అనంతపురం ‘పేదల బంధు’ మీద కేంద్రం దెబ్బ
x

అనంతపురం ‘పేదల బంధు’ మీద కేంద్రం దెబ్బ

ఇరవై సంవత్సరాలకు పని చేస్తున్న 611 పడకల ఆసుపత్రుల సేవలు ఆగిపోయే ప్రమాదం


కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో, తెలంగాణ లోని ఆరు జిల్లాల్లో సేవలందిస్తున్న 55 ఏళ్ల చరిత్ర కలిగిన రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ (Rural Development Trust: RDT) సేవలకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. ఆ సంస్థకు సంబంధించి నిధుల వినియోగానికి అవసరమైన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేన్ (FCR) యాక్ట్ కింద అనుమతులు పునరుద్ధరణను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఆర్డీటీ సంస్థ సేవలు నిలిపివేశారు. గత కొంత కాలంగా విదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థల పై బీజేపీ ప్రభుత్వం కత్తి కట్టిందన్న ఆరోపణలున్నాయి. గత సంవత్సరం నుంచి విదేశీ సంస్థలపై నిషేధం విధించింది. దీని మూలంగా ఆర్డీటీకి విరాళంగా వస్తున్న నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు లైసెన్స్ రెన్యూవల్ ఆపివేయడంతో నిధుల వినియోగం పై ప్రభావం పడింది.

ఏడాదికి సగటున 500 కోట్లకు పైగా బడ్జెట్ ఉండేది. గతేడాది నుంచి వచ్చే విరాళాలపై కేంద్రం నిషేధం విధించడంతో ఆర్డీటీ కీలక విభాగాల్లో విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణం, పొదుపు సంఘాలు, గ్రామీణ క్రీడలు, పారా ఒలింపిక్స్, దివ్యంగా సేవలు, ఉపాధికి ఊతమిచ్చే ట్రైనింగ్ ప్రోగ్రాం, స్కాలర్షిప్ అన్నీ నిలిపివేయబడ్డాయి. అనంతపురం జిల్లాలో ప్రతి గ్రామంలో ఆర్డీటీ సేవలు వినియోగించుకోని ప్రజలు ఉండరు. కరోనా సమయంలో ఎందరో పేద ప్రజలకు ఆయువు పోసింది బత్తలపల్లి ఆస్పత్రి. దేశంలో టాప్ 10 ఎన్జీవో లలో ఆర్డీటీ ఒకటి.ఈ ఆసుపత్రి ప్రతి సంవత్సరం 8.5 లక్షల మంది రోగులకు విస్తరించే ₹300 కోట్లకు పైగా విలువైన వైద్య సేవలు నిలిచిపోయాయి. అందులో పనిచేసే 3,000 మంది సిబ్బంది నిరుద్యోగులుగా మారతారు. ఇరవై సంవత్సరాలకు పైగా 611 పడకలతో మూడు ఆసుపత్రులను నిర్వహిస్తోంది, ఇది ఏటా 8.5 లక్షల మంది అవుట్ పేషెంట్లు 60,000 మంది ఇన్ పేషెంట్లకు చికిత్స చేస్తారు. కోవిడ్ మహమ్మారి సమయంలో, ట్రస్ట్ 300 పడకలతో ఉన్న బత్తలపల్లి ఆసుపత్రిని కరోనావైరస్ ఆసుపత్రిగా మార్చింది, ఇది 10,000 మంది రోగులకు చికిత్స చేసింది. యువత ఆర్డీటీ -ప్రాయోజిత అనంత గ్రామీణ క్రీడాకారులు వారి స్పాన్సర్‌షిప్‌ను కోల్పోతారు.

