
Photo Source: United Nations News
'లేబర్ కోడ్స్' పొట్ట విప్పి చూడ....
కేంద్రం 29 కార్మికచట్టాల్ని మార్చివేస్తు 4 లేబర్ కోడ్స్ తెచ్చింది. ఈ కోడ్స్ ఎవరి కోసమో, ఎలా తయారయ్యాయో చెబుతున్నారు మార్పు శరత్
— మార్పు శరత్
మూసివేత, లాకౌట్, కార్మికుల తొలగింపు, మనకు తరచుగా వార్తలలో కనిపించే సంగతులు. ఇన్ని దశాబ్దాల పారిశ్రామిక ప్రగతి తరువాత కూడ మనది వ్యవసాయ ప్రధాన దేశం. ఆంధ్రప్రదేశ్ దేశ సగటు కంటే ఎక్కువగా వ్యవసాయాధారమైన ప్రాంతం. ఇక్కడున్న ఫ్యాక్టరీలే తక్కువ. శ్రామిక జనాభాలో ఫ్యాక్టరీ కార్మికుల సంఖ్య మరీ తక్కువ. ఆ కొద్ది రాశిలో ఉన్న మిల్లులు మూతపడడం, 'ఖాయిలా పడి కార్మికులను తొలగించి ఇంటికి పంపించడం, కార్మికులకు పని చూపించలేక లేఆఫ్ చేయడం, సహజంగానే ఆందోళన కలిగించే విషయాలు.
పరిశ్రమలు అనేవి వ్యవసాయం కన్న, చేతి వృత్తుల కన్న భిన్నమైన ఉత్పత్తి ప్రక్రియ మాత్రమే కాదు. సాంకేతికంగా వాటికన్న ఉన్నతమైన ప్రక్రియ. ఒక మనిషి ఒక గంటసేపు పని చేస్తే వచ్చే ఉత్పాదన సంప్రదాయక ఆర్ధిక రంగం కంటే ఆధునిక రంగంలో రెండు రెట్లు, అయిదు రెట్లు, పది రెట్లు, వందరెట్లు ఎక్కువ ఉండగలదు. అందుకే పేద దేశాలలో ప్రజలను ఫ్యాక్టరీలు అంతగా ఆకర్షిస్తాయి. అవి మొత్తం సమాజం జీవన ప్రమాణాలను పెంచుతాయి.
జీవన వైవిధ్యాన్ని పెంచుతాయి. వాటిలో పని చేసే కార్మికులు పాలంలో కూలి చేసిన తమ తలిదండ్రుల కంటే అనేక రెట్లు ఎక్కువ వేతనం సంపాదిస్తారు. వారి జీవన ప్రమాణమే కాదు. వారి ఉత్పాదన శక్తి కూడ పెరుగుతుంది. వారి సాంకేతిక సామర్ధ్యం, విజ్ఞానం పెరుగుతాయి. అందుకే పరిశ్రమల వల్ల ఎన్ని ఇబ్బందులున్నా మాకు పరిశ్రమలు కావాలి' అని పేద ప్రజలు కోరుకుంటూనే ఉంటారు. పరిశ్రమల వల్ల పర్యావరణ కాలుష్యం, అనారోగ్యం, జనావాసాల తరలింపు, తదితర సమస్యలనేకం ఉన్నాయి. వాటిని పారిశ్రామిక ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ ఉంది. అయినప్పటికీ తమ జీవన ప్రమాణాన్నీ ఉత్పాదన శక్తినీ పెంచుకు ఇతోధికంగా మెరుగయిన జీవితాన్ని పొందవచ్చుననే హేతు బద్ధమైన, న్యాయమయిన ఆకాంక్ష వ్యవసాయకదేశాలు పారిశ్రామిక అభివృద్ధిని కాంక్షిస్తాయి.
