శతజయంతి సంవత్సరంలోకి  పబ్లిక్ సర్వీస్ కమిషన్
x

శతజయంతి సంవత్సరంలోకి పబ్లిక్ సర్వీస్ కమిషన్

మంచి పరిపాలన కోసం బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేసిన కొన్ని ఉత్తమ సంస్థల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి.

 &

కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతజయంతి ఉత్సవాలు 2025 అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి మొదలుకానున్నాయి. మంచి పరిపాలన కోసం బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేసిన కొన్ని ఉత్తమ సంస్థల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి. తొలుత 1926 అక్టోబర్ ఒకటవ తేదీన ఏర్పాటు చేసిన ఫెడరల్ సర్వీస్ కమిషన్ కు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది.

‘శృతి’ , ‘స్మృతి’ వంటి అనేక విధాలు, ‘దయబాగా’ , ‘మిటాక్షరి’ వంటి విధానాల సంకలనాల వల్ల స్థానిక భారతీయుల్లో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఫలితంగా బ్రిటిష్ పాలకులు, భారత దేశంలో బ్రిటిష్ చట్టాలను అమలు చేయడానికి అవసరమైన నిర్మాణానికి కావలసిన విధి విధానాలను సిఫారసు చేయడానికి మెకాలేని పిలిపించారు. ‘భారత దేశ పరిస్థితులకు తగినట్టు, బాగా విద్యావంతులైన, ఉదార స్వభావం కల మంచి పౌర సేవాధికారులు కంపెనీకి కావాలి’ అని మెకాలే కమిటీ సిఫారసు చేసింది.

బ్రిటిష్ పాలకులు తమకు విశ్వాసపాత్రులైన ఏజెంట్లుగా ఇండియన్ సివిల్ సర్వీసెస్(ఐసీఎస్)ను అభివృద్ధి చేశారు. లండన్ లో ఐసీఎస్ అధికారులకు శిక్షణనిచ్చి భారతదేశానికి పంపారు. మెకాలే కమిటీ నివేదిక తరువాత అప్పటివరకు సరిగా లేని విధానానికి బదులుగా సివిల్ సర్వీస్ ను ప్రవేశ పెట్టారు. పన్నులు వసూలు చేయడానికే చాలా మటుకు సివిల్ సర్వేంట్స్ ను కొన్ని ప్రాంతాల్లో నియమించారు. వారికి డెప్యూటీ కలెక్టర్/జిల్లా మేజిస్ట్రేట్ అని నామకరణం చేశారు.

పన్నులు వసూలు చేసే విధానాన్ని బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టింది కాదు. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ -1 కు సమకాలికుడైన అక్బర్ ప్రవేశ పెట్టిన విధానం ఆధారంగా పన్నులు వసూలు చేసే విధానం సాగుతోంది. మధ్యయుగాల్లో అక్బర్ పెంచి పోషించిన మునసబుదారి విధానంతో పాటు,పౌర సేవలో పన్నులు వసూలు చేయడంలో తో పాటు భూ సంస్కరణలు కూడా అవసరమని బ్రిటిష్ వారు భావించారు.

బ్రిటిష్ పరిపాలనా 19వ శతాబ్దంలో అమలులోకి రావడంతో, శాంతి భద్రతల పరిరక్షణకు, పన్నుల వసూలుకు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా కొనసాగింది ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీల నుంచి భారత పరిపాలనాధి కారులను తీసుకోవడంతో అదొక అత్యున్నత వ్యవస్థగా తయారైంది.

భారత దేశంలో స్వాతంత్ర్యోద్యమం ప్రారంభంకావడంతో బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటుచేసి, దాని ద్వారా భారతీయులను ఐసీఎస్ అధికారులుగా ఎంపిక చేయడం మొదలు పెట్టింది. సివిల్ సర్వీసెస్ అధికారుగా ఒక గౌరవాన్ని కల్పించడానికి యాభై శాతం మందిని భారతీదేశం నుంచి, మిగతా యాభై శాతం మందిని లండన్ నుంచి ఎంపిక చేయడం మొదలు పెట్టారు.

తొలి రోజుల్లో ఐసిఎస్ పరీక్షలు లండన్ లోనే నిర్వహించడం వల్ల ఆ అవకాశం కొద్ది మందికి మాత్రమే లభించింది. సుభాష్ చంద్రబోస్ 1920లో ఐసిఎస్ పరీక్షల్లో నాల్గవ స్థానంలో నెగ్గి, 1921లో దానికి రాజీనామా చేశారు. యూపీఎస్ సి మ్యూజియంలో ఆయన దరఖాస్తును ఇప్పటికీ మనం చూడవచ్చు.

