‘కెప్టెన్ కూల్’ కు ట్రేడ్ మార్క్ కష్టాలు తప్పవా?
x
ఎంఎస్ ధోని

‘కెప్టెన్ కూల్’ కు ట్రేడ్ మార్క్ కష్టాలు తప్పవా?

ఆమ్రపాలి ప్లాట్ కేసులో ధోనికి ఇప్పటికే చిక్కులు


బినో కే జాన్

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని తనపై తరచుగా ఉపయోగించే పదబంధం అయిన ‘కెప్టెన్ కూల్’ ను తన వ్యక్తిగత ట్రేడ్ మార్క్ గా రిజిస్టర్ చేయించుకున్నాడు. ఈ చర్య వల్ల భవిష్యత్ లో అతను వివిధ ట్రేడ్ మార్క్ సంబంధింత సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో ధోనికి తక్కువ క్రెడిట్, అదనపు బ్రాండ్ విలువను తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్న మాట.

ఈ పద బంధం తన పేరుపై రిజిస్టర్ చేయించుకోవడానికి ధోని 2023 లోనే ట్రేడ్ మార్క్ పిటిషన్ దాఖలు చేశారు. తరువాత సీనియర్ ట్రేడ్ మార్క్ ఎగ్జామినర్ ఈ క్రింది ప్రకటన విడుదల చేశారు.
‘‘ప్రఖ్యాత ప్రజా వ్యక్తి, భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన దరఖాస్తుదారుడు శ్రీ మహేంద్రసింగ్ ధోని, ‘కెప్టెన్ కూల్’ అనే మారు పేరుతో గుర్తింపు పొందాడు.
కెప్టెన్ కూల్ పదబంధం దరఖాస్తుదారుడి వ్యక్తిత్వంతో దగ్గరగా ముడిపడి ఉంది. క్రీడా, వినోద సేవల సందర్భంలో అతనిని సూచించడానికి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని పొందింది. ’’
ఒకే ఒక అభ్యంతరం..
ఈ ట్రేడ్ మార్క్ జూన్ 16న రిజిస్ట్రీ అధికారిక జర్నల్ లో ప్రచురించింది. క్లాస్ 41 కింద దాఖలు చేసిన ఈ దరఖాస్తు విద్య, వినోదం, క్రీడలు, కోచింగ్ శిక్షణకు సంబంధించి సేవలకు ఉద్దేశించబడింది. అయితే దరఖాస్తుకు కేవలం ఒకే ఒక అభ్యంతరం వచ్చింది. కానీ దానిని తోసిపుచ్చారు.
ఈ ట్రేడ్ మార్క్ ఏ ఉత్పత్తి గురించి కాదు. విద్య, వినోదం, క్రీడలతో సహ విస్తృత శ్రేణి కార్యకలాపాలకు సంబంధించిన సేవల గురించి మాత్రమే.
ఈ పదబంధం ట్రేడ్ మార్క్ గా రిజిస్టర్ అయినందుకు ‘కెప్టెన్ కూల్’ అని పేరు పెట్టుకున్న దేనినైనా ధోని సవాల్ చేయగలడు. ఈ అయితే దీని పేరు మీద ఏ ఉత్పత్తిని విక్రయించడు. ఇది చాలామంది క్రికెటర్లు, క్రీడాకారులను వర్ణించడానికి ఉపయోగించే పదబంధం మాత్రమే.
అయితే ఈ పదం ఎక్కువగా ధోనికి మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు దానినే అధికారికంగా రిజిస్ట్రీ చేయించుకున్నాడు. ఇలాంటి పదబంధాలు మనకు ఎక్కువగా సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ కోసం కూడా అందుబాటులో ఉన్నాయి.
సచిన్ ను మాస్టర్ బ్లాస్టర్ అని, గవాస్కర్ లిటిల్ మాస్టర్ అని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. భవిష్యత్ లో వీటిని కూడా ట్రేడ్ మార్క్ చేయగలడని అర్థం. ఫుట్ బాట్ స్టార్ క్రిస్టియాన్ రోనాల్డో గోల్ చేసిన తరువాత చేసుకునే సంబరం ‘సీయూ’ ని కూడా ట్రేడ్ మార్క్ చేసుకోవచ్చు.
ధోనిపై కేసులు..
నిధులను దుర్వినియోగం చేసి దివాలా తీసిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఆమ్రపాలీ గ్రూప్ కు ధోని స్పాన్సర్ షిప్ గా వ్యవహరించారు. దీనికి సంబంధించి కేసు నమోదు అయింది.
ఇప్పుడు మిస్టర్ కూల్ పదాన్ని ట్రేడ్ మార్క్ చేసుకోవడం ద్వారా కొత్త చిక్కులు కొని తెచ్చుకునే ప్రమాదం కనిపిస్తోంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. భారత టెస్ట్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు ఇప్పటికే ‘కెప్టెన్ కూల్’ అని పదాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిని ఉపయోగించే వార్తా పత్రికలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది?