ప్రజల జీవన స్థాయిలోను, శ్రమజీవుల ఉత్పాదన సామర్థ్యంలోను, సాంకేతి నైపుణ్యంలోను పారిశ్రామిక ప్రగతి తీసుకు రాగల మార్పును ప్రమాణంగా పెట్టుకొని చూసినప్పు పారిశ్రామీకరణ అనే దాని పట్ల ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని పెంపొందించుకోగలుగుతాము పారిశ్రామిక ప్రగతితో పెట్టుబడిదారులు, ప్రభుత్వఅధికారులూ, రాజకీయ నాయకులు ఆటలాడుతుంటే ప్రజల ఇతోధిక అభివృద్ధికి హానికరం అవుతుంది అని గుర్తించ గలుగుతాము.. కర్మాగారాలను నెలకొల్పడం, మూసివేయడం, కార్మికులను పనిలోకి తీసుకోవడం, తొలగించివేయడం, పెట్టుబడిదార్ల లాభాల వేటలో ఎత్తుగడలు మాత్రమే కావడానికి వీలు లేదని ఆ వైఖరి అప్రజాస్వామిక మనీ అనగలుగుతాం.
ఈ నేపధ్యంలో భారతదేశంలో ఉన్న కాస్తో కూస్తో అవకాశాలను మెరుగుపరచుకోడానికి వందల ఏళ్లుగా భారతకార్మికరంగం అనేక పోరాటాలు చేసింది, చేస్తూనే ఉంది. ఆ పోరాటాల్లోంచి సాధించుకున్నవే నిన్నటివరకూ ఉన్న కార్మిక చట్టాలు. ఇప్పుడు కార్మికులు అనేక పోరాటాలద్వారా సాధించుకున్న ఆచట్టాల్ని తోసిరాజని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏకంగా 29 కార్మికచట్టాల్ని మార్చివేస్తు 4 లేబర్ కోడ్లుగా తెచ్చింది.
నిజానికి దీనిని సరళికరణగా ప్రచారం చెసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దీనివెనక కార్పొరేట్ కుట్ర ఉందనే విషయం మోదీ కరోనా సమయంలో ఈ కోడ్స్ రూపొందించి విడుదలచేసినప్పటి ప్రసంగంలోనే అర్ధమౌతుంది.
ఇది వ్యాపార సరళీకరణ (Ease of doing business) కోసం అనిచెప్తూ ఇకనుండి లేబర్ ఆఫీసర్ల పీడ విరగడైపోతుందని అన్నారు. కొంచం ఆలోచించ గలిగే వారికెవరికైనా లేబర్ ఆఫీసర్లు ఎవరికోసమో అర్ధమైపోతుంది. అది అర్ధమైతే ఈ కోడ్లు ఎవరి ప్రయోజనంకోసమో కూడా సులువుగానే అర్ధమౌతుంది.
ఈ కోడ్లు ఏవిధంగా తయారైనాయో చూడండి:
1. The code on wages.2019 :
I. Payment of Wages Act 1936
II. Minimum Wages Act, 1948
III. Payment of Bonus Act,1963
IV. Equal Remuneration Act 1976
పై నాలుగు చట్టల్నీ కలిపీ వేతనాలకు సంబంధించిన ఒక కోడ్ గా రూపొందించారు.
2. The Industrial Relations Code.2020
I. The Industrial Disputes ACT, 1947
II. The Trade Union Act 1926
III. The Industrial Employment (Standing Orders) Act, 1946
పై మూడు చట్టల్నీ కలిపీ పారిశ్రామిక సంబంధాలకు సంబంధించిన ఒక కోడ్ గా రూపొందించారు.
3. The Code on Social Security,2020
I. The employees compensation Act, 1923
II. The Employees State Insurance Act,1948
III. The Employees PF and Mislanious Provisions act 1952
IV. The Employment exchanges (Compulsory Notification of Vacancies) Act 1959
V. The maternity benefit Act 1961
VI. The Payment of Gratuity Act 1972
VII. The cine workers welfare fund Act 1981
VIII. The building and other construction workers `welfare Cess Act 1996
IX. The Unorganized workers Social Security Act 2008
పై తొమ్మిది చట్టల్నీ కలిపీ సాంఘిక భద్రతకు సంబంధించిన ఒక కోడ్ గా రూపొందించారు. నిజానికి ఇది factories act 1948 కు సంబంధించింది. దీన్ని సవరించాలంటే రాష్త్రపతి అనుమతి ఉండాలి. అది వారికి కష్టమైన పని కాకపోవచ్చు కాని, నిబంధనలు పాటించలేదు.
