
కులగణన వల్ల కులాలు కలసిపోతాయా, కలహించుకుంటాయా?
కుల గణన వల్ల కులాలు కలసిపోయి కులాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందంటున్నారు తెలంగాణ తొలి బిసి కమిషన్ చెైర్మన్ బిఎస్ రాములు
కుల గణన వల్ల సమాజం చీలిపోతుంది అనే వాదన సరైనది కాదు. అందుకు భిన్నంగా కుల గణన వల్ల కులాలు బాగా తగ్గిపోతాయి. అనేక కులాలు కలిసి ఒకే కులంగా మారుతాయి .సాధారణంగా ఒక గ్రామం లో 25 నుండి 40 కులాలే వుంటాయి. వ్యవసాయ సమాజానికి ఆయా కులాలు కుల వృత్తులు అవసరమౌతాయి. ఆరువేల కులాలు అనేవి అనేక ప్రాంతాల్లో విడిపోయి భాషల వారీగా, తెగల వారీగా కులాల వారీగా , రక్తసంబంధాల వారీగా ఉండడం వల్ల కొనసాగుతున్న విభజనలు.
గతంలో 25-30 కి. మీ. భాషలో మార్పులుండేవి. పెళ్లి సంబంధాలు కూడా అదే పరిధిలో సాగాయి. రైల్వేలు రోడ్లు బస్సులు, టెలిఫోన్ సెల్ ఫోన్ , రవాణా సౌకర్యాలు పెరిగాయి. దూరతీరాలకు పారిశ్రామిక కార్మికులు వలసలు పెరిగాయి. వేల కొత్త వృత్తులు ఏర్పడ్డాయి సినిమాలు టీవీలు, ప్రభుత్వ పరిపాలన ప్రజలను సాంస్కృతికంగా, రాజకీయంగా, ట్రేడ్ యూనియన్ కార్మిక కర్షకుల పరంగా, విద్యా రంగంలో విద్యార్థుల పరంగా ఒకటిగా చేస్తున్నాయి. అలా నూతన వర్గాలు రూపొందాయి.
అదే విధంగా ఒకే రకమైన వృత్తి వున్న వారిలో భావ సారూప్యత ఏర్పడి వివిధ ప్రాంతాల, వివిధ భాషల కులాలు ఒక్కటవుతాయి. రక్త సంబంధాలు, రాజకీయాలు, కులవృత్తుల నైపుణ్యాలు ఆధునీకరణ కలిసి పంచుకుంటారు. కలిసి తెలుసుకుంటారు. తమ వాటా బడ్జెట్ డిమాండు చేస్తారు. అందుకు ఒకటవుతారు. అలా ఆరువేల కులాలు క్రమంగా ఆరు వందల కులాలుగా కలిసి పోతాయి. గతంలో ఎన్నో భాషలు మాట్లాడేవారు. తమ భాషలు వదిలేసి సమీప బలమైన ప్రాంతీయ భాషలను స్వీకరించారు. వందల భాషలు అదృశ్యమై 22 భాషలు ప్రముఖంగా నిలదొక్కు కున్నట్టే వందల కులాలు కలిసి కొన్ని కులాలుగా రూపొందాయి. ఆంత్రోపాలజీ, డి ఎన్ ఏలు వీటిని నిర్దారిస్తున్నాయి. .
కాకతీయుల శాసనాల్లో పదహారు కులాలే కనపడుతాయి. చెరువు నిర్మించా చెరువు కింద వ్యవసాయం చేయడానికి చెరువు ఆధారంగా కొత్త వూరు రూపొందడా ికి పదహారు కులాలకు భూములిచ్చి స్థిర పరిచారు. పూజారి బ్రాహ్మణులు అయిదారు పల్లెలకు ఒకరు టే చాలన్నారా.
