
‘‘ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి’’
గౌహతి హైకోర్టును కోరిన అస్సాం ప్రముఖ గాయకుడు జుబీన్ భార్య గరిమా
అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి కేసు వివాదాస్పదంగా మారింది. కేసు విచారణ వేగవంతానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని జుబీన్ భార్య గరిమా గార్గ్ గౌహతి హైకోర్టును కోరారు. తన భర్త మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అభ్యర్థించారు కూడా.
గార్గ్ 2022 సెప్టెంబర్ 19న నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. అక్కడ విరామం దొరకడంతో సముద్రంలో ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ చనిపోయారు. అయితే ఆయనను పథకం ప్రకారం హత్య చేశారన్న ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం కేసు విచారణకు సీఐడీకి అప్పగించింది.
అధికారులు ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. కొన్ని నెలలకు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం జుబీన్ గార్గ్‌కు చెందిన ఇద్దరు పీఎస్ఓలు – నందీశ్వర్ బోరా, ప్రబిన్ బైశ్యా జైలులో ఉన్నారు. ఈ ఇద్దరిపై కూడా నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