4. Code on Occupational Safety, Health and Working Conditions Code
I. 8 hour work/day with exceptions for different classes of establishments and employees, dependent on central government notification.
II. Removes clear definition of overtime: enables compulsory overtime without extra payment
III. No fixed standards for hazardous and dangerous working conditions, but to be fixed by central and state governments by notification
IV. Working, health and safety standards not determined by nature of work but arbitrarily through governmental discretion
V. Drinking water, toilets housing facilities, canteen etc. listed as ‘welfare’ facilities not to be mandatorily provided by employers but upon discretion of governments.
VI. For interstate migrant contractual workers. Employers to provide suitable working conditions, medical facilities, housing etc.
VII. Maternity benefits available only after minimum 80 days of work
పై ఏడు చట్టాల్నీ కలిపి భద్రత, పని ప్రదేశం లేదా ప్రమాదకరమైన పనిప్రదేశాలకు సంబంధించిన ఒక కోడ్ గా రూపొందించారు.
ఈ కోడ్ల వలన కార్మికులకి జరిగే నష్టాలేంటంటే
1. The code on wages.2019 & The Industrial Relations Code.2020
* ఈ చట్టం కింద తక్కువ కనీస వేతనం, అవసరాన్ని బట్టి కాకుండా సకాలంలో - రేటు మరియు పీస్ రేట్ ప్రాతిపదికన
* కనీస వేతనాల కొరకు నైపుణ్యం, పరిశ్రమ ఆధారిత వర్గీకరణను తొలగించడం. 'వర్కర్స్' కేటగిరీ నుంచి పర్యవేక్షక సామర్థ్యంలో నెలకు రూ. 18,000/- కంటే ఎక్కువ సంపాదించే వారిని మినహాయించడం
*సరైన ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా మినహాయింపులు ఇవ్వడానికి యజమానులకు అధికారం కల్పిస్తుంది.
2. Industrial Relations Code 2020
* ఫిక్సిడ్ టర్మ్ ఎంప్లాయిమెంట్"ను ఒక రకమైన కాంట్రాక్ట్ ఎంప్లాయిమెంట్ గా పరిచయం చేస్తుంది.
* 300 మంది కంటే ఎక్కువ మంది కార్మికుల లే-ఆఫ్ ల కేసులలో మాత్రమే ప్రభుత్వాలకు తొలగింపు నోటీసు, దీనిని తగిన ప్రభుత్వం మరింత సవరించవచ్చు. ఒకవేళ ప్రభుత్వం 60 రోజుల్లోపు నోటీసుకు ప్రతిస్పందించనట్లయితే డీమ్డ్ అప్రూవల్
ఫిక్సిడ్ టర్మ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని తొలగించడం అనేది "రిట్రెంచ్ మెంట్" కాదు.
3. Code On Social Security
* ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వ విచక్షణకు పిఎఫ్, పెన్షన్, బీమా, గ్రాట్యుటీ, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద పరిహారం మొదలైన వాటికి సంబంధించిన వాటితో సహా కార్మికుల కోసం సామాజిక భద్రతా పథకాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది.
* పిఎఫ్, బీమా మొదలైన వాటికి యజమాని కంట్రిబ్యూషన్ లను తగ్గించడం. మహమ్మారి ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో యజమాని కంట్రిబ్యూషన్ ను మరింత వాయిదా వేయడానికి లేదా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది
4. Occupational Safety, Health and working Conditions Code & Industrial relations
* ఆధార్ తో తప్పనిసరిగా లింక్ చేయబడ్డ బెనిఫిట్ లను యాక్సెస్ చేసుకోవడం, మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
* వ్యవసాయ, బీడీ , గృహోపకరణాల కార్మికులు కవర్ అవుతారా లేదా అనేది అస్పష్టంగా ఉంది, 'వేతన పరిమితి'కి మించి కార్మికులను మినహాయించే అవకాశం ఉంది.
