రాహుల్ గాంధీ అడుగులు హర్యానాలో ఎందుకు తడబడ్డాయి ?
x

రాహుల్ గాంధీ అడుగులు హర్యానాలో ఎందుకు తడబడ్డాయి ?

జమ్మూ కాశ్మీర్, హర్యానా శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మిశ్రమ ఫలితాలు సాధించింది. ముఖ్యంగా కచ్చితంగా గెలుస్తామని గంపెడు ఆశలు పెట్టుకున్న హర్యానాలో..


ఇటీవల వెలువడిన శాసనసభల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమి, అనుకున్న స్థాయిలో ప్రతిభ కనపరచకపోవడంతో షాక్ తింది. ఇప్పుడు పార్టీలో గణనీయమైన మార్పులను అమలు చేయడానికి సమాయత్తం అవుతున్నట్లు సంకేతాలు వెలువరిస్తోంది. ఇందులో ముఖ్యమైన చర్య కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి రాహుల్ గాంధీ మరింత ప్రముఖ పోషిస్తారని టెన జన్ పథ్ వర్గాల మాట.

రాజకీయాలంటే అయిష్టం చూపే నాయకుడిగా రాహుల్ గాంధీకి పేరుంది. ఇదే విపరీతంగా ప్రచారం జరిగింది. రాజకీయాల్లో అనుభవలేమి, హిందూత్వ రాజకీయాలు బలం ఫుంజుకోవడం, పార్టీ వరుసగా ఓడిపోవడంతో అతను విమర్శకులకు కేంద్రంగా మారాడు. గట్టి వాగ్థాటి లేకపోవడం, రాజకీయ రంగంలో ప్రత్యర్థులను సరిగా ఎదుర్కొలేక పోవడం అతను అసమర్థుడు అనే ఇమేజ్ ను సృష్టించాయి. చాలా మంది రాజకీయ విశ్లేషకులకు అతను కాంగ్రెస్ కు బాధ్యతగా, ప్రత్యర్థికి ఆయుధంగా మారాడని విశ్లేషించారు.
రాహుల్ కోసం చేయవలసినవి
ఈ విమర్శలు ఎదుర్కోవడానికి, రాజకీయ అవగాహన పెంచుకోవడానికి రాహుల్ దేశ వ్యాప్తంగా విస్తృతమైన పాదయాత్రలు చేపట్టాడు. ఈ చర్యలు అతను ఓ నాయకుడిగా ప్రజలు గుర్తించడానికి సహాయపడింది. దీని వల్ల విమర్శల జడివాన కొద్దిగా తగ్గినప్పటికీ అతని రాజకీయ జీవితంలో కొన్ని ప్రారంభ మార్పులు సూచించాయి.
ఆర్‌ఎస్‌ఎస్ విస్తృతమైన క్షేత్రస్థాయి నెట్‌వర్క్ మద్దతుతో బిజెపి వంటి బలీయమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్న కాంగ్రెస్ తన సంస్థను పునాది నుంచి పునర్నిర్మించుకోవాలి. ఇప్పటికే తమ విధేయులతో నిండి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్య కొంచెం కష్టమైన పని. అతని మిత్రులను పరిశీలిస్తే వారంతా వారసత్వ రాజకీయాలు నుంచి వచ్చిన వారే. అయితే వీరంతా పార్టీని సామాజిక ఆర్థిక సంక్షోభాలు ముట్టడించినప్పుడు కాంగ్రెస్ ను విడిచిపెట్టి వెళ్లిన వారే.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విస్తృత సామాజిక సంకీర్ణాల ఏర్పాటుపై రాహుల్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీనికి రాష్ట్ర-స్థాయి రాజకీయాల్లో అతని చురుకైన ప్రమేయం అవసరం, నాయకులు వారి ప్రయోజనాలపై ఆధారపడి పనిచేయకుండా పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
ఉదాహరణకు, హర్యానాలో, కుమారి సెల్జా వర్గానికి చెందిన దళిత మద్దతుదారులను భయపెట్టిన వ్యక్తిగా భూపీందర్ సింగ్ హుడా కనిపించాడు. అతని నేతృత్వంలోని ఆధిపత్య జాట్‌లపై ఎక్కువ ఆధారపడటం బహుశా ఇతర వర్గాలను దూరం చేసింది. అన్ని రాజకీయ పార్టీలలో సామాజిక వైరుధ్యాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌లోని విభేదాలు తేలికగా హైలైట్ అవుతున్నాయి.
నిర్ణయాత్మక నాయకత్వం అవసరం..
కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవాలంటే రాహుల్ తన నాయకత్వాన్ని నిర్ణయాత్మకంగా నిలబెట్టుకోవాలి. రాష్ట్ర నాయకులు స్వయంప్రతిపత్తిని అనుమతించినప్పటికీ, క్లిష్టమైన సమయాల్లో కేంద్ర కమాండ్ ద్వారా మార్గనిర్దేశం చేయబడే బిజెపి విధానం వలె కాకుండా, కాంగ్రెస్ తరచుగా రాష్ట్ర విభాగాలను స్వతంత్రంగా పనిచేయడానికి వదిలివేస్తుంది.
