
టీచర్లను సంపన్నులగా గుర్తించిన ఆంధ్రా ప్రభుత్వం
అందుకేనా టీచర్ల పై ‘P4’ పిడుగు?
వికసిత్ భారత్ @2047 (Vikasit Bharat@1947) లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో పావర్టీ-పీ 4 (Zero poverty- P4) పాలసీ తయారు చేసింది. పీ4 (P4 అంటే) పబ్లిక్, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం (Public -Private -People - Partner ship). ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రధాన,ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇపుడు. ఈ కార్య్ర మాన్ని ( AP Govt Flagship program) 2025 ఉగాది ప్రారంభించారు. దీని ప్రకారం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ లో పేదరికాన్ని (Poverty) అంతం చేయాలి.
ఈ పధకంలో జనాభాలో 10% ఉన్న సంపన్న వర్గాలు జనాభాలో అట్టడుగున్న 20% పేద వర్గాలవారికి అండగా ఉండాలి. ఈ కుటుంబాలను సర్వే ద్వారా ప్రభుత్వం గుర్తించి వారికి "బంగారు కుటుంబాలు' అని పేరు పెట్టినది. ఈ బంగారుకుటుంబాలను ఆదుకోవలసిన సంపన్నవర్గాలలో టీచర్లను కూడా చేర్చారు.
ప్రభుత్వం గుర్తించిన ఈ బంగారు కుటుంబాలను ఈ 10% సంపన్న వర్గాలలో ఉన్న ఉద్యోగులు, వారిలో గెజిటడ్ హెడ్ మాస్టర్లు ఐదుకుటుంబాలను, టీచర్లు రెండేసి కుటంబాల చొప్పున స్కూల్ లో నే ఉన్న పేద విద్యార్థుల (BPL Students) బంగారు కుటుంబాలను (Identified &Listed by Govt ) "@Adopt/map చేసికొని ఆ కుటుంబాల పేదరికం పోయేవరకు , సాధికారిత సొధించే వరకు Financial Assistance తో పాటు పిల్లల విద్యా ఫీజులు Guidance, LPG,Water వంటి సదుపాయములు కల్పించవచ్చు. ఈ టిచర్లను /ఉద్యోగులను మార్గదర్శకులు (Mentors) అంటారు.
ఈ పధకం మంచిదే కాని టీచర్లను సంపన్న వర్గంలో చేర్చి మెంటర్స్ గా బంగారు కుటుంబాలకు Map చేయటంతోనే ఇబ్బంది అంతా.ఈయన కుటుంబాన్ని సాకటానికే సొంగ పడుతుంటే ఈయనకు మరల రెండు కుటుంబాల బాధ్యతా? అవ్వ . టీచర్ల కు ఈ బాధ్యత ఇవ్వటం వింతలలో వింత .
సంపన్నులను, IAS ,Group I ఆఫీసర్లను, MLA&MPL లకు ఈ బంగారు కుటుంబాలను ఎంతమందిని Map చేశారో తెలియదు. వాళ్ళ టార్గెట్ లు అందుకోలేక కాక మనమీద పడ్డారు. ఇతర ఉద్యోగులకు ఈ P4 వర్తింప చేసినట్లు సమాచారంలేదు. టీచర్లను లాగితే, మెంటర్లు సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. అంకెల లక్ష్యం నెరవేరుతుందని భావించి ఉండవచ్చు.
ఆగష్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శకులను గుర్తించే పనిని జిల్లా కలక్టర్లకు అప్పగించారు.వారు DEO ల ద్వారా P4 వెబ్సైట్ లో టీచర్ల రిజిస్ట్రేషన్ ఈ నెల 29 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదీ P4 తాజా కధ.
P4 తో టీచర్లకు కన్నీళ్ళేనా?
