి కదా! ఆ మార్పు
సమాజంలో తేలేదా? రాజ్యాంగానికి మరింత ప్రమాదం ఎదురవుతున్నదంటే దశాబ్దాలుగా చేస్తున్న కృషి ఏమైనట్టు ? ఆ కృషి ప్రజలకు తాకలేదా? అందలేదా?
40 ఏండ్ల నాటి మాటలు , 40 నాటి భాష , భావాలు, ఏమీ మారకుండా అలాగే కొనసాగుతున్నయెందుకు అనిపించింది. ప్రజలకు రాజ్యాంగం , హక్కుల చైతన్యం కలిగించడానికి ప్రచారం స్థాయి నుండి నిర్మాణాత్మక కృషి చేయలేకపోవడం కారణమా అనిపించింది. అందుకే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ప్రతి స్కూలు విద్యార్థి కి రాజ్యాంగం ప్రతిని సులభ భాషలో మాతృభాషలో ఏటా ఉచితంగా అందించాలి అని ప్రభుత్వాన్ని కోరే తీర్మానం కనపడే లేదు. సొభ జరుగుతుండగా వేదిక దిగి పక్క స్టాల్ లో కోదండరామ్ తో సాగుతున్నవిలేఖరుల సమావేశంలో కూడా పుస్తకం ఆవిష్కరించాలని మిత్రులు పట్టు బట్టి ఆవిషకరింపజేసారు.
భోజన విరామం లో హైదరాబాద్ డిక్లరేషన్ ప్రింటు కాపీని ఇంగ్లీషు, హిందీ భాషలలో చదివి వినిపించారు. తెలుగు రాష్ట్రంలో తెలుగులో వినిపించలేదు. హిందీ భాషా వాదులు కాకపోయినా త్రిభాషా సూత్రం పాటించక పోవడం వల్ల హైదరాబాద్ కు వచ్చి తెలుగు వారిని అవమానించినట్టయింది. . 70 ఏళ్ల కిందటి అవమానాలే ఇప్పుడూ ఎదురయ్యాయి ఎవరూ గమనించలేకపోవడమే విషాదం.
ప్రజాస్వామ్య హక్కులు ,చైతన్యం స్కూలు స్థాయిలో చెప్పడం అవసరం కదా అన్నప్పుడు పివో డబ్యూ సంధ్య మీ సూచనలు వారికి చెప్పాలి అన్నారు.
భోజన విరామం ప్రకటించి విలేఖరుల సమావేశం, హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తరువాత వేదిక ఖాళీ అయింది. అలా భోజన విరామం సమయంలో @ భారత రాజ్యాంగం- ముఖ్యాంశాలు " పుస్తకం వేదికపై ఆవిష్కరింపబడింది. ఐదారుగురితో మొదలైన ఆవిష్కరణ సభ కొన్ని క్షణాల్లోనే వేగానికి నిండి పోయింది.
అందరి చేతుల్లో పుస్తకం కనిపించింది. అయిదు నిమిషాల పాటు రాజ్యాంగం గురించి మహాత్మా ద్యోతి బాఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేదికర్, పెరియార్ రామస్వామి నాయకర్ గురించి నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లిన పోయింది. అలా రెండు రాష్ట్రాల బహుజన చైతన్యం సత్తా నిరూపించారు. మాకు హిాందీ అనువాదం కావాలి అన్నారు.
చివరి నిమిషంలో తెలిపి తప్పనిసరి రావాలని తీసుకెళ్లిన వారి లక్ష్యం ఇలా నెరవేరింది. చక్కని భోజనాలతో, వందలాది అభిమానుల కలయికతో నాలుగు రోజులుగా తెలుగు ప్రసంగాలకు నోచుకోని ముగింపు సమావేశం, లాస్ట్ బట్ నాటా లీస్ట్ అన్న చందంగా తెలుగు నినాదాలతో గొప్ప ప్రేరణతో ముగిసింది.