ప్రపంచ బంధాలు ప్రాముఖ్యం మీదనే నడుస్తున్నాయా?
x
సౌదీ యువరాజు మహమ్మాద్ బిన్ సల్మాన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ప్రపంచ బంధాలు ప్రాముఖ్యం మీదనే నడుస్తున్నాయా?

ఎంబీఎస్, ట్రంప్ సమావేశం నైతికతను పక్కన పెట్టేసిందా?


వివేక్ కట్జూ

సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కు వైట్ హౌజ్ లో ఘన స్వాగతం లభించింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆయనకు ఆహ్వానం పలికారు. ట్రంప్, అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ ఇద్దరు వారి పదవీకాలాల్లో సౌదీలో పర్యటించారు.
అంతకుముందు తనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తున్నాడని కక్షతో సౌదీ జాతీయుడైన జర్నలిస్ట్ ‘జమాల్ ఖషోగ్గి’ని టర్కీలో దారుణంగా హత్య చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశం ఈ విషయం ఎలాంటి ఆందోళన చెందడం లేదు.
అంతర్జాతీయ సంబంధాలలో..
ఖషోగ్గి హత్య, అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరకడంతో పాశ్చాత్య లిబరల్ వర్గాలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరికి గుర్తులేవు. అంతర్జాతీయ సంబంధాలు నైతికత ద్వారాలా కాకుండా ప్రయోజనాల ద్వారా నడుస్తున్నాయని సౌదీ యువరాజుకు తాజాగా లభించిన స్వాగత కార్యక్రమాలను చూస్తే అర్థమవుతుంది.
ఓవల్ ఆఫీస్ లో జరిగిన విలేకరుల కార్యక్రమంలో ఓ విలేకరి ఇదే ప్రశ్న అడిగాడు. ‘‘యూఎస్ ఇంటలిజెన్స్ ప్రకారం, మీ యువరాజు జర్నలిస్ట్ హత్యకు కుట్రపన్నాడని నిర్ధారించింది. 9/11 కుటుంబాలు ఎంబీఎస్ ఓవల్ కార్యాలయంలో ఉండటంపై ఆగ్రహంగా ఉన్నాయి. అమెరికన్లు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి’’? అని ప్రశ్నించాడు.
‘‘మీరు మా అతిథిని ప్రశ్నలతో ఇబ్బందిపెట్టాల్సిన అవసరం ఏంటీ?’’ అని ట్రంప్ సమాధానమిచ్చారు. ఈ సమయంలో ఎంబీఎస్ మాట్లాడారు. ‘‘తన ప్రమేయం లేకుండా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.ఇది చాలా పెద్ద తప్పు. ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకుంటాం’’ అన్నారు.
జాగ్రత్తగా ఆపరేట్ చేసి చంపేశారు...
అమెరికా లో నివసిస్తున్న ఖషోగ్గి హత్య పొరపాటున, ఆవేశంతో జరిగింది కాదు. పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర. వాషింగ్టన్ పోస్ట్ కు కాలమిస్ట్ గా పనిచేసిన ఆ అసమ్మతి జర్నలిస్ట్.. ఒక టర్కిష్ మహిళతో తన వివాహానికి సంబంధించిన పత్రాలను సేకరించడానికి ఇస్తాంబుల్ కాన్సులేట్ ను ఆశ్రయించారు.
కొన్ని రోజుల తరువాత ఆయనను రమ్మని కోరారు. ఖషోగ్గి తదుపరి కాన్సులేట్ కార్యాలయానికి రావడానికి ముందే పదిహేను మంది సౌదీ అధికారుల బృందం ఖషోగ్గిని హత్య చేయడానికి ఇస్తాంబుల్ చేరుకుంది.
ఈ ఆపరేషన్ జరిగిన తీరును బట్టి చూస్తూ సౌదీ యువరాజు స్వయంగా ఈ హత్యకు అనుమతి ఇచ్చి ఉండవచ్చు. ఖషోగ్గి కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి బయటకు రాకపోవడంతో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సమయానికి ఖషోగ్గి హత్యకు గురై, ముక్కులుగా నరికి, అతని శరీర భాగాలను కాన్సులేట్ వెలుపల పారవేయించడానికి తరలిచారు.
ఈ సంఘటనపై టర్కీష్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కాన్సులేట్ లోని అనుమతించారు. అక్కడ ప్రవహించే మురుగు కాల్వలో వ్యర్థాల సేకరణకు కూడా అనుమతి ఇచ్చారు. వారు సేకరించిన ఆధారాల ప్రకారం ఖషోగ్గి ఇక్కడే హత్యకు గురయ్యారని నిర్ధారించారు. ఇదే సమయంలో సౌదీ హిట్ టీం ఇస్తాంబుల్ నుంచి తిరిగి రియాద్ చేరుకుంది.
అంగీకరించిన సౌదీ..
ఈ సంఘటనపై సౌదీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. వీరు తరువాత హత్యను అంగీకరించారు. సంబంధిత అధికారులపై కేసు నమోదు చేశారు. వారికి శిక్షలు కూడా విధించారు. కానీ తరువాత వాటిని కొట్టివేశారు. తన నిర్దోషిత్వం కోసం సౌదీ యువరాజు ఖషోగ్గి కుమారులను కలిశారు.
