ఆధునిక అంబేద్కరిజానికి చిరునామా
x

ఆధునిక అంబేద్కరిజానికి చిరునామా

తెలుగు నాట దళిత ఉద్యమ నిర్మాత, తత్వవేత్త, కవి, ఉపన్యాసకుడు కత్తి పద్మారావు 71 జన్మదిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం


ఆధునిక అంబేద్కరిజానికి తెలుగు నేల చిరునామా కత్తి పద్మారావు. చార్వాక నాస్తిక హేతువాద బౌద్ద దర్శనాల సంశ్లేషణ, సమన్వయంతో సాంస్కృతిక భావజాల విప్లవాన్ని ముందుకు తీసుకు వెళుతున్న డాక్టర్ కత్తి పద్మారావు

ఆధునిక అంబేద్కరిజం పథగామి. ఆయన ఉద్యమకారుడు. నూతన దృష్టితో చరిత్రను తిరగరాసే చరిత్ర కారుడు. సమకాలీన అంశాలపై వెంటది వెంట కవిత్వీకరిస్తున్న కవి. ఆధునిక సమస్యలకు అంబేద్కరిజం ఎలా పరిష్కారం చూపుతుందో అన్వయించి విశ్లేషిస్తున్న భాష్యకారుడు. ఆయన ఒక సంఘ సంస్కర్త. ఆయన అధ్యయనం అపారం. ఆయన అనితర సాధ్యుడు.
ఆయన బాట వేస్తారు.
అది ఉద్యమమై ఉరకలెత్తుతుంది. కుల వివక్షపై పోరాడితే అది
హైకోర్టును దాటి సుప్రీంకోర్టు కోర్టును తట్టి లేపుతుంది. కారం చేశాడు నుండి ఢిల్లీ దాకా చేసిన ొఉద్యమంతో 1989లో
అసెంబ్లీని దాటి పార్లమెంట్‌లో గర్జనై అస్పృశ్యత వ్యతిరేక చట్టంగా కొత్త చట్టం రూపుదిద్దుకుంది. కత్తి పద్మారావును లండన్ పార్లమెంటులో ప్రసంగానికి ఆహ్వానించి గౌరవించింది. ఆయన పిలుపు 2001లో
దక్షిణాఫ్రికా డర్బన్ అంతర్జాతీయ జాతి వివక్ష వ్యతిరేక సదస్సులో కుల వివక్ష ఎజెండా అయింది. . కత్తి పద్మారావు పిలుపుతో విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం రూపు దిద్దుకుంది.
కత్తి పద్మారావుగారిని అమెరికన్ నల్ల జాతి నాయకుడు మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ తో పోల్చవచ్చు. తెలునాట మహోజ్వల సామాజిక ఉద్యమ కారుడు పోతులూరి వీర బ్రహ్మం బాటలో కుల నిర్మూలన సాంస్కృతిక ఉద్యమానికి ప్రతీక గా వందలాది కులాంతర వివాహాలు జరిపించాడు. తన కుటుంబాన్ని అలా కులాంతర వివాహాలతో ఆదర్శంగా నిలిపాడు.
కాన్షీరాంగారు 23 సార్లు హెలికాప్టర్లో తెలుగునాట పర్యటిస్తే 17 సార్లు వెంట నడిచి బహుజన భావధారను ప్రవాహశీలంగా ప్రసంగించాడు కత్తి పద్మారావు . భారతీయ చారిత్రక , తాత్విక , సాంస్కృతిక మూలాలు ఎరిగిన కత్తి పద్మారావు ఆచరణ. అధ్యయనంతో అంతశ్చేతనలో సైతం అవే నిండి ఏది మాట్లాడినా తత్వం, సంస్కృతి , చరిత్ర ఫ్రత్యామ్నాయ రాజకీయాలు నూతన సమాజ నిర్మాణమే సాక్షాత్కార వుతుంది.



ఆయన వైదిక ఆర్యులను నిలదీసినా చార్వాకులు, లోకాయతులు, బుద్ధుడు, బౌద్దం పంచశీల , కులాతీత సమాజ పునర్నిర్మాణం చేపట్టినా అవన్నీ భావి సమాజ దర్శనంలోభాగమే.