ధోనికి చట్టపరమైన సమస్యల విషయంలో చాలా బాగా చరిత్ర ఉంది. ఇప్పుడు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ తో దానికి తోడుగా కొత్త వివాదాలు తెచ్చుకుంటున్నాడా? ఈ కేసుల విషయంలో ఇతర ఎండార్స్ మెంట్లు, వ్యాపార కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై చట్టపరమైన కేసులు కొనసాగుతున్నాయి.
నోయిడాలోని ఫ్లాట్ ల కోసం కస్టమర్లు చెల్లించిన నిధులను స్వాహ చేయడం ద్వారా ఆమ్రపాలి గ్రూప్ ఫస్ట్ డిగ్రీ నేరానికి పాల్పడిందని సుప్రీంకోర్టు ఆరోపించింది.
ధోనీ ఈ గ్రూప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. నిధులను స్వాహ చేయడం ద్వారా కంపెనీ దివాలా తీసిన తరువాత ధోని ఆమ్రపాలి నుంచి రూ. 150 కోట్లు బకాయిలు చెల్లించాలని కేసు దాఖలు చేశాడు.
అయితే తరువాత ఆమ్రపాలితో చేతులు కలిసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోర్టు నియమించిన ఆడిట్ లో ఫ్లాట్ కొనుగోలుదారులు చెల్లించిన నిధులను మళ్లించడానికి ధోని, అతని భార్య సాక్షి కి చెందిన ఖాతాలను గ్రూప్ ఉపయోగించిందని తేలింది.
ఇది ఏ ప్రమాణాల ప్రకారం చూసిన పెద్ద నేరం. అయితే ఈ ఆరోపణలను ధోని, సాక్షి ఇద్దరు ఖండించారు. ధోని నిర్వహించే రితి స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఆమ్రపాలి సఫైర్ డెవలపర్స్ చెల్లించిన రూ. 6.52 కోట్లు వాస్తవానికి ఫ్లాట్లు కొనుగోలుదారులు డబ్బు అని ఇది చట్ట విరుద్దంగా మళ్లించబడిందని ఆడిట్ నివేదిక తెలిపింది’’ అని ఇండియా టుడే నివేదిక తెలిపింది.
సుప్రీంకోర్టు ఆమ్రపాలి ప్లాట్ లను స్వాధీనం చేసుకుని పూర్తి చేసి చెల్లించిన వారికి అప్పగించడానికి నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ కి అప్పగించింది.
సాహసోపేతమైన చర్య..
1. ట్రేడ్ మార్క్ లో ప్రధాన చట్టపరమైన పరీక్ష దాని విలక్షణత. ‘‘ఒక గుర్తింపు గుర్తు. అది స్వాభావికంగా విలక్షణంగా ఉంటే లేదా ద్వితీయ అర్థం ద్వారా విలక్షణతను పొందినట్లు అయితే దానిని రక్షించగల సామర్థ్యం ఉంటుంది. వినోదం, క్రీడలు, విద్య వంటి విస్తృత కార్యకలాపాలలో ఈ ట్రేడ్ మార్క్ ను రక్షించడం కష్టం.’’
2. ‘కెప్టెన్ కూల్’ ట్రేడ్ మార్క్ గా ఉండటం వల్ల దానిని కోర్టులో ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఇది ప్రజలను గందరగోళానికి గురి చేయగలదు. ట్రేడ్ మార్క్ ల చట్టం 1999 లోని సెక్షన్ 9 ప్రకారం ఇది వాదనకు వీలవుతుంది.
3. మరోక కారణంతో ‘కెప్టెన్ కూల్’ రిజిస్ట్రేషన్ తిరస్కరించబడి ఉండాలి. ఎందుకంటే విలక్షణమైన లక్షణం లేని పదం. అంటే ఒక వ్యక్తి కి చెందిన వస్తువులు లేదా సేవలను మరొక వ్యక్తి నుంచి వేరు చేయగల సామర్థ్యం లేని పేర్లు నమోదు చేయబడవు’’.
ఏ ఆటగాడు లేదా కెప్టెన్ లేదా సైనిక సిబ్బంది అయినా వచ్చి ఆ పదబంధాన్ని అతనిని వర్ణించడానికి ఉపయోగించారని, దానిని నిరూపించడానికి వార్తాపత్రిక నివేదికలను చూపించవచ్చని చెప్పుకోవచ్చు.
4. కెప్టెన్ కూల్ అనే పదాన్ని ఏదైన స్పోర్ట్స్ క్లబ్ లేదా స్కూల్ లేదా కంపెనీ కెప్టెన్ కూల్ అని కూడా వ్రాయవచ్చు. ఇది మళ్లీ కోర్టు వివాదాలను తీసుకువస్తుంది.
ధోని పేరు భారత్, క్రికెట్ ప్రపంచం అంతటా గుర్తించబడిన విలక్షణమైన ట్రేడ్ మార్క్ గా పనిచేస్తుంది. కాబట్టి అతనికి ఎలాంటి ట్రేడ్ మార్క్ అవసరం లేదు. ధోని ఇప్పుడూ ఎదుర్కొంటున్న అన్ని చట్టపరమైన సమస్యల నేపథ్యంలో చల్లగా ఉండవచ్చు. కానీ ఈ ట్రేడ్ మార్క్ దానిని సమర్థించుకోవడానికి అతనికి అనవసరమైన ఇబ్బందులను తీసుకురావచ్చు.
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను గౌరవిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితవి. అవి ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)


Read More
Next Story