దేశంలో ట్రోలింగ్ నిరోధక చట్టం అవసరమా?
x
విదేశాంగ కార్యదర్శి.. విక్రమ్ మిస్రీ

దేశంలో ట్రోలింగ్ నిరోధక చట్టం అవసరమా?

కుటుంబ సభ్యులే టార్గెట్ గా రెచ్చిపోతున్న ట్రోలర్లు


(మూలం.. సంకేత్ ఉపాధ్యాయ)

ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ సందర్భంగా మీడియాకు వివరాలు అందించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. కానీ కొన్నిరోజులను ఆయనను, ఆయన కుటుబంబాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఆయన 35 సంవత్సరాల అనుభవం ఉన్న దౌత్యవేత్త. ప్రధానమంత్రులు ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ దగ్గర ప్రయివేట్ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. భారత్- చైనా మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నప్పుడూ వ్యూహాత్మక సమావేశాలలో పాల్గొన్న కీలక దౌత్యవేత్త.
చైనాలో మాజీ రాయబారీ, మాజీ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా కూడా పనిచేశారు. ఈ ఉన్నత స్థాయి విషయాలు ఏవీ కూడా ట్రోల్ చేసే వారికి అర్థం కావు. పరిస్థితులు చేయిదాటినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మనం వెనకాడకూడదు. ఈ సమయంలో దేశంలో ట్రోలింగ్ నిరోధక చట్టం అవసరం.
మే 7 నుంచి ఆపరేషన్ సిందూర్ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషించింది ఆయనే. పాకిస్తాన్ తో కాల్పుల విరమణ అంగీకరించినందుకు నిందలు వేయడంతో ఊహించని విధంగా ట్రోలర్లకు టార్గెట్ అయ్యారు.
దాడికి గురైన మిస్రీ..
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో పుట్టిన ఆయన అనేక స్థాయిలో దేశం కోసం పనిచేశారు. యూఎన్ హెచ్ ఆర్సీలో పనిచేస్తున్న ఆయన కుమార్తె, రోహింగ్యాల హక్కుల కోసం వాదించారు. దీంతో అన్ని విషయాలు బయటకు తీసిన ట్రోలర్లు కాల్పల విరమణకు ఆయనే కారణమని నిందించారు. మొత్తం అప్రతిష్టకు ఆయనే కేంద్రంగా విమర్శలు కురిపించారు.
మే 10 న పాకిస్తాన్ పై భారత త్రివిధ దళాలు దాడి చేయడంతో తోకముడిచిన దానవ దేశం వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శిగా ఆయన ప్రకటించారు.
అంతే ట్రోల్స్ సైన్యానికి ఆయన కేంద్ర బిందువయ్యారు. అవి తరంగాలుగా, గుంపులుగా వచ్చాయి. పాకిస్తాన్ డ్రోన్లను, మానవ రహిత వైమానిక వాహానలను పంపినట్లు పంపించారు.
కాల్పుల విరమణకు కారణం మిస్రీనే ట్రోలర్లు ఆరోపించారు. కాల్పుల విరమణకు అంగీకరించినందుకు విదేశాంగ కార్యదర్శిపై నింద మోపడమే అసలు వ్యూహం. ట్రోల్ చేసేవారికి జ్ఞానం పరిమితం. చదువురాని వారు కూడా ఇది ఒక్కడి నిర్ణయం కాదని చెబుతారు. ఆయన కేవలం ఒక దూత మాత్రమే అని చెబుతారు.
ఆ దాడితో ఆయన తన ఎక్స్ ఖాతాను లాక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మిస్రీ కుమార్తె మొబైల్ నంబర్లు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయని, ఆమెకు ఫోన్ చేసి వేధించడానికి అనాగరిక సైన్యం అయ్యాయని పలు వార్తా నివేదికలు వచ్చాయి.
కుమార్తెను లక్ష్యంగా చేసుకున్నారు..
ఈ ట్వీట్లలో చాలావరకూ మిస్రీ, అతని కుమార్తెను దేశద్రోహులుగా ముద్రవేశారు. వారి వాదనకు మరింత బలం చేకూర్చేలా మిస్రీ కుమార్తె రోహింగ్యాల కోసం వాదించిన వాదనలు ముందుకు తెచ్చారు.
అతని కుటుంబాన్ని, మొత్తం కాశ్మీరీ జాతిని ప్రశ్నించారు. విదేశాంగ శాఖ కార్యదర్శికి మద్దతుగా వచ్చిన వారికంటే ట్రోలింగ్ చేసి వారికంటే ఎక్కువ. కొంత ఆలస్యం అయినప్పటికీ ఐఏఎస్ సంఘం మిస్రీకి బాసటగా నిలిచింది.
ఈ అనుభవం మిస్రీకి మొదటి సారి అనుభవంలోకి వచ్చి ఉంటుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.
ట్రోలింగ్ వ్యాపారం..
ట్రోల్స్, వాటి పర్యావరణ వ్యవస్థలను గుర్తించడం సులభం. లెక్కలేనన్నీ సందర్భాలలో వాటి వేధింపులకు గురైనందున నా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.
