‘జై జై రామానుజం’ అని గద్దర్ పాడింది విన్నారా
x

‘జై జై రామానుజం’ అని గద్దర్ పాడింది విన్నారా

‘దేవుడు ప్రకృతి భక్తుడు విలీనం చేస్తే విశిష్టాద్వైతం’ అని గద్దర్ అన్నాడు.

విప్లవ ఆధునిక వాగ్గేయకారుడు అమరుడు గద్దర్ గజ్జెకట్టి పాట కట్టినవాడు, ఆటలు ఆడినవాడు, పాడిన వాడు. పట్టు జరీ ఉత్తరీయాలు కాదు మామూలు గొంగడి భుజాన ధరించి గద్దర్ సామాన్యుడి జీవనగీతాలను సృష్టించిన వాడు. గద్దర్ లేకపోయినా గద్దర్ కవిత్వ గానం ఉండిపోతుంది.

ఆ గద్దర్ ను ఎవరో బుల్లెట్ తో కొట్టినా, నోటినిండా తిట్టినా గద్దర్ కు ఏమీ జరగదు. బిజెపి తో మంత్రులు ఎంపీలైన వారు పద్మాలు విసిరినా రత్నాలు ఇచ్చినా రాళ్లిచ్చినా, కులం లెక్కమీద రిపబ్లిక్ డే నాడు ఇవ్వకపోయినా ఫరవాలేదు. వాళ్లు ఇవ్వకపోవడమే మంచిది. జనపీఠంలో ఉన్న ‘పద్మ’ కన్న, రత్న కన్నా ఉత్తముడు ఉన్నతుడు గద్దర్. చివరి దశలో హాస్పిటల్ గా ఉన్నప్పుడు పక్కన చికిత్సకు ఉన్న ఈ రచయిత (శ్రీధర్) చూద్దామని పోతే, ‘‘నాకెందుకు తెలవదు. సమాచార హక్కు తెలిసినాయన. మంచి పనిచేసినాయన. ప్రొఫెసరనీ తెలుసు’’ అన్నాడు.

రాజులు పుట్టి, గిట్టినవారు బోలెడు మంది చరిత్రలో ఉన్నారు. రాజులకే దిక్కు లేదంటే వారి మంత్రులు నడిగేవారెవరు.

ఎట్టిపరిస్థితులైనా పద్మ చచ్చినా ఇవ్వం అనేవాడు తెలుసుకోవలసిందేమంటే హైదరాబాద్ సమతా మూర్తి శ్రీమాన్ రామానుజన్ ఆవిష్కరించిన ముఖ్య అతిధుల్లో ఒక ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి వచ్చిన వారు. అంతకుముందు ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, శ్రీమద్రామానుజుని నిర్మాణానికి పూర్తిగా సహకరించారు. కాని అర్థం పర్థం లేని రాజకీయాల ఆటల వల్ల సమతా మూర్తి ఆవిష్కరణకు చంద్రశేఖర రావును రానివ్వలేదు. (చిన్న జీయర్ స్వామి సహాయ సహకారాలతో యాదగిరిగుట్ట (యాదాద్రి) చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పునర్నిర్మించారు). ఆ మోడీగారు శ్రీమద్ జగద్గురువు రామానుజాచార్యులు అందరూ సమానమని అంటూ గోపురం మీద ఎక్కి సమానత్వం గురించి సమాన మంత్రాన్ని చెప్పిన వాడు అని చెప్పిన విషయం చాలామందికి తెలియదు. ఆ మోదీ వివరంగా రామానుజన్ గొప్పతనం వివరించారు. కానీ బీజేపీ వారికి, పాపం తెలియదు. చదవరు. అది పోనీయండి. ఎవరినైతే తిడుతున్నారో ఆ శ్రీరామానుజుని మీద గద్దర్ అద్భుతమైన పాట కట్టారు, సమతా మూర్తి ఎదురుగా ఆడిన వాడు. ఆధ్యాత్మికం ఒక మార్గం, మనసుకు సంబంధించిన మరో మార్గం కూడా ఉన్నదని, చిన్న జీయర్ స్వామి తో చర్చించినవాడు గద్దర్.