ఆర్డీటిని ఎవరు స్థాపించారు

ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ (Vicente Ferrer Moncho). స్పెయిన్ నుంచి అనంతపురంకు వలస వచ్చారు. ఆయన 1969లో లాభాపేక్షలేని సంస్థను ప్రారంభించారు, అది మతపరమైన, రాజకీయపరమైనది కాదు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా దాదాపు 3,500 గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి పనులను, కుటుంబాదాయం పెంచే పనులు చేస్తుంది, ఆర్థికంగా బలహీన వర్గాల నుండి 4.5 లక్షలకు పైగా ప్రజలు సేవలందుకుంటున్నారు. ఇది విద్య, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, సమాజ ఆరోగ్య అభివృద్ధి కోసం క్రీడలను నిర్వహిస్తుంది. ఆర్డీటీ 264 మంది విద్యార్థులతో మూడు ఇన్ క్లూజివ్ రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాలలు 466 మంది విద్యార్థులతో రెండు ఇన్ క్లూజివ్ ఉన్నత పాఠశాలలను నడుపుతోంది. జిల్లా నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ సంస్థల మన్నన పొందింది. అనంతపురం, కర్నూలు మరియు తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో కూడా సామాజిక సంక్షేమ ప్రాజెక్టుల అమలు సులభతరం చేస్తుంది.

రాజకీయ నాయకులు ముందుకు రావాలి

దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్న ఆర్డీటీని రక్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. పేద ప్రజలకు సేవ చేయడానికి ఆర్డీటీని స్థాపించిన ఫెర్రర్ కుటుంబంపై అలాగే నిస్వార్థ సేవ చేస్తున్న ఎన్నో మిషినరీలపై బిజెపి ప్రభుత్వం కక్షగట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్వచ్చంధ సంస్థలను మతపరమైన కళ్ళజోడుతో చూస్తోంది. ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఆర్డీటీ గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించి వివిధ కార్యక్రమాలు చేయడానికి విదేశీ నిధులను అందుకుంటుంది.

ఆర్డీటీ సంస్థ విదేశీ సహకార నియంత్రణ చట్టం కింద 1970లో నమోదు అయ్యింది. ఆర్థిక నివేదికలతో సహా పారదర్శక ఆర్థిక పద్ధతులను నిర్వహిస్తుంది. ఆర్డీటీ పరిధి, సేవలు, ప్రభావాన్ని విస్తరించడానికి ఫండసియన్ విసెంటే ఫెర్రర్ (స్పెయిన్), విసెంటే ఫెర్రర్ ఫౌండేషన్ (అమెరికా), విసెంటే ఫెర్రర్ స్టిఫ్టుంగ్ (జర్మనీ) , ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్డీటీ (యూకే) వంటి ప్రపంచ భాగస్వాములతో కూడా సహకరిస్తుంది. సమగ్ర గ్రామీణాభివృద్ధి,గ్రామీణ సమాజాలలో పేదరికం, ఆరోగ్య సంరక్షణ, విద్య మౌలిక సదుపాయాలతో సహా వివిధ సవాళ్లను పరిష్కరించడంపై ఆర్డీటీ దృష్టి పెడుతుంది.

ప్రత్యేక విద్య స్కాలర్‌షిప్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి విదేశీ నిధులను ఉపయోగిస్తుంది, ఇది ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను పొందడంలో సహాయపడుతుంది.ఆర్డీటీ ప్రొఫెషనల్ స్కూల్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, ప్రపంచ భాగస్వాముల నుండి నిధులతో, ఉపాధిని పెంపొందించడానికి ఇంగ్లీష్ మరియు ఇతర భాషలలో శిక్షణను అందిస్తుంది.ఆర్డీటీ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు విదేశీ గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరుస్తాయి, బహుళ-ఔషధ నిరోధక క్షయవ్యాధిని ఎదుర్కోవడానికి కార్యక్రమాలు అభివృద్ధి తో సహా అందరికీ నాణ్యమైన మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి వీలు కల్పిస్తుంది. తక్షణమే ఆర్డీటీ సేవలు పునరుద్ధరించాలి అలాగే ఎఫ్సిఆర్ఏ రెన్యూవల్ పునరుద్దరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.

Read More
Next Story