పబ్లిక్ సర్వీస్ కమిషన పుట్టుక

సర్వీసు విషయాలను క్రమబద్దీకరించడానికి శాశ్వత ప్రాతిపదికపైన అధికారులను నియమించడం కోసం భారత ప్రభుత్వం 1919 మార్చి 5వ తేదీన భారత రాజ్యాంగ సంస్కరణలలో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రాథమికంగా సర్వీసు విషయాలను క్రమబద్దీకరించడానికి 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కొందరు సభ్యుల బృందానికి ఒక రూపాన్ని తెచ్చింది.

భారత దేశంలో ప్రజాసేవను క్రమబద్దీకరించడానికి భారత పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపనకు ఈ చట్టంలోని 96సి అవకాశం కల్పిస్తుంది. స్టేట్ కౌన్సిల్లో కార్యదర్శి ద్వారా తయారైన నిబం ధనల ద్వారా ఇది పనిచేస్తుంది.(యూపీఎస్ సి 2022 వార్షిక నివేదిక). భారత ప్రభుత్వ చట్టం 1919 అమలులోకి వచ్చాక, యూపీఎస్సి పనిచేసే విధానానికి, దానికి అవసరమైన కమిటీని ఏర్పాటు చేయడానికి సంబంధించి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కు, భారత ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సుదీర్ఘంగా సాగాయి.

ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు నాలుగు సంవత్సరాలు జరిగినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో సివిల్ సర్వీసెస్ ను పర్యవేక్షించే భారతేదశంలోని అత్యున్నతమైన రాయల్ కమిషన్ (లీ కమిషన్ )కు నివేదించారు. స్వాతంత్ర్య సమర యోధుల నుంచి ఒత్తిడి రావడంతో, భారత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు భారత ప్రభుత్వ చట్టం 1919 గుర్తించినందున ఆలస్యం చేయకుండా వెంటనే దానికి బాడీని ఏర్పాటు చేయాలని లీ కమిషన్ 1924 మార్చి 27వ తేదీన విడుదల చేసిన తన నివేదికలో స్పష్టం చేసింది.

అయితే, 1926 అక్టోబర్ వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. బ్రిటన్ హోమ్ సివిల్ సర్వీస్ సభ్యుడు సర్ రోజ్ బార్కర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు, ఎలక్షన్ కమిషన్ లాగా యూపీఎస్ సీ కూడా రాజ్యాంగ సంస్థగా ఏర్పడింది.

భారత ప్రభుత్వ చట్టం 1935లో తొలిసారిగా పదవ భాగంలోని సెక్షన్ 3 ననుసరించి సర్వీస్ కమిషన్, న్యాయవ్యవస్థ సెక్షన్ 9లో వచ్చింది. అప్పటి వరకు ఐసీఎస్ అధికారులను జడ్జిలుగా నియమించేవారు(సెక్షన్ ఆర్టికల్ 312ఏ). భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1937 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దాంతో అప్పటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్రంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా అవతరించింది.

స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 నుంచి ఫెడరల్ పబ్లిక్ కమిషన్ కు రాజ్యాంగ హోదా లభించి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా నామకరణం పొందింది. రాజ్యాంగంలోని 315-323 అధికరణాలు యూపీఎస్ సీకి కేటాయించారు. వాస్తవానికి 310, 311, 312 అధికరణాలు కూడా యూపీఎస్ సీకి సంబంధించినవే.

సర్వీస్ కమిషన్ విధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారుల నియామకానికి అవసరమైన పరీక్షలు నిర్వహించడం గురించి 320 అధికరణం వివరిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే అఖిల భారత సర్వీసులు సహా అధికారులందరి క్రమశిక్షణకు సంబంధించిన నియమాల షరతులను రాజ్యాంగంలోని (3) (సి) అధికరణం తెలియచేస్తుంది. వీరికి సంబంధించిన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తుంది.