ఇది విమర్శ.. ట్రోలింగ్ మధ్య తేడాను గుర్తించడంతో ప్రారంభం అవుతంది. జర్నలిజం వృత్తిలో ఉన్న వ్యక్తిగా, మా నివేదికలు తరుచుగా ప్రజాక్షేత్రంలో పదునైన విమర్శలకు గురవుతాయి. విమర్శ అనేది చాలా ముఖ్యం. ఇది మనం అప్రమత్తంగా ఉండటానికి, సరైన దారిలో నడవడానికి ఉపయోగపడుతుంది.
కిరాయి సైనికులు..
ట్రోలింగ్ అనేది విమర్శ కాదు. ఇది భిన్నంగా ఉంటుంది. నేను వారి మనస్తత్వాన్ని ఉగ్రవాదంతో పోలుస్తాను. ట్రోలర్లు అంతా కిరాయి సైనికులు. వారిని హ్యండ్లర్లు నియమించుకుంటారు.
వారికి నిర్ధిష్టమైన పనులు ఇస్తారు. వీరి లక్ష్యం వ్యక్తిని టార్గెట్ చేయడం. వ్యక్తిత్వాన్ని నాశనం చేయడం. కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టకుండా లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగడం.
వారికి ఒక ప్యాట్రన్ ఉంటుంది. కిరాయి సైనికుల నిర్వాహాకుడు వారికి ఒకటి రెండు పాయింట్లు ఇస్తాడు. దాని చుట్టూ ఈ ట్రోలర్లు కొన్ని అలంకారాలు పూసి దాన్ని వదిలిపెడతారు.
ఉగ్రవాదులను పోలిన ట్రోలర్లు..
ఈ హ్యండర్లు తమ సేవలను కోరుకునే ఎవరికైనా అందిస్తారు. చాలా రాజకీయ పార్టీలు వారి స్వంత ట్రోలింగ్ వ్యవస్థలను పోషించుకుంటున్నాయి. చాలామంది అసభ్యకరంగా భావించే పనులను చేయడానికి వారి సేవలు నిమగ్నమై ఉన్నాయి. ఈ ట్రోలర్లలో ఎక్కువ మంది అజ్ఞానంతో పనిచేస్తారు.
కొన్నిసార్లు ఉగ్రవాదుల మాదిరిగానే ఈ ట్రోలర్లు తమకంటే ముందుగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఆ తరువాత వారు ఉగ్రవాదుల మాదిరిగానే రాక్షసులుగానే మారతారు. కొన్నిసార్లు కూర్చున్న కొమ్మనే నరికేందుకు వెనకాడరు. ఎందుకంటే వాళ్లు కిరాయి సైనికులు కాబట్టి..
దీనిపై ఎం చేయాలి..
విమర్శ అనేది విమర్శలానే ఉండాలి. ఎప్పుడూ అతిగా ఉండకూడదు. ఇది చేస్తున్న పనిని మెరుగుపరచాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. గౌరవ భావవను తీసుకొస్తుంది. ట్రోలింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. ఆన్ లైన్ లో ఒక వ్యక్తి దుర్వినియోగం చేయవలసి వస్తే ఆ వ్యక్తికి తన వాదన వినిపించుకునే హక్కు ఉండదు. వారిని బ్లాక్ బటన్ కు లోబడి ఉండాలి.
ఈ ట్రోలింగ్ కిరాయి సైనికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీ సమయం చాలా విలువైనది. కాబట్టి ఇది శ్రమతో కూడుకున్నదని నాకు తెలుసు. కానీ ఆన్ లైన్ దుర్వినియోగానికి గ్రేడెడ్ ప్రతిస్పందనగా, ఇది మొదటి అడుగు కావచ్చు.
ది మిస్టీరియస్ మాస్టర్స్..
మిస్రీ విషయంలో జరిగినట్లుగా వ్యక్తిగత వివరాలు పంచుకోవడం ప్రారంభమైనప్పుడూ విషయం చేయి దాటిపోతే, మనం పోలీస్ ఫిర్యాదు చేయడానికి వెనకాడకూడదు.
విదేశాంగ కార్యదర్శి దీన్నిముందుగా చేయాలి. ఈ ట్రోలింగ్ పర్యావరణ వ్యవస్థలు, వాటి హ్యాండర్లు రాజకీయ ప్రొత్సాహాన్ని ఆస్వాదిస్తారు. కాబట్టి వారిపై చర్య తీసుకోకపోతే ఎవరు దీని వెనక ఉండి ప్రొత్సహిస్తున్నారో, ఈ పర్యావరణ వ్యవస్థలను ఎవరి నడిపిస్తున్నారో మనకు అర్థం కాదు.
అయితే ట్రోలింగ్ అనుకున్నంత ప్రమాదకరం కాదు. ఈజీగా విడిచిపెట్టవచ్చు. కానీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని, వ్యక్తిగత వివరాలు పంచుకునే వ్యాఖ్యల విషయానికి వస్తే ప్రమాదం వాస్తవమే.
చట్టం అవసరం..
మొదట ట్రోలర్ల వాడకాన్ని మానేయడం రాజకీయ వ్యవస్థకు మంచిది. రెండవది ఒక చట్టాన్ని తీసుకువచ్చి దీనిని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలి. ఆన్ లైన్ ద్వేషానికి స్పష్టమైన నిర్వచనం, శిక్షార్హమైన చర్యలకు స్పష్టమైన నిబంధన కలిగి ఉన్న ట్రోలింగ్ నిరోధక చట్టం ఈ తరుణంలో అవసరం. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ట్రోలింగ్ వల్ల లబ్ధిదారులు పరిష్కారం కోసం ఆసక్తి చూపుతారా?
( ది ఫెడరల్ అన్ని వైపులా నుంచి అభిప్రాయాలను గౌరవించడానికి ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, అభిప్రాయాలు మొత్తం రచయితవే. ఇది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Read More
Next Story