కాలక్రమంలో శైవం , వైష్ణవం, వీర శైవం, వీర వైష్ణవం, విశిష్టాద్వైతం వంటి భక్తి మత ఉద్యమాలు ఒకే కులాన్ని అనేక కులాలుగా చీల్చాయి. గణ తెగలు కులాలుగా రూపొందడంతో తమ ఉనికి కోసం కొత్త కులంగా రూపొందారు. ఇలా కులాల సంఖ్య పెరుగుతూ పోయింది. కాని గ్రామీణ వ్యవసాయ సమాజంలో అన్నీ కలిసి 35- 40 మించి కుల వృత్తులు డు. అవసరం పడలేదు. ఈ కులాల విభజనలో కులాల సంఖ్య పెరగడం లో బ్రాహ్మణిజం, మను ధర్మం పాత్రనే ీ లేదు. వాటి పాత్ర వుందని చెప్పడం వాటికి లేని ఆధిక్యతను ఆపాదించామే. సమాజంలో ఇస్లాం, సూఫీ, సిఖ్కు, క్రైస్తవ మతాల విస్తరణ, భక్తి ఉద్యమాల వల్ల ఒకే కులం అనేక కులాలుగా చీలిపోయింది. ఇది సామాజిక రాజకీయ పరిణామమే తప్ప మనుధర్మ బ్రాహ్మణీక పరిణామం కాదు.
కాపులు అయిదారు కులాలు కలిసి ఒక్కటయ్యారు. పద్మశాలి నేత కులాలు 20 కులాలు ఒక్కటిగా సంఘటితమౌతున్నారు. కల్లు గీత గౌడ కులాలు కలిసిపోతున్నాయి. విశ్వ కర్మ ఐదు కులాలు కలిసి పోయాయి. ఎస్సీలంతా కలిసి ఐదు పది కపలాలుగా కలిసి పోతారు. బీసీలంతా కలిసి దేశ వ్యాప్తంగా వంద కులాలుగా కలిసి పోతారు. అవన్ని చూడ్డానికి మనం అప్పటికి బతికి వుండక పోవచ్చు. యువతరం తమ జీవిత కాలంలోనే ఇవన్ని చూస్తారు.
అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలని అన్నారు. కుల నిర్మూలన ఎలా జరుగుతుంది? కుల నిర్మూలన అంటే ఏమిటి? అన్ని కులాలు కలిసి పోవడమే కుల నిర్మూలన. కుల గణన వల్ల వృత్తిలో నైపుణ్యం కోసం, రాజకీయ సాధికారిత కోసం , రక్త సంబంధాలు పెళ్లిల్లు కోసం క్రమంగా కలిసి పోతారు. కుల గణన లేక పోవడం వల్ల నిరుపేద గ్రామీణ ఉత్పత్తి కులాలు సేవా కులాలు వ్యాపార కులాలు ఇతర ప్రాంతాల్లోని, ఇతర భాషల్లోని ఏఏ కులాలు తమ సమీప కులాలే, తమ నుండి తీసి పోయిప్రత్యేక కులాలుగా ఏర్పడాయో ఇంత దాకా తెలియక కాలువ లేదు.
కుల గణనతో తెలుస్తుంది. కలుస్తారు. పద్దెనిమిది రకాల రెడ్డి కులాలు ఒక కులంగా కలిసి పోతున్నారు. ఆరెస్ వంటి హిందూ సంస్థలు కులాంతర వివాహాలను ఎజెండా తీసుకొని తమ వేదికలపై ప్రోత్సహిస్తే రెండు తీరాలలోనే హిందువుల మధ్య కుల భేదాలు తొలగి హిందూత్వ బలం బలం పెరుగుతుంది. మూడు వందల కులాలుగా చీలి పోయిన బ్రాహ్మణులు ఒక కులంగా కలిసి పోతున్నారు. పాత వృత్తులు పోయి కొత్త వృత్తులు పెరుగుతున్న క్రమంలో కులాల సమీకరణలు పెరిగి చాలా కులాలు కలిసి పోతాయి. పాత ఉనికిని కోల్పోతాయి. ఇలా కుల గణన వల్ల ఆయా కులాల వృత్తి నైపుణ్యాలను పరస్పరం పంచుకుంటారు. పెంచుకుంటారు. ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. ఇలా మన వూహించని ఎన్నో సానుకూల పరిణామాలు జరుగుతాయి
Next Story