రిటైరైన ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ ఆపాలన్నా, ఉపసంహరించుకోవాలన్నా సర్వీస్ కమిషన్ ను సంప్రదించాకనే రాష్ట్రపతి సైతం ప్రతిపాదించవలసి ఉంటుంది. క్రమశిక్షణకు సంబంధించిన కేసుల గురించి మంత్రులు కానీ, విభాగాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కమిషన్ ను సంప్రదించవలసి ఉంటుంది. యూపీఎస్ సికి పునర్విచారణ చేసే అధికారం ఉంటుందనేది దృష్టిలో పెట్టుకునే, ఏఐఎస్, సీసీఎస్ - సీసీఏ సర్వీసు నిబంధనలను రూపొందించారు.

మితిమీరిన పనిభారం

పైన పేర్కొన్నట్టు యూపీఎస్ సి చేపట్టవసిన బాధ్యతలు చాలానే ఉన్నాయి. తాజా 2022 వార్షిక నివేదిక ప్రకారం, నియామక నిబంధనల ప్రకారం సర్వీస్ కమిషన్ పదహారు రకాల పరీక్షలను నిర్వహించవలసి ఉంటుంది. వీటిలో పదమూడు పరీక్షలు సివిల్ సర్వీస్ అధికారుల కోసం, మూడు రక్షణ శాఖ కోసం నిర్వహించవలసి ఉంటుంది. ఈ విడత 2022లో వీటి కోసం 29 లక్షల 91 వేల, 842 దరఖాస్తులు రాగా, సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం 4,256 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయగా, రక్షణ శాఖ కోసం 22 వేల 842 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు.

రక్షణ శాఖలో ఇంటర్వ్యూలను రక్షణ శాఖకు చెందిన సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహిస్తుంది. వివిధ ఉద్యోగాల్లో నియమించడానికి మొత్తం 3వేల 559 మంది అభ్యర్థులను సిఫారసు చేసింది. సివిల్ సర్వీస్ పోస్టుల కోసం రిజర్వులొ పెట్టిన 116 మంచి పేర్లు సహా మొత్తం 1,940 మంది అభ్యర్థులను సిఫారసు చేసింది. రక్షణ శాఖ కోసం 1,619 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.

కమిషన్ చేపట్టే ప్రధాన కార్యక్రమాల్లో ప్రత్యక్ష నియామకానికి ఎంపిక, ప్రమోషన్ల కోసం, డెప్యుటేషన్ కోసం, విభాగాల్లో విలీనం కోసం ఎంపిక చేయడం, నియామక ఎంపిక నిబంధనలు, క్రమశిక్షణ కేసుల వంటివి చూడడం ముఖ్యమైనవి. సివిల్ సర్వెంట్ల పైన 1950లో 53 క్రమశిక్షణా కేసులు రాగా, 2022లో అవి 800కు పెరిగాయి.

రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యం, సమానావకాశాలన్న దాని విశాల సూత్రాల ననుసరించి, సుదీర్ఘ కాలం సాగిన బ్రిటిష్ పాలనలో సివిల్ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థుల్లో అత్యధికులు ఉన్నత వర్గాల నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలకు చెందినవారే. ఒక స్థాయిలో తమకు విశేషాధికారాలున్న వారమనే భావన వీరిలో ఏర్పడింది. ఉన్నత వర్గాలకు చెందిన వారు మాత్రమే వీటికి తగుదురనే ధోరణి ఏర్పడింది(సంతోష్ గోయల్ పత్రం చూడండి).

తమ పరిమితులేమిటో గమనించిన అధికారుల వర్గం అనేక రకాలుగా ఆలోచించి, ఏ సంస్కరణ చేపట్టాలన్నా పాలకవర్గం అనుమతి కావాలని ఆనాడున్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలనే అవగాహనకు వచ్చింది. మేధావులు దీన్ని విశాల దృష్టితో అంగీకరించడంతో, క్రమంగా తమ గత ధోరణులను వదిలేసి విశ్వవ్యాపితమైన సివిల్ సర్వీసు విధానంగా రూపుదాల్చింది.

యూపీఎస్ సి, సవిల్ సర్వీసుల నిర్మాణం

అఖిలభారత సర్వీసులు, కేంద్ర సర్వీసులు, రాష్ట్ర సర్వీసులనే మూడంచెలుగా సివిల్ సర్వీసుల నిర్మాణం ఏర్పడింది. అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్ర , ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వాల్లో అధికారులుగా వివిధ విభాగాల్లో నియమిస్తుంది. ఫారిన్ సర్వీస్ అధికారులను దౌత్య రంగాలలో, అంతర్గత సంస్థాగతమైన వాటిలో నియమిస్తుంది. రాష్ట్ర సర్వీసు అధికారులను రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాల్లోని శాఖల్లో పనిచేయడానికి నియమిస్తారు. యూపీఎస్ సీ ద్వారా కేంద్ర సివిల్ సర్వీసులలోకి వెళ్ళడానికి వారికి కోటా ఉంటుంది.

ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, దేశంలో దేశ సమగ్రతను కాపాడడంలో సివిల్ సర్వెంట్లు క్షేత్ర స్థాయిలో పనిచేసే అసలు సిసలైన సేవకులు. ఉదాహరణకు గ్రామంలో పనిచేసే సబ్ పోస్ట్ మాస్టర్ లు భారత ప్రభుత్వ ప్రతినిధిగా దేశం మొత్తాన్ని ఒకే యూనిట్ గా భావించి, సంబంధాలను ఏర్పాటు చేస్తారు. పన్నులు వసూలు చేయడం, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం వంటివి కేంద్ర స్థాయిలో చేసినట్టుగానే, రాష్ట్ర స్థాయిలో కూడా చేపట్టడం భారత సర్వీస్ అధికారుల కర్తవ్యం.

దేశ వ్యాప్తంగా జిల్లా అనేది పరిపాలనకు సంబంధించిన ఒక యూనిట్. పార్టమెంటు లాగానే, రాష్ట్ర స్థాయిలో శాసన సభ చేసిన చట్టాలను సివిల్ సర్వీసు అధికారులు దేశ వ్యాప్తంగా అమలు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను సివిల్ సర్వెంట్స్ గా భావించారు. వారికి వారి స్వంత నిబంధనలు, నిర్మాణాలు ఉంటాయి. పరిపాలనా స్థాయి అధికారులలో కొందరిని సివిల్ సర్వెంట్ ల నుంచి డెప్యుటేషన్ పై తీసుకుంటారు. కేంద్రం, కేంద్ర సివిల్ సర్వెంట్స్ గ్రూప్ ఏ కింద యూపీఎస్ సి ద్వారా నిమమితులవుతారు. బి,సి,డి, కేంద్ర సెక్రెటేరియట్ ఉద్యోగులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎంపిక చేస్తారు. (పనిభారాన్ని అనుసరించి కొందరు యూపీఎస్ సి అధికారులను బదిలీ చేస్తారు.)

సివిల్ సర్వెంట్స్ అనే వర్గం భారత దేశంలో అంతర్గతంగా విభిన్నమైంది. బ్రిటిష్ పాలనా కాలంలో ఒక గౌరవ ప్రదమైన సేవలుగా ఉన్న ఐసిఎస్, స్వాతంత్ర్యానంతరం కూడా అలాగే కొనసాగింది. విద్యార్హత, మెరిట్ ప్రాతిపదికగా సివిల్ సర్వీసులకు ఎంపిక చేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో సమతౌల్యత లేకపోవడం వల్ల అది విశ్వవ్యాపితం కాలేదు.

విద్యావకాశాలు, ముఖ్యంగా ఉన్నత విద్యావకాశాలు పట్టణాలకు పరిమితమయ్యాయి. సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరవడానికి 21-24 ఏళ్ళ మధ్య వయస్సు ఉండడమే కాకుండా, కనీస విద్యార్హత డిగ్రీగా నిర్ణయించారు. సివిల్ సర్వీస్ పరీక్ష కూడా ఇంగ్లీషులో నిర్వహిస్తారు. ఈ నిబంధనల వల్ల సాధారణ పౌరులు, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న వారు ఈ పరీక్షల్లో నెగ్గలేకపోతున్నారు.

సివిల్ సర్వీసు పరీక్షల సంస్కరణల సిఫారసు కోసం ప్రభుత్వం 1976లో కొటారికమిషన్ ను నియమించింది. ఈసంస్కరణలను అమలు చేయడం వల్ల ప్రభుత్వం పట్టణ ప్రాంత ఆశావహులతో సమానంగా గ్రామీణ ప్రాంత ఆశావహులకు కూడా సమానావకాశాలను యూపీఎస్ సి ద్వారా కల్పించింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు మినహా, మిగతా వారికి వారి వారి సామాజిక నేపథ్యం వల్ల చెప్పుకోదగ్గ న్యాయం జరగలేదు.

(ఇంకా ఉంది)

Read More
Next Story