* తొలగించిన కార్మికులను తిరిగి నైపుణ్యం చేయడానికి నిధిని ఏర్పాటు చేస్తుంది, కాని నిరుద్యోగ భృతి లేదు.
Industrial Relations Code:
* 10% శ్రామిక శక్తి లేదా 100 మంది కార్మికుల సభ్యత్వంతో కేవలం ట్రేడ్ యూనియన్ మాత్రమే రిజిస్టర్ చేయబడుతుంది.
* బహుళ సంఘాలు ఉన్నచోట, శ్రామిక శక్తిలో 51% సభ్యత్వం కలిగిన యూనియన్ ను 'నెగోషియేషన్ యూనియన్'గా గుర్తించాలి.
*సమ్మె కొరకు 14 రోజుల ముందు నోటీస్ తప్పనిసరి, కన్సీలియేషన్ ఆఫీసర్ కు కనీసం 2 రోజుల నోటీస్. సయోధ్య ముగిసే వరకు సమ్మె కొనసాగదు.
* 'చట్టవ్యతిరేక' సమ్మెల్లో పాల్గొన్నందుకు లేదా 'ప్రేరేపించినందుకు' జరిమానా లేదా జైలు శిక్ష.
* "అవుట్-వర్కర్స్"కు కొంతవరకు గృహిణులకు, మరియు "ప్రభుత్వ స్థాపనలకు" కనీస వేతనాల చెల్లింపు నుండి మినహాయింపు.
* కొత్త ఎస్టాబ్లిష్ మెంట్ లు మరియు "ట్రయల్ రన్ లు" లేదా "సంభావ్య దశలు" చేపట్టేవారికి బోనస్ చెల్లింపు నుంచి మినహాయింపు. ట్రయల్ రన్ లు మరియు సంభావ్య దశల కొరకు ఎలాంటి టైమ్ లిమిట్ లేదు
* 300 కంటే తక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థలకు ఐఆర్ కోడ్ నుంచి మినహాయింపు ఉంది.
* అలాగే 'ప్రజాప్రయోజనాల కోసం' నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా మినహాయింపు పొందిన వారు. లేదా 'నాన్-ఇండస్ట్రీ' లేదా ఇతరత్రా కూడా.
* 300 మంది కంటే తక్కువ కార్మికులు ఉన్న సంస్థలు వలస కార్మికులకు సంబంధించిన నిబంధనల నుండి మినహాయింపు.
* కొత్త కర్మాగారాలు, లేదా కొత్త కర్మాగారాల యొక్క ఏదైనా తరగతి, 'ప్రజాప్రయోజనాలు' మరియు అత్యవసర పరిస్థితుల్లో భద్రతా నిబంధనల నుండి మినహాయించబడవచ్చు.
లాభం ఎవరికీ :
పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు ఈ కొత్త కోడ్స్ ద్వారా Ease of Doing Business పెరుగుతుంది (సింగిల్ రిజిస్ట్రేషన్, సింగిల్ రెటర్న్ మొదలైనవి)
ప్రారంభ, వ్యాపారవృద్ధికి ఆసక్తి ఉన్న సంస్థలు భారీ లేఅఫ్ మార్జిన్, రోజుకు ఎక్కువ పని గంటలు వంటి సౌలభ్యం పొందవచ్చు.
ఫార్మా కంపెనీలు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లను నియమించడంలో మరియు సామాజిక భద్రతా అనుభవాన్ని నియంత్రించడంలో ప్రయోజనం ఉండవచ్చు, ఎందుకంటే కోడ్స్ కొన్ని కవరేజ్ ఇచ్చినప్పటికీ నిబంధనల్లో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు.
(*మార్పు శరత్, మానవహక్కులవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు)
Next Story