గద్దర్ విశిష్టాద్వైతం

‘‘అంకెలలో ఒకటి సున్నా అంటున్నారు. దాని పేరు పూర్ణం అంటం. కానీ ఇంకో పేరు సంపూర్ణం. ఇటు అంటం అటు ఎటమటం, సమంగమైతే కల్యాణం ఇదే విశిష్టాద్వైతం’’ అని తపన పడి, సంఘర్షణ పడినప్పుడే ఈ పాట పుట్టింది అని గద్దర్ ఇంటర్వ్యూలో చెప్పారు. (అది యూట్యూబ్ లో ఆ ఆటను పాటను కూడా విని చూడవచ్చు.) అంటూ విశిష్టాద్వైతం అనే రామానుజన్ సిద్ధాంతం చిన్న చిన్న పదాలతో వివరించిన వారు గద్దర్. జైరామానుజం జైజై రామానుజం అని సమతామూర్తి పాట పాడారు. దేవుని ప్రసాదం పాతదని పాడేస్తారు కాని పది మందికి ఇవ్వడం మంచిది రామానుజుడు వెయ్యేళ్ల కిందటనే చెప్పినాడు. దేవుడిని మోసిన, పల్లకి బోయీలకు మోక్షం ఎందుకు రారని రామానుజుడు అడిగిండని గద్దర్. రామానుజుని గురువు గోష్టి పూర్ణ గారు అది అతి రహస్యం అంటూ 18 సార్లు శ్రీరంగం నుంచి తిరుగోష్టీయూరు గ్రామం నడిచి, అక్కడి గుడి గోపురం ఎక్కి రామానుజాచార్యులు నారాయణ మంత్రాన్ని అందరికీ చెప్పినాడు. అందుకే ఆయన జగద్గురువైనాడు. రహస్యమయిన మంత్రాన్ని సమాచార హక్కు ఇచ్చిన వారు రామానుజుడు. అని గద్దర్ ఈ పాటలో ప్రస్తావించాడు. ‘తిండి బట్ట గూడు ఇవ్వాలె. కానీ వాటితో పాటు మేధస్సు కూడా పంచాలె. జ్ఞాన సిద్ధాంతం కూడా పంచాలె’ అని గద్దర్ వివరించాడు. మనం తిండికి పోరాడినట్టే ఇతిహాసం పంచినట్టు. ఆర్థిక విప్లవం వలె, అమావాస్య ఉన్నట్టు, పున్నమి కూడా ఉన్నట్లు. మనస్సుకు తిండి మేధ కావాలె. తపస్సు కావాలి, జంతువుకు తిండి ఇస్తే చాలు. కాని ఆలోచనలు ఉంటాయి. మనిషికి సాధన ఉంటుంది కద. తాత్విక ఉద్యమం కూడా అవసరం. సిద్ధాంతం ఘర్షణ అవసరం విభిన్న పార్శ్వాలు ఉంటాయి. ఆ మేధావి అని రామానుజుడు ఆ విషయం జ్ఞాపకం చేస్తాడు. మానవత్వాన్ని గుర్తు చేస్తాడు. అందుకే రామానుజుడు విశిష్ట వ్యక్తి. ఆ సమతా మూర్తి శిల్పంలో మహామనిషి రామానుజాచార్యుడు అని గద్దర్ వివరించారు. ‘‘రండిరో రండిరో

రామానుజా జాతరకు

రండిరో పరమాత్ముని

చూడడానికి రండిరో,

సమత మమత విశిష్టాద్వైతం

చూసుకొండిరో, వినండిరో’’

అని గొంగడి కట్టి ఆకట్టుకున్నాడు గద్దర్. సమాజంలో ఇందుకీ గోడలు, గొడవలు, అంటరాని వారనే మనుషులనీ మానవత్వంతో ఆదరించిన వాడు, అన్నం అందరూ సమానంగా తింటే తప్పేమిటి అని చెప్పినవాడు రామానుజుడని గద్దర్ వివరించారు. మనసొక సాగరం. అక్కడ ఎదురీత తప్పదు. దేవునికే మేల్కొలుపులు పలికినాడు, లేచి రమ్మన్నాడు పిలిచినాడు. మనిషిని మేలుకొన్నాడని రామానుజుడన్నాడు. తనకు జీయర్ స్వామిని కలిసి మాట్లాడిన తరువాత ‘దేవుడు ప్రకృతి భక్తుడు విలీనం చేస్తే విశిష్టాద్వైతం’ అని గద్దర్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి గద్దర్ గురించి పద్మ గురించి.

Read More
Next Story