అంబేద్కర్ రాజకీయంగా పార్టీ పెట్టి శాసన సభ్యులను గెలిపించారు. రామ్మనోహర్ లోహియాతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎదిగి అధికారంలోకి వచ్చింది. పెరియార్ స్పూర్తినందుకొని డియంకే అన్నాదురై, కరుణానిధి అధికారంలోకి వచ్చారు. బహుజన బాటలో ఉత్తర ప్రదేశ్‌లో బీయస్పీని కాన్షీరాం గారు అధికారం లోకి తెచ్చారు. తెలుగునాట ఇవేవీ సాధ్యం కాలేదు. ఎన్ని ఉద్యమాలు చేసినా రాజకీయ అధికారం కొన్ని కులాలకు పరిమితమైపోయింది. అదేదో ఈ సమాజ నిర్మాణం, పరిణామంలోనే ఏదో తేడా
ఉన్నది. అని విషయం గమనించిన కత్తి పద్మారావు గారు తమ శక్తియుక్తుల్ని , సామర్థ్యాలను సామాజిక చైతన్యం వై మలుపు తిప్పారు. ప్రసంగాలు, పాటలు , శ్లోకాలు, వ్యాసాలు, కవితలు, చరిత్ర పునరధ్యయనం బృహత్తర గ్రంథాలయ్యాయి.
విశ్వ వ్యాప్త మహనీయుల చరిత్రలు వారి వ్యక్తిత్వాలు, సిద్దాంతాలు ఆచరణ రూపుదిద్దుకున్న తీరును వ్యక్తిత్వ నిర్మాణ శైలిలో అందించారు.
ఇలా పలు ప్రక్రియలలో వేల పేజీలు అక్షరబద్దం తేస్తూలక్ష పేజీలవైపు రచనా ప్రవాహం కొనసాగిస్తున్నాడు కత్తి పద్మారావు. అక్షరంతో పాటు టీవీ, యూట్యూబ్ చర్చలతో సహా సమస్త పార్శ్వాల్లోవిస్తరించారు.
కత్తి పద్మారావుగారు తాను పుట్టి పెరిగి సాగిన చరిత్రను, తన వెంట నడిచిన,
తన వెంట నడిపిన సామాజిక చరిత్రను “ ఒక అస్పృశ్యుని యుద్ద గాథ “గా
స్వీయ చరిత్ర రూపంలో యువ తరాలకు భావి తరాలకు నిక్షిప్తం చేస్తున్నారు.
నలుగురు రచయితలు చేయలేని కృషిని ఒక్కడు సాధించడానికి కార్పోరేట్ పని పద్దతులను అన్వయించుకొని పది మందికిపని కల్పిస్తూ వారి సహకారంతో ఎన్ని వ్యాసాలు, ఎన్ని కవితలు ఎన్ని గ్రంథాలు…! ఏక కాలంలో నాలుగు పుస్తకాలకు ఒక్కో అధ్యాయం చొప్పున పూర్తి చేస్తూ ముందుకు సాగడం ..
మాంద్యం గా వున్న మార్కెట్ శక్తులను కదిలించి అభిమానుల చేయూతతో
మనదైన సాహిత్యాన్ని, చరిత్రని, తాత్వికతను , సందేశాన్ని, మార్గాన్ని అందించడం సమకాలీన సమాజంలో కత్తి పద్మారావుగారొక్కరికే సాధ్య పడింది. ఒక ముద్రణ పోవడమే కష్టమైన ఈ రోజుల్లో
ముద్రణ మీద ముద్రణ రావడం వారి భావజాల వ్యాప్తిని తెలుపుతుంది. దళిత మహాసభతో వేలాది మంది కార్యకర్తలుగా , నాయకులుగా, కవులుగా, జర్నలిస్టులుగా , ఉద్యోగులుగా అధికారులుగా ఎమ్మెలేలుగా మంత్రులుగా ఎదిగారంటే దాని వెనక కత్తి పద్మారావు గారు ఒక తల్లిగా నాయకుడిగా నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకం. దళిత సామాజిక సాహిత్య రంగాలు ప్రధాన స్రవంతి గా ఎదగడం లో పునాది దళిత ఉద్యమాలే. కత్తి పద్మారావు గారి పాత్ర లేకుండా దళిత ఉద్యమాలను ఊహించలేము. కత్తి పద్మారావు గారు తన కుటుంబాన్ని, సహచరి స్వర్ణ కుమారిని, చార్వాక, లోకాయత, చేతన్లును , కోడళ్లను మహోన్నత సంస్కృతితో తీర్చి దిద్దడం వల్లనే సాధ్యపడ్డాయి., వచ్చిన వారికల్లా భోజనం పెట్టడం అనే సంస్కారం వేలాది మందికి ఇది మా ఇల్లు మనఇల్లు మన అన్న ఇల్లు మన వదిన ఇల్లు అనుకునేలా చేసింది.
ఇలా మొత్తం కుటుంబాన్ని మలిచిన తీరు ,చైతన్యవంతమైన కుటుంబాలు చాలా అరుదు. రోజుకొక సారైనా పలకరించుకోకపోతే మాకు అన్నం తిన్నట్టుగా వుండదు. మేం మాట్లాడుకుంటే ఆకలి తీరినట్టుగా వుంటుంది.ప్రపంచ చరిత్ర, సిద్దాంతాలు , రాజకీయాలు అలలు అలలుగా మా చర్చలో కదిలి పోతుంటాయి. మేం మాట్లాడుకోని అంశం లేదు. అదంతా రికార్డు చేస్తే అదే లక్ష పేజీలు మిఛుతుంటారు కత్తి పద్మారావుగారు.
ఆ స్నేహ సాహచర్యంలో ఎన్నో పుస్తకాలకు ముందుమాటలు రాయాలని తాను తెలిసిన వారందరికీ నేను కూడా తెలయాలని కోరితే వీలైనన్ని ముందు మాటలు రాసాను. అలా రాయడానికి,రాయించడానికి, గురువుగా సంబోధించడానికి వారి సహృదయతయే కారణం.
కత్తి పద్మారావుగారి ఆరోగ్య రహస్యం ఏమంటే వారికి రాయడంతోనే ఆరోగ్యం , పదిమందితో మాట్లాడమే ఆరోగ్య సూత్రంగా జీవిస్తున్న దశాబ్దాల సహచరుడు . దళిత ఉద్యమాలకు చిరునామా! దళిత సాహిత్య నిర్మాత ! ఆయన అధ్యయనం
అంబేద్కర్ తో పోల్చదగినది. ఆయన నెలకొల్పిన గ్రంథాలయం విజ్ఞాన భాండాగారం. ఎందరికో అధ్యయన కేంద్రం.
27 జూలై 1953లో పుట్టిన మహాకవి యుగకర్త కత్తి పద్మారావు గారి జీవితం , అధ్యయనం, ఉద్యమాలు, ప్రసంగాలు,గ్రంథాలు , ఉద్యమ నిర్మాణ రీతి, ఆత్మీయత, మానవీయ సంబంధాలు, రచనా నైపుణ్యం అనితర సాధ్యం.


Read More
Next Story