తరువాత సౌదీ రాజు తనకున్న అధికారంతో ఈ సమస్య పరిష్కరించుకున్నారు. అనేక వివాదాల తరువాత పాశ్చాత్య కూటమి కూడా దీనిపై మౌనం వహించాయి. ట్రంప్ ప్రస్తుతం సౌదీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి మూడు కారణాలు ఉన్నాయి.
ఒకటి అమెరికా- సౌదీ భద్రత,ఆర్థిక కారణాలు, వాణిజ్య సంబంధాల మెరుగుదల, ఐరాస తీర్మానం ప్రకారం.. 2083 నాటికి గాజా తన ప్రణాళికకు పూర్తి మద్దతు పొందడంపై ఆయన దృష్టి సారించారు. అబ్రహం ఒప్పందాలలో చేరాలని కూడా ఆయన కోరుకుంటున్నారు. అమెరికా- సౌదీ సంబంధాలు పశ్చిమాసియాలో కూడా భారత ప్రయోజనాలను పరోక్షంగా ప్రభావితం చేస్తాయి.
వన్ ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి
ఈ ఏడాది మే నెలలో ట్రంప్ సౌదీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంబీఎస్ దాదాపు 600 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ఆ మొత్తం వన్ ట్రిలియన్ డాలర్లకు చేరింది.
ట్రంప్ ప్రారంభించిన ‘మాగా’ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అమెరికా ఆర్థిక వ్యవస్థలోని తయారీ, ఇతర రంగాలలో విదేశీ నిధులు సేకరించడం లక్ష్యంగా ఉన్నాయి. కానీ సౌదీ ఆదాయాలు ఒత్తిడిలో ఉన్నాయి. తమ పెట్టుబడిలో కొంత భాగాన్ని అమెరికాకు మళ్లించగలదా? సౌదీలోని ప్రయివేట్ పెట్టుబడుదారులను ఎంబీఎస్ ఒప్పించగలడా? చూడాలి.
‘‘పౌర అణు సహకార ఒప్పందం, కీలకమైన ఖనిజ సహకారంలో పురోగతులు, ఏఐ ఒప్పందాలు ముఖ్యమైనవి. ఇవన్నీ అమెరిక్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇవి యూఎస్ నిబద్దతను నొక్కి చెబుతున్నాయి’’ అని ఎంబీఎస్ పర్యటనపై యూఎస్ తన నోట్ లో పేర్కొంది.
సౌదీ భవిష్యత్ కోసం సన్నాహాలు..
పెట్రో ఆదాయంపై ఆధారపడలేమని, అందువల్ల అణుశక్తిపై ఎంబీఎస్ ఆసక్తి కనపరుస్తున్నారు. సౌదీ అరేబియా సౌర విద్యుత్ ఉత్పత్తికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఆయన దృష్టి సారిస్తున్నారు.
గాజా కోసం ట్రంప్ రూపొందించిన ప్రణాళికలు విజయవంతం కావాలని ఎంబీఎస్ కోరుకుంటున్నారు. కానీ అతను స్వయంగా ఇందులో పాల్గొంటాడో లేదో చూడాలి. గాజా ఇప్పుడు ట్రంప్ ప్రణాళికలో భద్రంగానే ఉంది. హమాస్ అంతం కావాలని ఎంబీఎస్ కోరుకోవచ్చు.
సౌదీకి, ఇజ్రాయెల్ తో సంబంధాలు ఉన్నాయి. అవి కూడా కీలకం. సౌదీ కొన్ని సంవత్సరాలుగా రహస్యంగా యూదులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే అక్టోబర్ 7, 2023 న హమాస్ చేసిన పాశవిక దాడితో ఇజ్రాయెల్ గర్జించింది. కనివినీ ఎరగని రీతిలో ఐడీఎఫ్ దాడులు చేసింది.
ఇది పశ్చిమాసియాలో అశాంతికి కారణమైంది. అయితే రెండు దేశాల విధానానికి అంగీకరిస్తేనే అబ్రహం ఒప్పందంలో చేరతామని ఎంబీఎస్ చెప్పవచ్చు. ఇజ్రాయెల్, ట్రంప్ దీనికి ఒప్పుకునే అవకాశం లేదు.
భారత్ కు సవాళ్లు..
పశ్చిమాసియా వివాదాలకు దూరంగా ఉండటం, అక్కడి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం అనే విధానాన్ని ప్రస్తుతం న్యూఢిల్లీ పక్కన పెట్టింది. అమెరికా, భారత్, ఇజ్రాయెల, యూఏఈ లతో ఐ2యూ2 అనే సమూహంలో న్యూఢిల్లీ చేరింది. ఇది ఐఎంఈసీ కారిడార్ ను కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంది.
పశ్చిమాసియాలో మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదరడం. దీనికి ట్రంప్ ఆశీస్సులు ఉండవచ్చు.
ప్రపంచ వ్యవహారాల్లో ముఖ్యంగా అనైతిక పొత్తుల సమయంలో శత్రు దేశాల నుంచి ఉత్పన్నమయ్యే సవాళ్లకు ఎదుర్కోవడానికి దేశంలో ఐక్యత అవసరం. ఎంబీఎస్ పర్యటన తరువాత ఇఫ్పుడు స్పష్టంగా కనిపిస్తున్న సవాళ్లను మోదీ ప్రభుత్వం ఎదుర్కోగలదా? చూడాలి.
( ఫెడలర్ అన్ని అభిప్రాయాలను అందించడానికి ప్రయత్నిస్తోంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. ఇవి ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు. ఫెడరల్ కేవలం వేదిక మాత్రమే)



Read More
Next Story