ఈ పర్యవేక్షణ లోపం కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ వంటి నాయకులలో మితిమీరిన విశ్వాసానికి దారితీసింది, ఫలితంగా ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగిలాయి. వారందరూ ఎక్కువ వాగ్దానాలు చేస్తారు కానీ చాలా తక్కువగా ప్రజలకు ఇచ్చారు.
ఆధునిక ఎన్నికల నిర్వహణ సంక్లిష్టత సైనిక వ్యూహాలకు సమానమైన స్థాయిలను కలిగి ఉంది. వాటికి వాస్తవ సమయ జోక్యాలు అవసరం. ఎన్నికల కథనాలను రూపొందించడంలో, ఓటర్ల అవగాహనలను ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా, మాస్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నందున, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి తన విధానాన్ని మార్చుకోవాలి.
హర్యానా ఎన్నికలు ఈ అవసరాన్ని ప్రదర్శించాయి. కాంగ్రెస్, బిజెపిల మధ్య ఒకే విధమైన ఓట్ షేర్లు ఉన్నప్పటికీ, ఉన్నతమైన మేనేజ్‌మెంట్ బిజెపికి ఎక్కువ సీట్లు పొందేందుకు తిరిగి అవసరమైన మెజారిటీకి అవి అధికారం దక్కించుకోవడానికి కారణమైమయ్యాయి.
చర్యలు చాలా తక్కువ, చాలా ఆలస్యం
కేవలం ఆరు నెలల క్రితమే, మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో భాజపా అంతగా తెలియని నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా నియమించింది. పార్లమెంటు - అసెంబ్లీ ఎన్నికలకు నెలల ముందు ప్రారంభించిన ప్రమాదకర చర్య, అధికార వ్యతిరేక ఓట్లను తగ్గించడానికి రూపొందించబడింది. దళితుల ఓట్లను పొందేందుకు పోలింగ్‌కు ముందే స్వయం ప్రకటిత దైవం గుర్మీత్ రామ్ రహీమ్‌కు వ్యూహాత్మక పెరోల్ మంజూరైంది.
దళితుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించడం ద్వారా రాహుల్ దీనికి తగ్గట్టుగా ప్రయత్నించారు. ఆశ్చర్యకరమైన చర్యగా, తిరుగుబాటు దళిత నాయకుడు అశోక్ తన్వర్ బిజెపిని విడిచిపెట్టి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. చివరి నిమిషంలో ఐక్యత ప్రదర్శనగా, రాహుల్ బహిరంగ ర్యాలీలో హుడా, సెల్జా చేతులు కలిపారు.
ఇదంతా చాలా ఆలస్యంగా రుజువైంది.
కాంగ్రెస్ దాని ఇటీవలి పరాజయాలను సరిగ్గా బేరిజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాబోయే ఎన్నికలకు వ్యూహాత్మకంగా సిద్థం కావాలి. సూక్ష్మ-నిర్వహణ వ్యూహాలతో స్థూల వ్యూహాలను మిళితం చేసే సమగ్ర ప్రణాళిక అవసరం. ఎన్నికల యంత్రాంగంపై ఫిర్యాదులకు అతీతంగా ముందుకు సాగుతూనే గెలుపు ఓటములకు బాధ్యత వహించి రాహుల్ ముందుండి నడిపించాలి.
తండ్రి నుంచి పాఠాలు
రాహుల్ తన సొంత వారసత్వం నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ పార్టీ- పరిపాలనపై పట్టు సాధించగలిగినప్పటికీ, రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ తన సొంత పార్టీ సభ్యులతోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆఖరి రోజుల్లో ఇందిర నిరంకుశంగా మారి దానికి మూల్యం చెల్లించుకోగా, ప్రధాని పదవిని పెద్ద పీట మీద వేసిన రాజీవ్ దానిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ఒక అయిష్ట రాజకీయ నాయకుడు, అతను తన రాజకీయ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి సమయం తీసుకున్నాడు కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది.
ముగింపులో, కాంగ్రెస్ పునరుజ్జీవనానికి రాహుల్ నాయకత్వం కీలకం, ఇది పార్టీని కలిసి ఉంచే 'గాంధీ' ట్యాగ్. పునరుత్థానమైన బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి ద్వారా ఎదురయ్యే సవాళ్లను పార్టీ నావిగేట్ చేస్తున్నందున, జవాబుదారీతనం, నియోజక వర్గాలతో చురుకైన కలయిక నొక్కి చెప్పడం చాలా ముఖ్యమైనది. భారత రాజకీయాల్లో కాంగ్రెస్ తన స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నందున ఇది నిర్ణయాత్మక నాయకత్వానికి సమయం.
Read More
Next Story