ఇప్పటికే అధికారుల అవివేక చర్యలతో , అర్థంలేని పని ఒత్తిడికి , అసహనానికి గురవుతున్న టీచర్లపై ఇంకా ముందుకెళ్ళి ఈ P4 ఒత్తిడి కూడా తెస్తే ప్రభుత్వానికి , టీచర్లకు పూడ్చలేని Gulf ఏర్పడేమాట వాస్తవం .పెద్ద ఎత్తున ఉద్యమాలు ఎగసి పడే అవకాశమున్నది. కోరి కోరి ప్రభుత్వం టీచర్ల ను దూరం చేసుకొన్నట్లే. ఇది Optional గా ఉండాలి గాని Mandatory కారాదు
నాలుగురోజులు జీతాలుఆలస్యమైతే అల్లాడిపోయే "జీతగాళ్ళైన "టీచర్లను సంపన్న వర్గాలలో చేర్చటం న్యాయమేనా?
P4 పొలసీలో బంగారు కుటుంబాలను టీచర్ల కు మాప్ చేస్తే ఆ కుటుంబాలు వారానికొకసారి స్కూలుకు వచ్చి మాటసాయం అడిగితే ఫరవాలేదు. ప్రభుత్వ ఆదేశాలను అలుసుగా తీసుకొని టీచర్లను మాకు డబ్బులు ఇస్తావా చస్తావా అని డిమాండ్ చేయడా? వాళ్ళకు డబ్బులు అవసరమైన ప్పడల్లా ఊళ్ళో ఉన్న ఏ అండా లేని మన టీచర్లను వేధించుకు తినరా? ఒక ఎంప్లాయ్ గా Authorised గా దత్తత చేసుకొన్నాక.ఆ Mapping కు bond అయ్యి ఉండాల్సిందేగా? మీకు మా కుటుంబాన్ని అప్పచెప్పారని ఆ బంగారు కుటుంబం ఒత్తిడి తెస్తారు. P4 బాధ్యత తీసుకొన్న టీచర్స్ పై తమను పట్టించు కోవటం లేదనిపై అధికారులకు రిపోర్టు చేయరా? అధికారుల నుండి ఫోనులు రావా?స్కూళ్ళకు వచ్చే విద్యాధికారులకు ఇకపై ఈ P4 పనేనా? చదువు సంక నాకి పోవటమేనా?
(తల్లిదండ్రుల్లో 20% మంది తల్లికి వందనం క్రింద 13 వేలు వస్తే 15000 పెట్టి టచ్ ఫోను కొనుకున్నారు. ఇక పేదరికానికి కొలమానం ఏమిటి?)
ఈ P4 పని టీచర్లకు వద్దే వద్దు. ఈ మానసిక క్షోభ మాకు వద్జు సామీ.! మనవి ఆర్థిక ఉద్యోగాలు కాదు. కనపడని ఖర్చులతో అల్లాడుచున్న టీచర్స్ కి ఈ అప్పగింతలేమిటి ?" ఆర్థిక సహాయమును కావాలంటే Contribution రూపంలో జీతాలలో మినహాయించే అవకాశముండగా ఈ P4 ఏమిటి?
Students ను Adopt చేసుకోగలము కాని వాళ్ళ Families ను కూడా Adopt చేసుకోగలమా?
టీచర్లు,.తమ సంఘాలకు P4 పై అభిప్రాయములను తెలియచేయాలి. సంఘాలు కూడా తక్షణం సమావేశాలు ఏర్పాటు చేసికొని , నిర్ణయాలు తీసుకొని బదిలీలప్పడు "ఎలాంటి ఐక్యత" ప్రదర్శించాయో అదే స్ఫూర్తితో ముందుకు పోవాలి.
సంఘాలు నిర్ణయాలు తీసుకొనేవరకు.రిజిస్ట్రేషన్ ఆపుదామా?
- ఒక ఉపాద్యాయురాలు జెడ్.పి.హైస్కూల్ విశాఖపట్నం
Next Story