యువతపై ఆ విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
x

యువతపై ఆ విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

దేశంలో యువత కి ఎదురువుతున్న ఇబ్బందులు, తదనంతరం వారు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా తమ సొంతదారిని ఎంచుకోవడంపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.


దేశ యువతలో పెరుగుతున్న ఆత్మహత్య ధోరణిపై లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఏ విషయంలో భయపడి లేదా ఆందోళన చెంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటి నివారణకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలన్నారు. దేశంలో యువతలో “పెరుగుతున్న” ఆత్మహత్యల రేటు చాలా విచారకరం, ఆందోళన కలిగిస్తుంది, మాజీ కాంగ్రెస్ చీఫ్ తన వాట్సాప్ ఛానెల్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

గత దశాబ్ద కాలంలో 0-24 ఏళ్ల మధ్య వయసు పిల్లల జనాభా 58.2 కోట్ల నుంచి 58.1 కోట్లకు తగ్గగా, విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుంచి 13,044కి పెరిగిందని రాహుల్ చెప్పారు. “భారతదేశం నేడు అత్యధిక యువజన జనాభాను కలిగి ఉంది. యువత సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు, ఒత్తిళ్లకు గురిచేయడం విచారకరం' అని అన్నారు.
లెక్కలేనన్ని బాధలు
ఇది సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా చాలా లోతైన సమస్యలను సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారీ నిరుద్యోగం, పేపర్ లీక్‌లు, విద్యలో అవినీతి, ఖరీదైన చదువులు, సామాజిక అణచివేత, ఆర్థిక అసమానతలు, తల్లిదండ్రుల ఒత్తిడి.. ఇలా నేటి విద్యార్థులు లెక్కలేనన్ని సమస్యలతో పోరాడుతూనే విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని రాహుల్ అన్నారు.
"విద్యార్థులు, యువత ఈ క్లిష్ట మార్గాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం సాధ్యమైన ప్రణాళికను రూపొందించాలని నేను ఆశిస్తున్నాను, అలాంటి వారికి ఇవి మద్దతునిస్తుంది, వారి మార్గంలో అడ్డంకులు సృష్టించకూడదు " అని ఆయన అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు వారికి మానసిక మద్దతు, ప్రోత్సాహాన్ని అందించాలని అభ్యర్థించారు.
" దేశంలోని యువతకు ఒక విజ్ఞప్తి -- సమస్యలకు వ్యతిరేకంగా మీ గొంతును విప్పండి. ప్రశ్నించండి, మీ హక్కులను డిమాండ్ చేయండి. భయపడకండి!" అన్నాడు. "నేను మీకు అండగా ఉంటాను. మీ హక్కుల కోసం వీధుల నుంచి పార్లమెంటు వరకు పోరాడుతూనే ఉంటాను" అని ఆయన అన్నారు.
పెరుగుతున్న ఆత్మహత్యల కేసులు
జనాభా పెరుగుదల రేటు, మొత్తం ఆత్మహత్యల పోకడలను అధిగమిస్తూ భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు ప్రమాదకర స్థాయిలో ఓ వార్షిక నివేదిక పేర్కొంది. ఇవి బయటకు వచ్చిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం మొత్తం ఆత్మహత్యల సంఖ్య ఏటా 2 శాతం పెరుగుతుండగా, విద్యార్థుల ఆత్మహత్యల కేసులు 4 శాతం పెరిగాయని నివేదిక ఎత్తి చూపింది.
భయంకరమైన...
“ గత రెండు దశాబ్దాలుగా, విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే రెట్టింపు స్థాయిలో వార్షికంగా 4 శాతం పెరిగాయి. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో 53 శాతం (శాతం) మగ విద్యార్థులు ఉన్నారు. "2021- 2022 మధ్య, మగ విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గాయి, అయితే మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు 7 శాతం పెరిగాయి" అని IC3 ఇన్స్టిట్యూట్ సంకలనం చేసిన నివేదిక పేర్కొంది.
"విద్యార్థుల ఆత్మహత్యల సంభవం జనాభా పెరుగుదల రేట్లు, మొత్తం ఆత్మహత్య పోకడలు రెండింటినీ మించిపోయింది." "గత దశాబ్దంలో, 0-24 సంవత్సరాల వయస్సు గల వారి జనాభా 582 మిలియన్ల నుంచి 581 మిలియన్లకు తగ్గగా, విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుండి 13,044కి పెరిగింది" అని అది పేర్కొంది.
(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి: నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం - 044-24640050; ఆత్మహత్య నివారణ, భావోద్వేగ మద్దతు & గాయం సహాయం కోసం ఆసరా హెల్ప్‌లైన్ - +91-9820466726; కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం - 590000 0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, మరియు స్నేహ ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్ 044-24640050.)


Read More
Next Story